ఈ పండుగ సీజన్‌లో కారు ఎందుకు కొనకూడదు..?

By Ravi

సాధారణంగా అమ్మకాలు పెంచుకునేందుకు కార్ కంపెనీలు పండుగ సీజన్‌ల నెపంతో తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తూ, కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటికే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకులు వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఫీజులను తగ్గించాయి. అలాగే కార్ కంపెనీలు కూడా భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. మారుతి సుజుకి తమ కార్లపై రూ.40,000 వరకూ తగ్గింపులను అందిస్తుండగా, హ్యుందాయ్ తమ చిన్న కారు ఇయాన్‌పై 12 శాతం తగ్గింపును, టాటా మోటార్స్ తమ ప్రజల కారు నానోపై రూ.40,000 మేర తగ్గింపులను ఆఫర్ చేస్తోంది.

ఈ ఆఫర్లను చూసి ఊరిపోయే కస్టమర్లు తమను తాము కంట్రోల్ చేసుకోలేక చటుక్కున వెళ్లి కారును కొనేస్తుంటారు. అయితే, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. కార్లపై బెస్ట్ డీల్స్ పొందటానికి ఇది సరైన సమయం కాదు. పటిష్టమైన కొనుగోలుదారులు తమ స్వంత కారును సొంతం చేసుకునేందుకు మరికొంత కాలం ఎదురు చూస్తారు. ఇందుకు చాలానే కారణాలున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..!

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం రానున్న కాలంలో కార్లపై మరిన్ని మంచి డీల్స్ లభించే అవకాశం ఉంది. కార్ కంపెనీలు మంచి డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నప్పటికీ, గడచిన పండుగ సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో షోరూమ్‌లు వచ్చి విచారించే కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ నికుంజ్ సంఘీ తెలిపారు. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెలలో అమ్మకాలు 5.36 శాతం తగ్గి 1,66,464 యూనిట్ల నుంచి 1,57,536 యూనిట్లకు పడిపోయాయి.

Why You Should Not Buy A Car In This Festive Season

ఈ వారంలో ఆరు కొత్త కార్లు మార్కెట్లో వచ్చినప్పటి, ఫెస్టివ్ ఆఫర్లు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న కారణంగా అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, ఈ ఏడాది చివర్లో కార్ కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు మరిన్ని ఆఫర్లు కొనుగోలుదారుల ముందుకు రానున్నాయి. గుర్తుందా.. గడచిన సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా కార్ కంపెనీలు ఇయరెండ్ స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాబట్టి, పండుగ సీజన్‌లో కారును సొంతం చేసుకోవాలనే సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, మంచి డీల్‌లో కారును పొంది జేబులో కాస్త సొమ్మును ఆదా చేసుకోవాలంటే మాత్రం మరికొంత కాలం ఆగితే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. మరోవైపు, పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పెట్రోల్ కార్ల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కార్ కంపెనీ మరింత అధిక మొత్తాలలో తగ్గింపులు/ప్రోత్సాహకాలను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

కారు రీసేల్ వ్యాల్యూ గురించి కూడా ఆలోచించండి..
ప్రస్తుత సీజన్‌లో వాహనాలను కొనుగోలు చేసే ముందు ప్రధానంగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే ఏడాది ఆరంభంలో వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రస్తుతం వాహనాన్ని కొనుగోలు చేయడానికి ధరలో ఖచ్ఛితం తేడా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆఫర్ కింద ఓ కారును కేవలం రూ.2.5 లక్షలకే కొనుగోలు చేసినట్లయితే వచ్చే ఏడాది దీని ధర కాస్తతంత అధికమైన ఆశ్చర్యం లేదు. మీరు వాహనం యొక్క రీసేల్ గురించి ఆలోచించినట్లయితే, ప్రస్తుత సీజన్‌లో కారును కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

ఎందుకంటే, జనవరి 2012లో వాహనాన్ని కొనుగోలు చేసినా డిసెంబర్ 2012లో వాహనాన్ని కొనుగోలు చేసిన మోడల్ ఇయర్ మాత్రం 2012 గానే ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు వాహనాన్ని కొనుగోలు చేసి సమీప భవిష్యత్తులో రీసేల్‌కు ఉంచినట్లయితే కారు మోడల్ ఇయర్‌ను బట్టి దీని వెల తగ్గే అవకాశం ఉంది. వాహనాల రీసేల్ విషయంలో మోడల్ ఇయర్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది వాహన విలువను ప్రభావితం చేస్తుంది.

ఉదాహరణకు ఓ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్‌కి వెళ్లి 2008 మోడల్ స్విఫ్ట్ కారు ధరను, 2009 మోడల్ స్విఫ్ట్ కారు ధరలను గమనిస్తే వీటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం మోడల్ ఇయర్. కాబట్టి రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచించే వారు ప్రస్తుత సీజన్‌లో వాహనాన్ని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

Most Read Articles

English summary
Carmakers are offering huge discounts during this festive season. There are additional offers such as free insurance, extended warranty and free accessories too. But are you really in a hurry to buy a car this year? The reason why we are asking this question is because, while there are some advantages buying cars when such discounts are available, there are some factors that may have a negative impact too.
Story first published: Friday, October 19, 2012, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X