ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో అశోక్ లేలాండ్ 'జన్ బస్'

By Ravi

ప్రముఖ వాణిజ్య వాహనల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా ఒకే స్టెప్ ఎంట్రీ, ముందు వైపు ఇంజన్ మరియు పూర్తి ఫ్లాట్ ఫ్లోర్ కలిగిన బస్సును తయారు చేసింది. ఈ బస్సు పేరు 'జన్ బస్'. పేరుకు తగినట్లుగానే ఇది ప్రజారవాణా వ్యవస్థ కోసం తయారు చేయబడిన బస్సు. పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ఈ బస్సులను ఉపయోగించనుంది.

ఇది కూడా చదవండి: బెంగుళూరులో దేశంలో కెల్లా తొలి ఎలక్ట్రిక్ బస్

అశోక్ లేలాండ్ జన్ బస్ సాధారణ సిటీ బస్సులతో పోల్చుకుంటే చాలా విశిష్టమైనది. ఇతర సిటీ బస్సులలో మాదిరిగా ఈ బస్సును ఎక్కడాని మూడు నాలుగు మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు. రోడ్డుపై కేవలం 650 మి.మీ. ఎత్తులో ఒకే స్టెప్ ఉంటుంది. అక్కడి నుంచే ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది. పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం మొత్తం 449 జన్ బస్సులకు ఆర్డర్ చేయగా, కంపెనీ ఇటీవలే మొదటి లాట్‌లో భాగం 30 జన్ బస్సులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ జన్ బస్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

తర్వాతి స్లైడ్‌లలో అశోక్ లేలాండ్ జన్ బస్సుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోండి.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

అశోక్ లేలాండ్ జన్ బస్ ఏసి/నాన్-ఏసి వెర్షన్లలో లభిస్తుంది. ఈ బస్సులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు, కంపెనీ దీనిని 'లేమ్యాటిక్' అని పిలుస్తోంది. సిటీ ప్రయాణంలో డ్రైవర్లకు తరచూ గేర్లు మార్చడం, క్లచ్ ఆపరేట్ చేయటం వంటి కష్టాలను తప్పించి వారికి సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని, అలాగే ప్రయాణీకులకు కూడా కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

జన్ బస్సులో వన్ స్టెప్ ఎంట్రీ/ఎగ్జిట్ మరియు విశాలమైన డోర్ల వలన, బస్సులోకి ఎక్కటం/దిగటం సలువుగా ఉంటుంది. 12 మీటర్ల పొడవు ఉండే ఈ బస్సు ఫ్లాట్ ఫ్లోరింగ్‌ను కలిగి ఉంటుంది. ఇంధనం ఆదా చేసేందుకు మరియు బస్‌ను యూజర్ ఫ్రెండ్లీగా ఉంచేందుకు ఇందులో ఇంజన్‌ను ముందువైపు అమర్చారు.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

జన్ బస్సును కస్టమర్ల అవసరానికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐదు లొకేషన్లలో డోర్లను అమర్చు కోవచ్చు. ఎంపిక మేరకు ఇది విభిన్న సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. బెటర్ సేఫ్టీ కోసం ఫ్రంట్, రియర్ మరియు ఇంటర్నల్ కెమెరాలను ఇందులో అమర్చారు. వీల్‌చైర్ యాక్సెస్ కోసం ర్యాంప్ కూడా ఉంటుంది.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

ఈ బస్సులో ప్రయాణించే వారే కాదు దీనిని నడిపే డ్రైవర్ కూడా సౌకర్యంగా ఫీల్ అయ్యేలా డ్రైవర్ క్యాబిన్‌ను డిజైన్ చేశారు. నీట్ అండ్ క్లీన్‌గా డిజైన్ చేసిన డ్రైవర్ వర్క్ స్పేస్, టిల్టబల్ అండ్ హైట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌తో పాటుగానే తిరిగ్ డ్యాష్‌బోర్డ్, బ్లైండ్ స్పాట్స్‌ను గుర్తించేందుకు కెమెరాలను ఇందులో అమర్చారు.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

అశోక్ లేలాండ్ జన్ బస్సులో హెచ్ సిరీస్ 6-సిలిండర్ సిఎన్‌జి ఎమ్‌పిఎఫ్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 235 హెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ లేమ్యాటిక్ (ఆటోమేటెడ్ మ్యాన్యువల్) ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

అశోక్ లేలాండ్ 'జన్ బస్'

ఫుల్ ఎయిర్ సస్పెన్షన్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, డ్రమ్/డిస్క్ (ఆప్షనల్) బ్రేక్స్, రూఫ్ మౌంటెడ్ సిఎన్‌జి సిలిండర్స్, ఎయిర్ కండిషనింగ్/హీటర్ వంటి ఫీచర్లు ఈ బస్సు సొంతం.

Most Read Articles

English summary
Commercial vehicle maker Ashok Leyland today said it would begin the handover of the world's first fully flat floor, front engine bus to the West Bengal government.
Story first published: Thursday, July 31, 2014, 15:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X