ఆస్టన్ మార్టిన్ వల్కన్ ఆవిష్కరణ: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఓ సరికొత్త స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేస్తోందని, ఇందుకు సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసిందని, ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. కాగా.. తాజాగా ఈ బ్రిటీష్ కంపెనీ తమ సరికొత్త ఆస్టన్ మార్టిన్ వల్కన్ అఫీషియల్ ఫొటోలను విడుదల చేసి, ఈ కారుకు సంబంధించి కొన్ని వివరాలను వెల్లడి చేసింది.
ఇంజన్:
ఆస్టన్ మార్టిన్ వల్కన్ కారులో వి12 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. కాకపోతే ఈ ఇంజన్‌ను సాధారణ 5.9 లీటర్ల మాదిరిగా కాకుండా 7.0 లీటర్లకు ట్యూన్ చేయనున్నారు. ఈ ఇంజన్ విడుదల చేసే శక్తి ఇంకా తెలియకపోయినప్పటికీ, ఇది కచ్చితంగా 800 హెచ్‌పి పైగా విడుదల చేస్తుందని అంచనా.

ట్రాక్ ఓన్లీ కార్:
ఆస్టన్ మార్టిన్ వల్కన్ కారును కేవలం రేస్ ట్రాక్‌లపై మాత్రమే ఉపయోగించాలి, వీటిని సాధారణ పబ్లిక్ రోడ్లపై నడపటానికి అనుమతి ఉండదు. ఇదొక ఎఫ్ఐఏ ఆమోదించబడిన ట్రాక్ ఓన్లీ కారు. ఈ రేస్ వెర్షన్ కారు ఫీచర్లు ఇలా ఉన్నాయి:
- పుష్‌రాడ్ సస్పెన్షన్ విత్ అడ్జస్టబల్ డ్యాంపర్స్
- యాంటీ-రోల్ బార్స్
- సిక్స్-స్పీడ్ సీక్వెన్షనల్ గేర్‌బాక్స్
- కార్బన్ సెరామిక్ డిస్క్
- అడ్జస్టబల్ యాంటీ-లాక్ బ్రేక్స్
- బ్రెంబో కాలిపర్స్
- అడ్జస్టబల్ ట్రాక్షన్ కంట్రోల్
- 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్
- 345-సెక్షన్ మిషెలిన్ టైర్స్

కేవలం 24 కార్లు మాత్రమే:
ఆస్టన్ మార్టిన్ కేవలం 24 యూనిట్ల వల్కన్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. ఈ కారులో ఓ రేసింగ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. వచ్చే నెలలో జరగనున్న 2015 జెనీవా మోటార్ షోలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు.



Click it and Unblock the Notifications








