మొట్టమొదటి బెంట్లీ ఎస్‌యూవీ విడుదల ఖరారు

ఇప్పటి వరకు లగ్జరీ సెడాన్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ మోటార్స్, ఇప్పుడు తాజాగా యుటిలిటీ వాహన విభాగంపై కన్నేసింది. గడచిన సంవత్సరం జరిగిన 2012 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్ (Bentley EXP 9 F Concept)కు మంచి స్పందన లభించడంతో, ప్రస్తుతం చక్కగా రాణిస్తున్న ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా తమ సత్తా ఏంటో చూపించేందుకు బెంట్లీ సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో, 2016 నాటికి పూర్తిస్థాయి ప్రొడక్షన్ వెర్షన్ ఎస్‌యూవీలను మార్కెట్లో తీసుకురావాలని బెంట్లీ నిర్ణయించింది. ప్రస్తుతం బెంట్లీ కార్ బ్రాండ్‌ జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చేతిలో ఉంది. బెంట్లీ ఎస్‌యూవీని ఇంగ్లాండ్‌లోని క్రేవేలో ఉత్పత్తి చేస్తామని, దీని వలన అక్కడ వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ వివరించింది.

బెంట్లీ తొలి ఎస్‌యూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది బెంట్లీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చైర్మన్ మార్టిన్ వింటర్‌కోర్న్ తెలిపారు. కాగా.. తమ ఇతర మోడళ్ల మాదిరిగానే ఈ ఎస్‌యూవీ కూడా విజయవంతం కాగలదని బెంట్లీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వోల్ఫ్‌గాంగ్ ష్రిబర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బెంట్లీ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ లగ్జరీ ఎస్‌యూవీ

మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ లగ్జరీ ఎస్‌యూవీ

బెంట్లీ నుంచి మార్కెట్లోకి రానున్న ఈ మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత శక్తివంతమైనది గాను అలాగే అత్యంత విలాసవంతమైనది గాను ఉండనుంది.

ఇంజన్

ఇంజన్

ప్రస్తుతం బెంట్లీ ఆఫర్ చేస్తున్న ట్విన్ టర్బోఛార్జ్‌డ్ 4.0 లీటర్ వి8 ఇంజన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ లేదా పెద్ద 6.0 లీటర్ ఇంజన్‌ను ఈ ఎస్‌యూవీలో ఉపయోగించే ఆస్కారం ఉంది. హైబ్రిడ్ వెర్షన్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

4వ మోడల్

4వ మోడల్

బెంట్లీ ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లలో కేవలం మూడు ఉత్పత్తులను మాత్రమే (కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్, కాంటినెంటల్ జిటి మరియు ముల్సాన్) విక్రయిస్తోంది. ఎస్‌యూవీ రాకతో బెంట్లీ ఉత్పత్తుల సంఖ్య 4కు చేరనుంది.

కామన్ ప్లాట్‌ఫామ్

కామన్ ప్లాట్‌ఫామ్

ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గాను, ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఇతర ఫుల్ సైజ్డ్ ఎస్‌యూవీ ప్లాట్‍‌ఫామ్‌నే బెంట్లీ ఎస్‌యూవీ తయారీ కోసం ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. పోర్షే కయిూన్, ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్‌లకు కూడా నెక్స్ట్ జనరేషన్ ప్లాట్‌ఫామ్ కామన్‌గా ఉంటుంది. బహుశా ఆడి క్యూ7, లాంబోర్గినీ యూరస్‌లకు ఇదే వర్తించే అవకాశం ఉంది.

అభివృద్ధికి అయ్యే ఖర్చు

అభివృద్ధికి అయ్యే ఖర్చు

బెంట్లీ రానున్న మూడేళ్లలో ఎస్‌యూవీ అభివృద్ధి కోసం మరియు ఇతర అభివృద్ధి ప్రాజెక్టల కోసం బెంట్లీ సుమారు 800 మిలియన్ యూరో (1.2 బిలియన్ డాలర్లు)లను ఖర్చు చేయనుంది.

ఉత్పత్తి దశ

ఉత్పత్తి దశ

2016 నాటికి పూర్తిస్థాయి ప్రొడక్షన్ వెర్షన్ ఎస్‌యూవీని మార్కెట్లో తీసుకురావాలని బెంట్లీ నిర్ణయించింది. ఈ బెంట్లీ ఎస్‌యూవీని ఇంగ్లాండ్‌లోని క్రేవేలో ఉత్పత్తి చేస్తామని, దీని వలన అక్కడ వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ వివరించింది.

కంపెనీ అధికారులు ఏమన్నారు?

కంపెనీ అధికారులు ఏమన్నారు?

బెంట్లీ తొలి ఎస్‌యూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది బెంట్లీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ చైర్మన్ మార్టిన్ వింటర్‌కోర్న్ తెలుపగా, తమ ఇతర మోడళ్ల మాదిరిగానే ఈ ఎస్‌యూవీ కూడా విజయవంతం కాగలదని బెంట్లీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వోల్ఫ్‌గాంగ్ ష్రిబర్ చెప్పారు.

2012 జెనీవా మోటార్ షో

2012 జెనీవా మోటార్ షో

గడచిన సంవత్సరం జరిగిన 2012 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్ (Bentley EXP 9 F Concept)కు మంచి స్పందన లభించడంతో, బెంట్లీ ఎస్‌యూవీ విభాగంపై కన్నేసింది.

బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్

బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్

బెంట్లీ ఈఎక్స్‌‌పి 9 ఎఫ్ కాన్సెప్ట్ లోని డిజైన్ ఫీచర్లు కొత్త బెంట్లీ ఎస్‌యూవీలో కనిపించే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
The EXP 9 F Concept revealed during last year's Geneva Motor Show attracted a lot of comments, positive and negative in equal amounts. However, it seems Bentley's potential customers are nevertheless, excited about the prospect of a luxury SUV from the British marquee. Hence, the decision making body has taken the call to go ahead with a production model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X