కార్ల ప్రపంచంలో మహా విప్లవం..పోటీ పడి చిన్న,పెద్ద ఫ్యామిలీల కోసం కొత్త ఎస్యూవీలను తెస్తున్న నిస్సాన్, రెనాల్ట్

సినిమా హాల్‌లో కొత్త సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తామో, కార్ల మార్కెట్‌లో కూడా కొత్త మోడళ్ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు జనం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న డిమాండ్ చూసి, ప్రముఖ కంపెనీలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గట్టి ప్లాన్ వేశాయి. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా, రాబోయే మూడేళ్లలో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నాయి. 2028 నాటికి ఈ కార్లన్నీ రోడ్ల మీద రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు వస్తాయి? లాంటి వివరాలు తెలుసుకుందాం.

1. ఆల్-న్యూ రెనో డస్టర్ (Renault Duster):
ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ క్రేజ్‌ను మొదలుపెట్టిందే రెనో డస్టర్. మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి కొత్త అవతారంలో డస్టర్ సిద్ధమైంది. ఈ కొత్త తరం డస్టర్ పాత దానికంటే చాలా మజిక్యులర్‌గా, అగ్రెసివ్ డిజైన్‌తో వస్తోంది. ఇందులో కేవలం పెట్రోల్ ఇంజనే కాకుండా, మైల్డ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉండబోతోంది. లోపల ఇంటీరియర్ చూస్తే.. పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం కంఫర్ట్‌తో కొత్త ఫీచర్లు యాడ్ చేశారు. ఇది మార్చి 21న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

SUV Wars Renault and Nissan to Launch 5 New SUVs to Challenge Nexon Brezza

2. నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton):
నిస్సాన్ నుంచి రాబోతున్న టెక్టాన్ ఎస్‌యూవీ పైన మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కొత్త డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారవుతున్నప్పటికీ, దీని లుక్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది చూడటానికి మరింత ప్రీమియం కార్లా అనిపిస్తుంది. హైవే డ్రైవింగ్ మరియు సిటీ డ్రైవింగ్ రెండింటికీ అనువుగా ఉండేలా నిస్సాన్ దీనిని డిజైన్ చేస్తోంది. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ తో పాటు అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఇది మన ముందుకు రావచ్చు.

3. రెనాల్ట్ 7-సీటర్ ఎస్‌యూవీ (Renault 3-Row SUV):
పెద్ద ఫ్యామిలీల కోసం రెనాల్ట్ ఒక కొత్త 3-రో ఎస్‌యూవీని ప్లాన్ చేస్తోంది. ఇది డస్టర్ కంటే పెద్దగా ఉంటుంది. 2026 చివరి నాటికి దీనిని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో 6 లేదా 7 మంది కూర్చునే వెసులుబాటు ఉంటుంది. వెనుక సీట్లలో కూడా ఏసీ వెంట్స్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఇస్తున్నారు. లాంగ్ ట్రిప్స్ వేసే ఫ్యామిలీలకు ఈ కారు ఒక లగ్జరీ ఇల్లులా అనిపిస్తుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండబోతోంది.

SUV Wars Renault and Nissan to Launch 5 New SUVs to Challenge Nexon Brezza

4. నిస్సాన్ 7-సీటర్ ఎస్‌యూవీ (Nissan 3-Row SUV):
రెనోకు పోటీగా నిస్సాన్ కూడా తన సొంత 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా దీని డిజైన్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. 2026 ఆరంభంలోనే ఈ కారు రోడ్లపైకి వచ్చే ఛాన్స్ ఉంది. నిస్సాన్ బ్రాండ్ ఇమేజ్‌ను ఈ కారు మరింత పెంచుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

5. రెనాల్ట్ బ్రిడ్జర్ (Renault Bridger):
చివరగా, మధ్యతరగతి ప్రజల కోసం రెనాల్ట్ తీసుకురాబోతున్న అద్భుతం బ్రిడ్జర్. ఇది సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో రాబోతోంది. దీని డైరెక్ట్ ఫైట్ టాటా నెక్సాన్ మరియు మారుతి బ్రెజాతో ఉండబోతోంది. తక్కువ ధరలో మంచి గ్రౌండ్ క్లియరెన్స్, బాక్సీ డిజైన్‌తో ఇది వస్తోంది. దీని వెనుక భాగంలో స్పేర్ వీల్ ఉండటం వల్ల కారుకు ఒక పక్కా ఆఫ్‌రోడర్ లుక్ వస్తుంది. 2028 నాటికి ఇది మార్కెట్లోకి వస్తుంది. సిటీలో తిరగడానికి చిన్నదిగా, చూడటానికి స్టైలిష్‌గా ఉండే కారు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

SUV Wars Renault and Nissan to Launch 5 New SUVs to Challenge Nexon Brezza

ఈ ఐదు ఎస్‌యూవీలు ఇండియాలో రెనాల్ట్, నిస్సాన్ జాతకాన్ని మార్చేయబోతున్నాయి. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, మైలేజ్, సేఫ్టీ విషయంలో కూడా ఈ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. కాబట్టి కొత్త కారు కొనాలనుకునే వారు మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచి ఆప్షన్లు మీ ముందుంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 9, 2026, 11:23 [IST]
English summary
Suv wars renault and nissan to launch 5 new suvs to challenge nexon brezza
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+