పూనేలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న గ్రేట్ వాల్ మోటార్స్

By Ravi

చైనా కార్లు ఇండియాకు రానున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. చెనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ' (జిడబ్ల్యూఎమ్‌సి) భారత మార్కెట్లోకి ప్రవేశించి, ఇక్కడే ఓ ప్లాంటును కూడా ఏర్పాటు చేసి, కార్యకలాపాలు ప్రారభించాలని జిడబ్ల్యూఎమ్‌సి భావిస్తున్నట్లు ఈ ఏడాది ఆరంభంలో మేము ఓ కథనాన్ని ప్రచురించడం జరిగింది.

ఇప్పుడు ఆ కథనాన్ని నిజం చేస్తూ, జిడబ్ల్యూఎమ్‌సి పూనేలో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోంది. చైనాలోనే అతిపెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థ మరియు ఆ దేశంలో కెల్లా 8వ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ (అమ్మకాల పరంగా 6వ అతిపెద్ద సంస్థ) అయున గ్రేట్ వాల్ మోటార్స్ తమ 'హావెల్ హెచ్5' ఎస్‌యూవీని మరికొన్ని ఇతర మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

గతంలో గ్రేట్ వాల్ మోటార్స్, న్యూఢిల్లీకి చెందిన ట్రాక్టర్ల తయారీ సంస్థ ఇంటర్నేషనల్ కార్ అండ్ మోటార్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని భారత మార్కెట్లో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. అయితే, ప్రస్తుతం భాగస్వామ్యం విఫలం కావటంతో వ్యక్తిగతంగానే ఇక్కడి మార్కెట్లో కాలు మోపాలని గ్రేట్ వాల్ మోటార్స్ నిర్ణయించింది. అంతేకాదు, ఇకపై స్థానికంగా ఎలాంటి కంపెనీలతో భాగస్వామ్యాన్ని పెట్టుకోవాలన్న యోచన కూడా ఈ సంస్థకు లేదు.

గ్రేట్ వాల్ మోటార్స్ భారత్‌లో తమ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు తొలుత తమిళనాడు, గుజరాత్ ప్రాంతాలను పరిశీలించినప్పటికీ, మహారాష్ట్ర సర్కారు ఆఫర్ చేసిన రాయితీలు, ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్లాంటు ఏర్పాటుకు పూనేను ఎంచుకున్నట్లు సమాచారం. 2016 నాటికి భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని గ్రేట్ వాల్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే త్వరలోనే చైనా కార్లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయన్నమాట.

హావెల్ హెచ్5 - 1

హావెల్ హెచ్5 - 1

హావెల్ హెచ్5 - 2

హావెల్ హెచ్5 - 2

హావెల్ హెచ్5 - 3

హావెల్ హెచ్5 - 3

హావెల్ హెచ్5 - 4

హావెల్ హెచ్5 - 4

హావెల్ హెచ్ 5 - 5

హావెల్ హెచ్ 5 - 5

హావెల్ హెచ్5 - 6

హావెల్ హెచ్5 - 6

హావెల్ హెచ్5 - 7

హావెల్ హెచ్5 - 7

హావెల్ హెచ్5 - 8

హావెల్ హెచ్5 - 8

Most Read Articles

English summary
Great Wall Motors, China's largest SUV manufacturer and the country's eighth largest automaker overall (sixth largest in terms of volume), is working towards setting up a manufacturing plant in Pune. Great Wall Motors is expected to introduce the Havel H5 suv along with a host of other cars for the Indian market.
Story first published: Monday, June 10, 2013, 15:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X