డాట్సన్ గో ప్లస్ ప్రీబుకింగ్స్ ప్రారంభం

By Ravi

డాట్సన్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి 'డాట్సన్ గో ప్లస్' (Datsun Go+) ఎమ్‌పివి ఈనెల 15వ తేదీన మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, నిస్సాన్ డీలర్లు డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కోసం ప్రీబుకింగ్స్ ప్రారంభించనున్నారు. జనవరి 3, 2015 నుంచి జనవరి 14, 2015 వరకూ ఈ మోడల్ కోసం ప్రీబుకింగ్స్ స్వీకరించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్‌‌షిప్‌ల ద్వారా కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఈ ఎమ్‌పివిని బుక్ చేసకోవచ్చు. ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైనా కస్టమర్ తమ నిర్ణయాన్ని మార్చుకుని, బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ బుకింగ్ అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిని ముందుగా బుక్ చేసుకునే కొందరు కస్టమర్లకి ఉచిత వెల్‌కమ్ ప్యాక్‌ను కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కోసం కంపెనీ ఇటీవలే రిషికేష్, ఉత్తరాఖాండ్ వద్ద ఓ మీడియా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది. మరి మా టెస్ట్ డ్రైవ్ పరీక్షలో డాట్సన్ గో ప్లస్ ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసుకునేందుకు ఈ క్రింది లింకుపై కానీ లేదా ఫొటోపై కానీ క్లిక్ చేయండి.

డాట్సన్ గో ప్లస్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ


డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుందని కంపెనీ తెలిపింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఈ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ని గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Datsun today announced the start of pre-booking of its Datsun GO+ Compact Family Wagon in India. The GO+ was previewed at the last Delhi Auto Expo and will be available for pre-booking between January 03rd & 14th 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X