ఫార్చ్యూనర్, ఎండీవర్‌లకు ధీటుగా ఫోర్స్ ప్రీమియం ఎస్‌యూవీ

Posted By:

ఇటీవలే చవక వేరియంట్ ఫోర్స్ వన్ ఎస్‌యూవీని విడుదల చేసిన ఫోర్స్ మోటార్స, ఇప్పుడు ఓ ప్రీమియం ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి మోడళ్లకు ధీటుగా ఓ ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో ఉంది ఫోర్స్ మోటార్స్.

ప్రస్తుతం ఫోర్స్ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ దశలో ఉంది. రానున్న రెండేళ్లలో ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. ధర విషయంలో ఇది రూ.18 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఫోర్స్ మోటార్స్ రూ.1000 కోట్ల పెట్టుబడిలో భాగంగా ఈ ప్రీమియం ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఫోర్స్ ప్రీమియం ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button

కాగా.. ఫోర్స్ మోటార్స్ ఇటీవల ప్రవేశపెట్టిన గుర్ఖా ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీకి, ఎంట్రీ లెవల్ వేరియంట్ ఫోర్స్ వన్ ఎస్‌యూవీల ద్వారా ప్యాసింజర్ వాహన సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని ఫోర్స్ మోటార్స్ యోచిస్తోంది.

Force One SUV

ఫోర్స్ వన్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ

ఫోర్స్ మోటార్స్ ఇటీవలే ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో రెండు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో లోకాస్ట్ వేరియంట్‌ను ఎగ్జిక్యూటివ్ (ఈఎక్స్) అని పిలుస్తారు. దీని ధర రూ.8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. మరొక వేరియంట్‌ను లగ్జరీ (ఎల్ఎక్స్) అని పిలుస్తారు. దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

బేస్ వేరియంట్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్స్, అల్లాయ్ వీల్స్, సైడ్ మిర్రర్లపై ఇండికేటర్స్, లెథర్ సీట్స్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, ఆల్ టెర్రైన్ టైర్లు మరియు క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ లాకింగ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, రియర్ వైపర్ వంటి ఫీచర్లు లేవు. ధరను తక్కువగా ఉంచేందుకే ఈ ఫీచర్లన్నింటినీ తొలగించారు. ఈ బేస్ వేరియంట్ (ఎక్స్)లో ఇంజన్ పరంగా కూడా మార్పులు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన 2.2 లీటర్ ఇంజన్ స్థానంలో, కొత్త ఫోర్స్ గుర్ఖాలో ఉపయోగించిన 2.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది బిఎస్-3 ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 80 పిఎస్‌ల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో ఈ మోడల్ ధరలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్స్ వన్ ఈఎక్స్ (7-సీటర్) - రూ.8,99,000
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ (7-సీటర్) - రూ.11,91,291
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ (6-సీటర్) - రూ.11,99,002
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ ఏబిఎస్ (6-సీటర్) - రూ.12,27,821
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ ఏబిఎస్ (7-సీటర్) - రూ.12,20,188

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Force Gurkha SUV

ఫోర్స్ గుర్ఖా గురించి..

కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పిల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌‌ను కలిగి ఉంటుంది. ఫోర్స్ గుర్ఖా ప్రస్తుతానికి బిఎస్-3 వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, బిఎస్-4 వెర్షన్‌ త్వరలో విడుదల కావచ్చని అంచనా.

ఫోర్స్ గుర్ఖా మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అందులో ఒకటి ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్‌తో కూడిన 5-సీటర్ వేరియంట్ కాగా రెండు సాఫ్ట్ టాప్‌తో కూడిన 6-సీటర్ వేరియంట్స్ (వీటిల్లో ఒకటి టూ-వీల్ డ్రైవ్ మరొకటి 4-వీల్ డ్రైవ్). ఈ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ 'థార్' ఎస్‌యూవీతో ఇది తలపడనుంది. భారత మార్కెట్లో ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్ - రూ.8.50 లక్షలు
  • ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.8.35 లక్షలు
  • ఫోర్స్ గుర్ఖా టూ-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.6.25 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

English summary
According to sources, Force Motors has is planing to launch a premium SUV in Indian that can be challenged to Toyota Fortuner, Ford Endeavour. The premium SUV that is in the concept stage could be ready for production in the next couple of years.
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark