బెటర్ పెర్ఫార్మింగ్ వ్యాగన్ఆర్‌ను ప్రవేశపెట్టనున్న మారుతి!

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అనేక మంది భారతీయుల మది దోచుకున్న సంగతి తెలిసినదే. ఈ సెగ్మెంట్లోకి ఎన్ని కొత్త కార్లు వచ్చినా, వాటి నుంచి ఎదురయ్యే పోటీని సమర్థవంతంగా ఎదుర్కొని, వ్యాగన్ఆర్ ఇండియాలో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

మారుతి సుజుకి ఈ హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా 1993లో పరిచయం చేసింది. ఆ తర్వాత కాలక్రమంలో ఇందులో అనేక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు, అప్‌డేటెడ్ మోడళ్లు చాలానే వచ్చాయి. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కన్నా మరింత ఉత్తమ పెర్ఫార్మెన్స్ కలిగిన వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

బెటర్ పెర్ఫార్మెన్స్ కేవలం ఇంజన్ స్పీడ్ లేదా పెద్ద పరిమాణపు ఇంజన్‌పైనే కాకుండా మైలేజ్‌ను పెంచేందుకు అలాగే ఇంజన్ విశ్వసనీయతను పెంచేందుకు కూడా మారుతి సుజుకి ఇంజనీర్లు కృషి చేస్తున్నారు.


ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‍‌బ్యాక్ ఐదవ తరానికి (ఫిఫ్త్ జనరేషన్) చెందినది. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్ డిజైన్, సాటిలేని మైలేజ్‌తో ఇది మొదటి సారిగా కారు కొనాలనుకునే కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుటుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో రీఫైన్డ్ 998సీసీ (1.0లీటర్) కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Maruti Wagon R

ఈ ఇంజన్‌ను మునుపటి వెర్షన్ల కన్నా మెరుగైన మైలేజీనిచ్చేలా అప్‌గ్రేడ్ చేశారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ లీటరుకు 20.51 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది. వాస్తవానికి పెట్రోల్ వెర్షన్‌లో అత్యధికంగా మైలేజీనిచ్చే కార్లలో ఇది కూడా ఒకటి.

టాప్ ఎండ్ వేరియంట్ వ్యాగన్ఆర్‌లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ గార్నిష్, డ్రైవర్‌సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ సీట్‌బెల్ట్ ఇండికేటర్, రియర్ వైపర్, వాషర్ అండ్ డిఫాగ్గర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
In an attempt to bring back customers to its Wagon R hatchback, the Japanese manufacture Maruti Suzuki is being believed working on a better performing vehicle. When they say performing, it does not mean higher speed or a bigger engine. The engineers at Suzuki will be improving the fuel efficiency and reliability of the engine.
Story first published: Saturday, June 21, 2014, 18:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X