రెనో లాజీ బుకింగ్స్ ప్రారంభం; అతి త్వరలో విడుదల

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన సరికొత్త 'రెనో లాజీ' (Renault Lodgy)ని మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు కొన్ని చోట్ల రెనో ఇండియా డీలర్లు ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.

అందరి కన్నా ముందుగా రెనో లాజీ ఎమ్‌పివిని పొందాలనుకునే కస్టమర్లు రూ.50,000ల పూర్తి రీఫండబల్ అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

ఎమ్‌పివి సెగ్మెంట్లో అలజడి సృష్టించేందుకు వస్తున్న రెనో లాజీకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

7-సీటర్

7-సీటర్

వాస్తవానికి లాజీ ఎమ్‌పివి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్యాడ్జ్ క్రింద విక్రయిస్తున్నారు. రెనో లాజీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి. చెన్నైకి సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో లాజీ ఎమ్‌పివిని తయారు చేయనున్నారు.

డిజైన్

డిజైన్

ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో డిజైన్ చేసిన ఈ గ్లోబల్ మోడల్ ఎమ్‌పివి మంచి ప్రీమియం లుక్స్‌ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో నిస్సాన్ విక్రయిస్తున్న ఇవాలియా ఎమ్‌పివి కన్నా రెనో లాజీ డిజైన్ ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది.

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

రెనో లాజీ ఎమ్‌పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఒకవేళ ఇందులో పెట్రోల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లయితే, కంపెనీ తమ డస్టర్‌లో ఉపయోగిస్తున్న 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ధర

ధర

దేశీయ విపణిలో రెనో లాజీ ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

కాంపిటీషన్

కాంపిటీషన్

భారత మార్కెట్లో ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, షెవర్లే ఎంజాయ్, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Most Read Articles

English summary
Renault India is betting high on its new MPV, the ‘Lodgy' that will be launched in the following month. The French manufacturer has commenced booking of its MPV through it dealerships.
Story first published: Saturday, March 28, 2015, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X