కన్వర్టిబల్ మోడల్‌ను తీసుకురానున్న రోల్స్ రాయిస్

Written By:

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్, తొలిసారిగా ఓ కన్వర్టిబల్ మోడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. త్వరలోనే రోల్స్ రాయిస్ కన్వర్టిబల్ కారును తీసుకువస్తామని చెన్నైలో ఘోస్ట్ సిరీస్ 2 కారును విడుదల చేసిన సందర్భంగా.. కంపెనీ ఏషియా పసిఫిక్ రీజియన్ జనరల్ మేనేజర్ స్వెన్ జే రిట్టర్ తెలిపారు.

తాము కన్వర్టిబల్ కారును విడుదల చేసినట్లయితే, అది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. ఆ కారుకు సంబంధించి అంతకు మించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

కాగా.. చెన్నై మార్కెట్లో విడుదల చేసిన రెండవ తరం (సెకండ్ జనరేషన్) ఘోస్ట్ సిరీస్ కారును ఇంగ్లాండ్‌లోని గుడ్‌వుడ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసి, పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. చెన్నై మార్కెట్లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ కారు ధర రూ.4.50 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 కారులో 6.0 లీటర్, ట్విన్ టర్బో, వి12, డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 563 బిహెచ్‌పిల శక్తిని, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 780 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా ఈ ఇంజన్‌ను సరికొత్త 8-స్పీడ్ జెడ్ఎఫ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేశారు.

ఈ కారు కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 సిటీ రోడ్లపై ప్రతి 100 కిలోమీటర్లకు 21.4 లీటర్లు మరియు హైవేపై ప్రతి 100 కిలోమీటర్లకు 9.8 లీటర్ల ఇంధనాన్ని స్వాహా చేస్తుంది.

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఘోస్ట్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
As part of expanding its offerings, ultra luxury car maker Rolls-Royce Motor Cars Ltd will roll out a new convertible model soon in the market, a top company official said during the launch Ghost Series II in Chennai.
Story first published: Sunday, February 15, 2015, 9:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos