2017లో రోల్స్ రాయిస్ ఎస్‌యూవీ ప్రవేశం!

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ కూడా ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల) విభాగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గగడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా రిపోర్ట్ ప్రకారం, రోల్స్ రాయిస్ 2017లో తమ మొట్టమొదటి ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు సమాచారం.

రోల్స్ రాయిస్ తొలుత ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రవేశించేందుకు నిరాకరించింది. అయితే, ఇప్పుడు కాలం మారింది. పొడవుగా ఉండే సెడాన్ల కన్నా పెద్దగా ఉండే ఎస్‌యూవీలంటేనే కొనుగోలుదారులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే, కేవలం లగ్జరీ సెడాన్లు, స్పోర్ట్స్ కార్లను మాత్రమే తయారు చేసే బెంట్లీ, జాగ్వార్ వంటి కంపెనీలు ఎస్‌యూవీల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసినదే.

Rolls Royce SUV

కాగా.. రోల్స్ రాయిస్ ఎస్‌‌యూవీ డిజైన్ ఎలా ఉండబోతుందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఇది డ్రాయింగ్ దశలో ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం రోల్స్ రాయిస్ అందిస్తున్న కార్లనే (ఘోస్ట్, ఫాంటమ్) ఉపయోగించి కొత్త ఎస్‌యూవీని డిజైన్ చేయటం కాకుండా, సరికొత్త డిజైన్ సిద్ధాంతంతో కూడిన ఓ మోడ్రన్ ఎస్‌‌యూవీని డిజైన్ చేయాలని రోల్స్ రాయిస్ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు.

రోల్స్ రాయిస్ నుంచి రానున్న ఈ ఎస్‌యూవీ ఓ మోడిఫైడ్ వెహికల్‌లా కాకుండా ఒక నిజమైన ఆఫ్-రోడర్‌గా ఉండనుంది. అంతేకాకుండా, పరిమాణంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌కె కన్నా పెద్దదిగా కంపెనీ తమ ఎస్‌యూవీని డిజైన్ చేయనుంది. తాము మొట్టమొదటి సారిగా ఎస్‌యూవీని తయారు చేయనున్న నేపథ్యంలో, అన్ని కోణాల్లో దీనిపై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.

Most Read Articles

English summary
British super luxurious manufacturer of vehicles Rolls Royce will be entering the luxury Sports Utility Vehicle segment in 2017. They haven't confirmed how the SUV will look so far and is still in the drawing room stage.
Story first published: Wednesday, May 14, 2014, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X