బెంగుళూరులో టాటా బోల్ట్ విడుదల; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఈనెల 22వ తేదీన భారత విపణిలో విడుదల చేసిన సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్'ను కంపెనీ తాజాగా బెంగుళూరు వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కర్ణాటక మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ బోల్ట్ ప్రారంభ ధర రూ.4.50 లక్షలు గాను, డీజిల్ వెర్షన్ బోల్ట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు గాను (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు) ఉన్నాయి.

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో (నాలుగు పెట్రోల్, నాలుగు డీజిల్) లభ్యం కానుంది. వాటి ఎక్స్-షోరూమ్ (బెంగుళూరు) ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

పెట్రోల్ వెర్షన్ ధరలు:

  • టాటా బోల్ట్ ఎక్స్ఈ - రూ.4.50 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్ఎమ్ - రూ.5.22 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్ఎమ్ఎస్ - రూ.5.46 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్‌‌టి - రూ.6.14 లక్షలు

డీజిల్ వెర్షన్ ధరలు:

  • టాటా బోల్ట్ ఎక్స్ఈ - రూ.5.59 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్ఎమ్ - రూ.6.21 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్ఎమ్ఎస్ - రూ.6.45 లక్షలు
  • టాటా బోల్ట్ ఎక్స్‌‌టి - రూ.7.12 లక్షలు

Tata Bolt Launched In Bangalore
టాటా బోల్ట్ పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:
పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో, టాటా మోటార్స్ అందిస్తున్న సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కానీ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కానీ అందుబాటులో లేదు.
Tata Bolt Bangalore

టాటా బోల్ట్ డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్:
డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, టాటా జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ అందుబాటులో లేదు.

మైలేజ్:
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా బోల్ట్ మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • పెట్రోల్ వెర్షన్ బోల్ట్ - 17.57 కెఎంపిఎల్
  • డీజిల్ వెర్షన్ బోల్ట్ - 22.95 కెఎంపిఎల్
Most Read Articles

English summary
Tata Motors today have launched their highly anticipated 'Bolt' hatchback in Bangalore India. The Indian manufacturer had showcased its new hatchback and compact sedan at the 2014 Auto Expo in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X