ల్యాండ్ రోవర్ ప్లాట్‌ఫామ్‌పై టాటా ఎస్‌యూవీ!

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను స్వాధీనం చేసుకొని దాదాపు 7 ఏళ్లు పూర్తికావస్తున్నప్పటికీ, ఇంత వరకూ టాటా తమ జేఎల్ఆర్ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. ఈ రెండు సంస్థల కలయికతో ఓ కొత్త మోడల్ ప్రాణం పోసుకోనుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. టాటా మోటార్స్ మరియు ల్యాండ్ రోవర్ కంపెనీలు కలిసి క్యూ501 అనే కోడ్‌నేమ్‌తో ఓ ప్రీమియం ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ (ఎల్550) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ఈ కొత్త క్యూ501 మోడల్‌ను కూడా తయారు చేయనున్నట్లు సమాచారం.

Tata To Develop Land Rover Based Premium SUV

టాటా క్యూ501 ఎస్‌యూవీలో ఫియట్ 2.0 మల్టీజెట్ 2 ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పిల నుంచి 175 బిహెచ్‌పిల మధ్యలో శక్తిని ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుతం ఫియట్ ఈ ఇంజన్‌ను ఇండియాలో అసెంబ్లింగ్ చేయటం లేదు. ఒకవేళ టాటా మోటార్స్ ఇదే ఇంజన్‌ను ఉపయోగించాల్సి వస్తే, సదరు ఇంజన్‌ను విదేశాల దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

ఫలితంగా, కారు ధర కూడా అనుకున్న దానికన్నా ఎక్కువయ్యే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఫియట్ ఇండియా భవిష్యత్తులో తమ జీప్ బ్రాండ్ మోడళ్లకు ఈ ఇంజన్‌ను ఇక్కడే భారత్‌లో అసెంబ్లింగ్ చేసినట్లయితే, ఇంజన్ ధర దిగొచ్చే అవకాశం ఉంది. టాటా నుంచి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ సఫారీ మాత్రమే. అయితే, ఈ కొత్త క్యూ501 ఎస్‌యూవీ సఫారీ ఎగువన ఈ సెగ్మెంట్లో టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా రావచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Tata Motors and it's British luxury car brand Jaguar Land Rover are jointly working on new premium SUV for the Indian market, which will wear Tata Motors' badge. The all new Tata premium SUV expected priced will be around Rs. 20-25 lakh and it will be pitted against the likes of Toyota Fortuner.
Story first published: Tuesday, February 17, 2015, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X