ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే 'కార్ క్లీనింగ్'

By Ravi

ఇల్లు అలకగానే పండుగ కాదు, అలాగే కారు కొనగానే ముచ్చట తీరిపోదు. కారును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోటవటం కూడా ఎంతో అవసరం. ప్రతిసారి క్లీనింగ్ కోసం సర్వీస్ సెంటర్‌కు తీసుకు వెళ్లాలంటే, పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. మరి ఈ ఖర్చు నుంచి తప్పించుకోవటం ఎలా..? ఏముంది సింపుల్ మీ కారును మీరే శుభ్రం చేసుకోవటం.

వారాతంపు రోజుల్లో ఖాలీగా ఉండే సమయాన్ని వృధా చేసుకోకుండా కారు క్లీనింగ్ కోసం ఓ గంట వ్యవధిని కేటాయిస్తే చాలు. మీ కారును కొత్త పెళ్లికూతురిలా తళతళా మెరిపించేయవచ్చు. కార్ క్లీనింగ్ కోసం ఖరీదైన కార్ పాలిష్‌లే ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కారును శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1. అద్దాల క్లీనింగ్ కోసం

1. అద్దాల క్లీనింగ్ కోసం

కారు అద్దాలను క్లీన్ చేసేందుకు ఖరీదైన స్ప్రేలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓ ఖాలీ స్ప్రే బాటిల్‌లో మూడు భాగాల డిస్టల్డ్ వెనిగర్, ఒక భాగం నీరు కలిపి అద్దాలపై స్ప్రే చేస్తూ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసేటప్పుడు బట్టను ఉపయోగించడం కన్నా పాత న్యూస్‌పేపర్‌ను ఉపయోగించినట్లయితే, మంచి ఫలితం లభిస్తుంది.

2. సీట్స్ (అప్‌హెలెస్ట్రీ) క్లీనింగ్ కోసం

2. సీట్స్ (అప్‌హెలెస్ట్రీ) క్లీనింగ్ కోసం

లెథర్ సీట్లను క్లీన్ చేయటం కష్టం. ఇలాంటి సందర్భాల్లో పైన తెలిపిన పద్ధతిని ఉపయోగించి సీట్లను క్లీన్ చేసుకోవచ్చు. అయితే, క్లాత్ సీట్ల విషయంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. వీటి క్లీనింగ్ కోసం మూడు భాగాల డిష్ డిటర్జెంట్‌ను ఒక భాగం నీటిని బాగా కలిపి, మురికి పట్టిన భాగాలపై స్ప్రే చేసి బట్టతో కానీ లేదా బ్రష్‌తో కానీ క్లీన్ చేసుకోవచ్చు.

3. వీల్స్ క్లీనింగ్ కోసం

3. వీల్స్ క్లీనింగ్ కోసం

కారు చక్రాలు ఎప్పుడు తళతళలాడుతు ఉండాలంటే, నాలుగొంతుల వెజిటబుల్ ఆయిల్ ఆధారిత లిక్విడ్ సోప్‌ను 3.5 లీటర్ల వేడి నీటిని తీసుకొని ఓ బకెట్లో రెండింటిని బాగా కలపాలి. నీళ్లు గ్రహించే బట్ట లేదా స్పాంజ్‌ను తీసుకొని, మెత్తని బ్రష్ లేదా స్క్రబ్ సాయంతో రుద్దుతూ క్లీన్ చేయాలి.

4. హెడ్‌లైట్ క్లీనింగ్ కోసం

4. హెడ్‌లైట్ క్లీనింగ్ కోసం

హెడ్‌లైట్లపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను వేసి, నైలాన్ బ్రష్‌తో స్క్రబ్ చేయండి. అనంతరం, గోరు వెచ్చని నీటిని ఉపయోగించి హెడ్‌లైట్లపై ఉన్న టూత్‌పేస్ట్ పోయే వరకు క్లీన్ చేసిన తర్వాత, దుమ్ములేని పొడి బట్టను తీసుకొని శుభ్రం చేయండి.

5. విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్

5. విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్

వోడ్కా.. మందు బాబులకు దీని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది తాగడానికే కాదు, కారు అద్దాలను క్లీన్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. 3 కప్పుల వోడ్కా, 4 కప్పుల నీళ్లు, 2 టీస్పూన్ల లిక్విడ్ డిష్‌వాషింగ్ డిటర్జెంట్‌ను కలిగి విండ్ షీల్డ్ రిజర్వాయర్‌లో నింపండి. దీంతో అద్దాలను తుడిస్తే, తళతళా మెరుస్తాయి.

6. కార్ ఫ్రెషనర్

6. కార్ ఫ్రెషనర్

కారు ఫ్రెషనర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నాలుగో వంతు నీటిలో 5 నుంచి 10 చుక్కల మీ ఛాయిస్ ప్రకారం ఆరోమాటిక్ ఆయిల్‌ను కలపండి, అంతే మీ కార్ పెర్ఫ్యూమ్ రెడీ. లెమన్, గ్రేప్‌ఫ్రూట్, లావెండర్, స్ప్రూస్ వంటి వంటి పాపుల్ ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి కావల్సినప్పుడు కారులో స్ప్రే చేసుకోవచ్చు.

7. డ్యాష్‌బోర్డ్ డ్రెస్సింగ్/ప్రొటెక్టర్

7. డ్యాష్‌బోర్డ్ డ్రెస్సింగ్/ప్రొటెక్టర్

ఒక కప్పు ఆలివ్ ఆయిల్, అర కప్పు లెమన్ జ్యూస్‌ను ఓ బౌల్‌లో కలిపి శుభ్రమైన బట్టతో డ్యాష్ బోర్డును క్లీన్ చేయండి. కేవలం డ్యాష్‌బోర్డునే కాకుండా కారులోని ఇతర ప్లాస్టిక్ భాగాలను ఈ మిశ్రమంతో క్లీన్ చేసినట్లయితే, శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి.

8. క్రోమ్ పాలిష్

8. క్రోమ్ పాలిష్

కారులో క్రోమ్ భాగాలను (సిల్వర్ కలర్‌లో మెరుస్తూ ఉండేవి) తళతళలాడే ఉంచాలనుకుంటే, బేబీ ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్‌ను సమాన కొలతలలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని బట్టతో క్రోమ్ భాగాలపై అద్దాలి. ఆ తర్వాత పొడి బట్టును తీసుకొని క్లీన్ చేసినట్లయితే, అవి మెరుస్తూ కనిపిస్తాయి.

9. టైర్ క్లీనర్

9. టైర్ క్లీనర్

బేకింగ్ సోడా, నీటిని గట్టిగా పేస్ట్ మాదిరిగా కలిపి ఈ మిశ్రమాన్ని టైర్లపై రుద్దండి, ఓ రెండు మూడు నిమిషాల తర్వాత బ్రష్ తీసుకొని క్లీన్ చేయండి.

10. వైపర్ బ్లేడ్స్

10. వైపర్ బ్లేడ్స్

బేకింగ్ సోడా, నీటి మిశ్రమంతో కార్ వైపర్ బ్లేడ్‌లను నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
We list out some household items which can be used to wash your car. Be it from vinegar to banking soda these household items come handy.
Story first published: Wednesday, September 25, 2013, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X