Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 12 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 15 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?
సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసే చాలా మందిలో సాధారణ పెట్రోల్ ఉపయోగించాలా లేక ప్రీమియం పెట్రోల్ ఉపయోగించాలా అనే సంశయం ఉంటుంది.

కొన్ని పెట్రోల్ పంపుల వద్ద ఉండే ఏజెంట్లు కూడా ప్రీమియం పెట్రోల్ గురించి ఎక్కువ చేసి చెబుతూ, దాని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని కస్టమర్లను ఒప్పించి అధిక ధర పెట్రోల్‌ను విక్రయిస్తుంటారు. భారతదేశపు అతిపెద్ద చమురు కంపెనీ, అయిన ఇండియన్ ఆయిల్ ఇటీవలే హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్‌ను విడుదల చేసింది, ఇది సాధారణ పెట్రోల్ కంటే 15 రూపాయలు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

అసలు సాధారణ పెట్రోల్‌కి ప్రీమియం పెట్రోల్‌కి మధ్య తేడా ఏంటి. ఈ రెండింటి ఉపయోగించడం వలన వాహనాల్లో కలిగే మార్పులు మరియు ప్రయోజనాలు ఏంటి? మీ బైక్ లేదా కారు యొక్క ఇంజన్ ప్రకారం ఏ రకం ఇంధనం ఎక్కువ మైలేజ్ మరియు పనితీరును ఇస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం, తెలుసుకుందాం రండి.

ప్రీమియం పెట్రోల్ vs సాధారణ పెట్రోల్
పెట్రోల్ యొక్క గ్రేడ్‌ను దాని ఆక్టేన్ విలువను ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు. భారతదేశంలో సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా రేట్ చేయబడింది. అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియోని కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇంజన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలిపోదు మరియు కార్బన్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

అదే సమయంలో, సాధారణ పెట్రోల్ తక్కువ ఆక్టేన్ కలిగి ఉంటుంది, దీని వలన ఇంజన్ ప్రారంభమయ్యే కొద్ది సెకన్ల పాటు ఎక్కువ ఇంధనం కాలిపోతుంది. ఈ ఇంధనం ఉపయోగించే వాహనాల్లో కాలక్రమేణా కార్బన్ స్తంభించిపోతుంది. ఫలితంగా ఇంజన్ పనితీరు మరియు మైలేజ్ వంటి అంశాలు ప్రభావితం అవుతాయి.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

అధిక ఆక్టేన్ కలిగిన పెట్రోల్‌ను ఉపయోగించే వాహనాల్లో ఇంజన్ ప్రారంభమైనప్పుడు నాకింగ్ (కొట్టుకునే) శబ్దం ఉండదు. ఫలితంగా, ఇంజన్‌ను ప్రారంభించడం సులభం అవుతుంది. అదే సమయంలో, సాధారణ పెట్రోల్‌ను ఉపయోగించే వాహనాల్లో నాకింగ్ ఎక్కువగా ఉండి, ఇంజన్ శబ్ధం కూడా ఎక్కువగా అనిపిస్తుంది.

ఏ ఇంజన్‌కు ఏ ఇంధనం సరైనది?
వాస్తవానికి, ప్రీమియం పెట్రోల్ అంటే ఎక్కువ ఆక్టేన్ కలిగిన పెట్రోల్ అధిక కంప్రెషన్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు శక్తివంతమైన ఇంజన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు మొదలైన వాటికి ఈ ప్రీమియం ఇంధనం ఉత్తమంగా ఉంటుంది. శక్తివంతమైన బైక్‌ల విషయంలో కూడా అంతే. ఇలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం వలన వాటి పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది.

అలాగే, తక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజన్‌లను ఉపయోగించుకునే కమ్యూటర్ వాహనాలకు ఈ ఇంధనం పెద్దగా ఉపయోగపడదు. తక్కువ పవర్ కలిగిన ఇంజన్లలో ఉండే తక్కువ కంప్రెషన్ రేషియో కారణంగా, వాటిలో ప్రీమియం ఇంధనం పెద్దగా పనిచేయదు. ఫలితంగా, వాటి పనితీరులో కానీ మైలేజ్‌లో కానీ పెద్ద మార్పు ఉండదు. కాబట్టి, ఇలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం లాభదాయకం కాదు.

ప్రీమియం ఇంధనం వలన కలిగే ప్రయోజనాలు
ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం వలన మైలేజీ పెరుగుతుందని మరియు ఇది ఇంజన్‌పై ఎక్కువ ఒత్తిడి చేయదని పెట్రోల్ కంపెనీలు చెబుతున్నాయి. అధిక ఆక్టేన్ కలిగిన పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేస్తుంది. ప్రీమియం ఇంధనంలో కొన్ని సంకలనాలు జోడించబడి ఉంటాయి, అవి ఇంజన్లలోని కార్బన్‌ను తగ్గించడంలోనూ మరియు ఇప్పటికే నిల్వ ఉన్న కార్బన్‌ను తొలగించడంలో సహకరిస్తుంది.
MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

మరి ఇందులో మీ వాహనానికి ఏ ఇంధనం మంచిది?
వాహనంలో ఇంధనం నింపే విషయంలో ప్రతి వినియోగదారుడు ముందుగా, వారి వాహన మ్యాన్యువల్‌లో ప్రస్థావించిన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీ కారు లేదా బైక్‌కు ఐదు లేదా పది సంవత్సరాలు వయస్సు ఉంటే, అందులో సాధారణ ఇంధనాన్ని ఉంచడం మంచిది. లేదా ఒకవేళ మీ కారు లేదా బైక్ మరింత శక్తివంతంగా ఉండే మోడల్ అయితే, అలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం మంచిది.