ట్రాఫిక్ కెమరాలతో గేమ్స్ ఆడితే ఇలానే జరుగుతుంది.

Car Driver
అమెరికాలో ఓ అమ్మాయి కారు నడపుతూ ఉండగా తనపై ట్రాఫిక్ కెమరా ఫ్లాష్ కావడాన్ని గమనించింది. అయితే, తానేమీ మితిమీరిన వేగంతో వెళ్లడం లేదు కదా అయినా కెమరా తనపై ఎందుకు ఫ్లాష్ అయిందా అని మరోసారి అదే రూట్లో ఇంకాస్త వేగం తగ్గించి మెల్లిగా కారు నడిపింది. అయినా సరే రెండోసారి కూడా ఆమెపై కెమరా ఫ్లాష్ అయ్యింది.

దీంతో తికమక పడ్డ సదరు సుందరీమణి ముచ్చటగా మూడోసారి పరీక్షిద్దామని ఈసారి ఇదివరకటి కంటే అతి తక్కువ వేగంతో కారు నడిపింది. అయినా సరే మళ్లీ కెమరా ఫ్లాష్ అయింది. ఇదేదో సరదాగా ఉంది కదా అని నాలుగోసారి, ఐదోసారి కూడా అదే రూట్లో మెల్లిగా కారును నడిపింది. అయితే, కెమెరా మాత్రం పదే పదే ఆమెపై ఫ్లాష్ కావటం జరిగింది. ఇదంతా చూసి ఆమె నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.

ఓ వారం రోజుల తర్వాత మొత్తం ఐదు ఛలాన్‌లు ఆమె ఇంటి చిరునామాకు వచ్చి చేరాయి. చలాన్‌లను చూసిన సదరు అమెరికా అమ్మడు అవాక్కయ్యింది. ఛలాన్‌లు వచ్చింది మితిమీరిన వేగంతో వాహనం నడిపినందుకు కాదు.. ఆ రూట్లో డ్రైవ్ చేసిన ఐదుసార్లు కూడా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందట. అందుకే ఐదు చలాన్‌లు వచ్చాయి. మరి ట్రాఫిక్ కెమరాతోనే ఆటలాడుకుంటే మాటాలా..!!

ప్రస్తుతం ఇండియన్ ట్రాఫిక్ సిస్టమ్ కూడా కొన్ని నగరాల్లో ఆధునికీకరణ చెందుతోంది. లేజర్ గన్ కెమరాలు, హెచ్‌డి సిసి కెమెరాలు, బ్లాక్ బెర్రీ సేవలు, బ్లూటూత్ ప్రింట్ అవుట్ చలాన్‌లు ఇలా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఇండియన్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి, రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం మర్చిపోకండి.

Most Read Articles

English summary
In US A girl was driving when she saw the flash of a traffic camera. She figured that her picture had been taken for exceeding the limit even though she knew that she was not speeding. Two weeks later, she got five challans for driving without a seat belt.
Story first published: Tuesday, May 29, 2012, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X