వోల్వో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి

By Ravi

ఇటీవల వరుసగా జరుగుతున్న వోల్వో బస్సు ప్రమాదాలతో, ప్రయాణికులు వోల్వో బస్సు ప్రయాణమంటేనే హడలెత్తిపోతున్నారు. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన, సౌకర్యమైన ప్రయాణంగా చెప్పుకునే బస్సు ప్రయాణం, తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం వద్ద జరిగిన యాక్సిడెంట్ అలాగే కర్ణాటకలోని హవేరీలో జరిగిన ప్రమాదాలతో ఇందులోని డొల్లతనం బయపడింది.

వోల్వో బస్సులను నిర్వహించే ట్రావెల్ ఏజెన్సీలు కానీ లేదా ప్రజా రవాణా సంస్థలకు ఇందుకు సంబంధించిన సురక్షితా నిబంధనలు (సేఫ్టీ రెగ్యులేషన్స్)ను పాటించాల్సి ఉంటుంది. వాస్తవానికి సదరు సంస్థలకు బస్సులను విక్రయించే కంపెనీలు, ముందుగా అన్ని సేఫ్టీ నిబంధలతో కూడిన బస్సులనే వారికి అందజేస్తారు. ఆ తర్వాత ఏజెన్సీలు, రవాణా సంస్థల నిర్లక్ష్యం వలన ఈ సేఫ్టీ ఫీచర్లు ఎందకూ పనికిరానివిగా మారిపోతున్నాయి.

వోల్వో బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇవే మన ప్రాణాలను రక్షిస్తాయి. అవేంటో, వాటి వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

వోల్వో బస్ లేఅవుట్

వోల్వో బస్ లేఅవుట్

ముందుగా వోల్వో బస్ లేఅవుట్‌ను పరిశీలిద్దాం రండి. ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీలు కానీ ప్రభుత్వ రవాణా సంస్థలు కానీ ఉపయోగించే అన్ని వోల్వో బస్సుల లేఅవుట్ దాదాపుగా ఒకేవిధంగా ఉంటుంది. ఈ బస్సుల్లో మొత్తం ఆరు అత్యవసర ద్వారాలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయో తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి.

అత్యవసర ద్వారాలు

అత్యవసర ద్వారాలు

వోల్వో బస్సుల్లో డ్రైవర్‌కు ఎడమచేతి వైపు ఉండే ప్రధాన ద్వారం కాకుండా, మొత్తం ఆరు అత్యవసర ద్వారాలు ఉంటాయి. అందులో రెండు బస్సుకు ఎడమచేతి వైపు, మరో రెండు కుడిచేతి వైపు ఉంటాయి. మిగిలిన రెండు అత్యవసర ద్వారాలు బస్సు పై భాగంలో ముందు ఒకటి, వెనుక ఒకటి చొప్పున ఉంటాయి. వీటిపై ఎరుపు రంగు అక్షరాలతో 'EMERGENCY EXIT' అని రాసి ఉంటుంది.

అత్యవసర ద్వారాలను పగులగొట్టడం ఎలా?

అత్యవసర ద్వారాలను పగులగొట్టడం ఎలా?

బస్సుకు ఇరువైపులా ఉండే నాలుగు అత్యవసర ద్వారాలను పెలుసుగా ఉండే అద్దంతో తయారు చేస్తారు. వీటిని పగులగొట్టేందు ప్రతి అత్యవసర ద్వారం వద్ద సుత్తిలాంటి (హ్యామర్) ఓ ఇనుప పరికరం ఉంటుంది. అలాగే ప్రతి అత్యవసర ద్వారం వద్ద అమర్చిన అద్దానికి ఓ చివర్లో ఎరుపు రంగులో ఉండే ఓ గుండ్రటి గుర్తు ఉంటుంది. సుత్తి సాయంతో ఆ గుర్తుపై బలంగా కొట్టినట్లయితే, అద్దం పగిలి మార్గం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆ మార్గం గుండా బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకోవచ్చు.

బస్సు పైభాగంలో ఉండే అత్యవసర ద్వారాలు

బస్సు పైభాగంలో ఉండే అత్యవసర ద్వారాలు

వోల్వో బస్సు పైభాగంలో కూడా రెండు అత్యవసర ద్వారాలు ఉంటాయి. వీటిని ఎమర్జెన్సీ హ్యాచ్ ఎగ్జిట్స్ అంటారు. ఇవి సింపుల్ లాకింగ్ సిస్టమ్‌తో క్లోజ్ అయి ఉంటాయి. వీటిని ఓపెన్ చేసే విధానం కూడా అక్కడే ఎరుపు అక్షరాల్లో ప్రచురించబడి ఉంటుంది. సాధారణంగా వోల్వో బస్సుల్లో ఉండే హ్యాచ్ ఎగ్జిట్స్ విషయంలో, నలుపు లేదా ఎరుపు రంగులో ఉండే ఓ ట్యాబ్ బటన్ ఉంటుంది, ఈ బటన్ నొక్కి హ్యాచ్ డోర్ హ్యాండిల్‌ సాయంతో డోరును పైకి నెట్టి, ఆ మార్గం గుండా బస్సు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకోవచ్చు.

అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్)

అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్)

ప్రతి వోల్వో బస్సులో రెండు అగ్నిమాపక యంత్రాలు ఉంటాయి. వీటిలో ఒకటి డ్రైవర్‌కు ఎడమచేతివైపు ఉండే కో డ్రైవర్ సీట్ క్రింద ఉంటుంది. మరొకటి బస్సు చివర్లో మధ్యలో ఉండే సీట్ క్రింద ఉంటుంది. అత్యవసర సమయాల్లో మంటల్ని ఆర్పేందుకు వీటిని ఉపయోగించవచ్చు.

సీట్ బెల్ట్స్

సీట్ బెల్ట్స్

వోల్వో బస్సుల్లో డ్రైవర్, కో-డ్రైవర్ల సీట్లకే కాకుండా ముందు వరుసలోని నాలుగు సీట్లకు, అలాగే బస్సు చివర్లోని ఆఖరి వరుసలో ఉండే మధ్య సీటుకు సీట్ బెల్టులు (మొత్తం ఏడు సీట్ బెల్టులు) ఉంటాయి. సడెన్ బ్రేక్ వేసినప్పుడు ఈ సీట్లలో కూర్చునే ముందుకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సీట్లలో కూర్చునే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడం ఎంతో మంచిది.

మెయిన్ డోర్ స్విచ్

మెయిన్ డోర్ స్విచ్

వోల్వో బస్సు ప్రధాన ద్వారానికి సంబంధించిన స్విచ్ డ్రైవర్ కంట్రోల్‌లోనే ఉంటుంది. బస్సు డ్యాష్‌బోర్డుపై ఉండే ఓ నాబ్/బటన్‌ను లాగటం ద్వారా ఈ డోర్ ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. అత్యవసర సమయాల్లో డ్రైవర్ ఈ నాబ్/బటన్‌ను ఉపయోగించటం ఎంతో అవసరం. ఇది హైడ్రాలిక్స్‌తో పనిచే ఆటోమేటిక్ డోర్. దీనిని మ్యాన్యువల్‌గా ఓపెన్ చేయటం కష్టం.

Most Read Articles

English summary
Are you traveling by Volvo bus? Then you must know about Emergency Exit and Safety Instructions for Volvo Buses. Here explained the procedure to follow in case of emergency.
Story first published: Tuesday, November 26, 2013, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X