కారు ఫ్యూయల్ గురించి అస్సలు నమ్మకూడని అపోహలు

వాహనాలకు వినియోగించే ఇంధనం గురించి డ్రైవర్లు చాలా అపోహలను నమ్ముతుంటారు. కొన్ని అపోహలు నిజమే అయినప్పటికీ, మరికొన్ని నమ్మడం వలన ఎలాంటి లాభం లేకపోవడమేకాక కారును డేంజర్‌లో పడేస్తాయి.

By N Kumar

వాహనాలకు వినియోగించే ఇంధనం గురించి డ్రైవర్లు చాలా అపోహలను నమ్ముతుంటారు. కొన్ని అపోహలు నిజమే అయినప్పటికీ, మరికొన్ని నమ్మడం వలన ఎలాంటి లాభం లేకపోవడమేకాక కారును డేంజర్‌లో పడేస్తాయి.

వాహన ఇంధనం(వెహికల్ ఫ్యూయల్) గురించి ఎక్కువగా నమ్మే అపోహలు మరియు అలాంటి అపోహలను ఖచ్చితంగా నమ్మకూడదని తెలిపే కారణాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం...

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

1. ఉదయం వేళ ఫ్యూయల్ నింపితే అధిక మైలేజ్ వస్తుందనుకోవడం

ఉదయంపూట ఇంధనం నింపడానికి ప్రయత్నించడం మంచిదే. ఈ థియరీ రావడానికి అసలు కారణం. వేడి పెరిగేకొద్దీ పెట్రోల్ వ్యాకోచిస్తుంది. అదే ఉదయాన్నే పెట్రోల్ చల్లగా ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్రోల్ నింపుకోవచ్చు దీంతో మైలేజ్ పెరుగుతుందనుకుంటారు.

Recommended Video

This New Year 2018 Brings The New Swift Sport To India - DriveSpark
ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

నిజానికి ఫ్యూయల్ ట్యాంక్ వెహికల్ బాడీ క్రింద ఉంటుంది కాబట్టి, అప్పటికే ఇంజన్ ఆన్‌లో ఉంటుంది దీంతో ఫ్యూయల్ అప్పటికే వేడిని గ్రహిస్తుంది. దీంతో మనం ప్యూయల్ ఎప్పుడు పట్టించినా ట్యాంకులోకి వెళ్లిన పెట్రోల్ అంతే మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ అపోహను నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

2. ఫ్యూయల్ తక్కువగా ఉన్నపుడు వాహనాన్ని నడపడం ఇంజన్‌కు మంచిది కాదనుకోవడం

ఫ్యూయల్ ట్యాంకులో ఇంధనం తక్కువగా ఉన్నపుడు వాహనాన్ని నడిపితే, ట్యాంకు అడుగు భాగంలో మలినాలతో కూడిన ఇంధనం ఇంజన్‌కు చేరి, ఇంజన్‌ను పాడు చేస్తుందని, కాబట్టి ట్యాంకులో ఫ్యూయల్ లెవల్ ఎక్కుకవగా ఉంటే మంచి ఇంధన ఇంజన్‌కు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని చాలా మంది భావిస్తారు.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

అస్సలు నమ్మకూడని అపోహలలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ప్రతి వెహికల్‍‌లోని ఫ్యూయల్ ట్యాంకులోని అడుగు భాగం నుండి ఇంధనాన్ని సరఫరా చేసే విధంగా రూపొందిస్తారు. కాబట్టి లో కెపాసిటి ఇంజన్ నడిపినా... ట్యాంక్ ఫుల్ చేయించి నడిపినా... ఇంజన్‌కు ఒరిగే నష్టమేమీ ఉండదు.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

3. నాన్ ప్రీమియమ్ కారుకు ప్రీమియమ్ ఫ్యూయల్ బెటర్ అనుకోవడం

ఇది అక్షరాల తప్పు. పెట్రల్ బంకులకు వెళ్లినపుడు పవర్ మరియు ప్రీమియమ్ అనే పేర్లతో ఇంధనాన్ని మరియు వివిధ రకాల లుబ్రికేంట్స్ మరియు ఆయిల్ కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తుంటారు. నిజానికి సాధారణ ఇంధనం మరియు రెగ్యులర్ ఇంధనానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

నిజానికి ఇలా ప్రత్యేక పేర్లతో విక్రయించే ఫ్యూయల్స్ ధరలు అధికంగా ఉంటాయి. నాణ్యత పరంగా రెగ్యులర్ ఫ్యూయల్ మరియు ప్రీమియమ్ ఫ్యూయల్ ఒకేలా ఉంటాయి.

Trending On DriveSpark Telugu:

బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది..?

బ్రేక్ ఫెయిల్ అవడాన్ని ముందుగానే గుర్తించవచ్చు

ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందా?

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

4. మైలేజ్ రీడింగ్స్ తప్పుగా వస్తున్నాయనుకోవడం

మైలేజ్ రీడింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే మైలేజ్ రీడింగ్స్‌లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. కానీ, అన్నీ బాగా పనిచేస్తున్నప్పటికీ రీడింగ్స్ ప్రకారం, మీ వాహనం మిమ్మల్ని మోసం చేస్తోందని అనిపిస్తుంది. సాంకేతికంగా ఇందుకొక రీజన్ ఉంది.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

ఉదాహరణకు: హైవీ మీద రెండు కిలోమీటర్ల పాటు ఆరు లీటర్ల ఇంధనంతో 100కిలోమీర్లు ప్రయాణించారనుకోండి, అప్పుడు వెంటనే హైవీ వదిలి సిటీ రోడ్డును చేరి 12లీటర్ల ఇంధనంతో 100కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే ఈ రెండు డ్రైవింగ్ పరిస్థితులను అంచనా వేయడానికి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తననుతాను అడ్జెస్ట్ చేసుకుని మైలేజ్ లెక్కించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇలాంటి సందర్భాలలో మైలేజ్ కాస్త అటు ఇటుగా రావచ్చు అంతేగానీ మైలేజ్ తగ్గిపోయిందని భావించకూడదు.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

5. జెట్ ఫ్యూయల్‌తో కార్లు అధిక వేగంతో దూసుకెళ్తాయనుకోవడం

నిజానికి, జెట్ ఫ్యూయల్‌తో కార్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయనేది ముమ్మాటికీ అపోహే అని చెప్పవచ్చు. పెట్రోల్ ఇంజన్‌లు కిరోసిన్(జెట్ ఫ్యూయల్)ను మండించలేవు. కాబట్టి, మీ కారులో యొక్క రెగ్యులర్ ఫ్యూయల్‌నే నింపడం మంచిది.

ఫ్యూయల్ గురించి నమ్ముతున్న అపోహలు

వాడుకలో ఉన్న అపోహలను ఎల్లప్పుడు నమ్మడం మంచిది కాదు. ఎందుకంటే వెహికల్స్‌లో మనం ఊహించుకునేది ఒకటైతే, అక్కడ జరిగేది మరొకటి. చాలా వరకు కార్ల తయారీ కంపెనీలు తమ కస్టమర్లకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించేందుకు అధునాతన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో చాలా వరకు అత్యాధునిక మార్పులు తీసుకొస్తున్నాయి.

షోరూమ్‌ డీలర్లు మరియు కార్ల కంపెనీలు సూచించే చిట్కాలు పాటించడం మంచిందే. కాబట్టి, అపోహలు వీడి మంచి డ్రైవింగ్ ఫీల్ పొందండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Five Fuel Myths You Need to Stop Believing
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X