మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

కారులో ఇంజన్ తో పాటుగా లైట్లు మరియు ఇతర ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలు చక్కగా పనిచేయాలంటే, ఆ కారులో ఆరోగ్యమైన బ్యాటరీ ఉండటం చాలా అవసరం. సాధారణంగా, కారులో బ్యాటరీ వీక్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. సరైన మెయింటినెన్స్ లేకపోయినట్లయితే, కారులో కొత్త బ్యాటరీ వేసినా అది కొంత కాలానికే పాడైపోతుంది. మనం చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం వలన కారు బ్యాటరీ జీవితకాలాన్ని తద్వారా కారులోని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. అదెలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

చిన్నపాటి దూరాల కోసం కారును వాడకండి!

మీరు మీ కారును 'స్టార్ట్' చేసిన ప్రతిసారీ, దాని బ్యాటరీ పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా, కారును స్టార్ చేయడం కోసం కొంతమేర బ్యాటరీ వినియోగం అవుతుంది. అయితే, కారు ప్రయాణ సమయంలో ఇంజన్ నడవడం తద్వారా ఆల్టర్నేటర్ పనిచయడం వలన కారు బ్యాటరీ 'రీఛార్జ్' అవుతుంది. కాబట్టి మీరు చాలా తక్కువ దూరం మాత్రమే కారును నడిపాల్సివచ్చినప్పుడు, బ్యాటరీ ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందలేరు. ఇలా నిరంతరం చేయడం వల్ల బ్యాటరీ 'వోల్టేజీ' బాగా తగ్గిపోతుంది మరియు బ్యాటరీ బలహీనపడటం ప్రారంభం అవుతుంది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

కాబట్టి, చిన్నపాటి ప్రయాణాల కోసం వీలైనంత వరకూ కారును ఉపయోగించకుండా చూసుకోండి. ఇలాంటి ప్రయాణాల కోసం కాలి నడక లేదా వేరే ఏదైనా ప్రత్యామ్నాయ రవాణా మార్గాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, మీ ఇంటి బయటి నుండి వీధి చివరన ఉన్న దుకాణానికి వెళ్లడం కోసం కారు తీయడానికి బదులుగా కాలి నడక చేయండి. ఇలా చేయడం వలన ఇంధనం ఆదా కావడంతో పాటుగా మీ కారు బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. అసలే ఇప్పుడు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి కాబట్టి, ప్రతి ఇంధనపు చుక్క ఎంతో విలువైనది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

కారును ఎక్కువ కాలం నడపకుండా ఉంచకండి!

చిన్నపాటి దూరాల కోసం కారును ఉపయోగించవద్దన్నామని, అసలు కారును ఆన్ చేయడమే మర్చిపోకండి. ఇలా ఎక్కువ కాలం పాటు కారును ఆన్ చేయకుండా పార్క్ చేసి ఉంచడం వలన కారులోని బ్యాటరీ క్రమంగా డిశ్చార్జ్ అయి, అసలు కారు ఆన్ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కారు రన్నింగ్ లో ఉన్నంత సేపు బ్యాటరీ చార్జ్ అవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి, ఒకవేళ మీరు మీ కారును ఎక్కువ కాలం పాటు ఉపయోగించరని తెలిస్తే, దానిని అప్పుడప్పుడైనా ఇంజన్ ఆన్ చేసి, కాసేపు ఐడిల్‌గా ఉంచి కారు బ్యాటరీ చార్జ్ అయ్యేలా చూసుకోవాలి.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

సాధారణంగా, వారానికి ఒకసారైనా కనీసం 30 నిమిషాల పాటు కారును డ్రైవ్ చేయడం మంచిది, ఇలా చేయడం వలన కారు బ్యాటరీలో తగినంత విద్యుత్ నిల్వ ఉండి, ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తుంది మరియు బ్యాటరీ జీవితకాలం కూడా పెరుగుతుంది. ఇలా చేయడం వలన ఇది మీ కారు ఇంజన్‌ను 'వార్మ్-అప్' చేస్తుంది మరియు కారు 'ఫ్లూయిడ్స్' మెరుగ్గా ప్రసరించేలా చేస్తుంది. ఒకవేళ మీరు కొన్ని వారాల పాటు కారును ఉపయోగించకపోయినట్లతే, ఆ తర్వాత మీరు కారును బయటకు తీసుకునేటప్పుడు, మీరు దాని బ్యాటరీపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

బ్యాటరీని తరచుగా శుభ్రం చేయండి!

కారు బ్యాటరీలపై పేరుకునే ధూళి మరియు తేమ 'లీకేజీ'ని కలిగిస్తాయి మరియు అవి 'షార్ట్ సర్క్యూట్'లకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కనీసం నెలకు ఒకసారైనా కారు బ్యాటరీని శుభ్రం చేయండి. 'స్పాంజ్' లేదా పొడి గుడ్డతో బ్యాటరీని శుభ్రం చేయడం చాలా సులభమైన పద్దతి. కారు బ్యాటరీ మరియు బ్యాటరీ టెర్మినల్స్ ను శుభ్రంగా ఉంచుకోవడం వలన బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

ఇంజన్ ఆన్ చేయకుండా లైట్స్ ఆన్ చేయవద్దు!

మీరు మీ కారు ఇంజన్‌ను ఆన్ చేయకుండానే హెడ్‌లైట్లు, ఇంటీరియర్ లైట్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను 'ఆన్' చేస్తే, బ్యాటరీ త్వరగా ఖర్చైపోతుంది. ఎందుకంటే, ఇంజన్ 'స్విచ్ ఆఫ్' లో ఉన్నప్పుడు మీ కారు బ్యాటరీని చార్జ్ చేసే ఆల్టర్నేటర్ కూడా 'షట్ డౌన్' (ఆఫ్ లో) ఉంటుంది. కాబట్టి ఇంజన్ ఆన్ లో లేనప్పుడు, కారులోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించకపోవడమే మంచిది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

మీ కారును పార్క్ చేసి వెళ్లే ముందు, కారులోని ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ స్విచ్ ఆఫ్ చేయబడిందా? అని ఒకటికి రెండుసార్లు 'చెక్' చేసుకోవడం అలవాటు చేసుకోండి (ముఖ్యంగా లైట్లు). ఇలా చేయడం వలన కారు బ్యాటరీ వృధాగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. అలాగే కారును వదిలి వెళ్లేటప్పుడు దానిని 'లాక్' చేయడం కూడా మర్చిపోకండి. ఇది కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే కాదు, దీని వెనుక మరో కారణం కూడా ఉంది. మీరు మీ కారుని 'ఓపెన్' మెమరీలో ఉంచినట్లయితే, బ్యాకెండ్ లో కారు 'కంప్యూటర్ సిస్టమ్' రన్ అవుతూ ఉండవచ్చు. ఇది మీకు తెలియకుండానే మీ కారు బ్యాటరీ డ్రైన్ చేసేస్తుంది.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

మీ కారుకి క్రమం తప్పకుండా సర్వీస్‌ చేయించండి!

క్రమం తప్పకుండా మీ కారుకు 'సర్వీస్' చేయడం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడికైనా హడావుడిగా ప్రయాణించాల్సి వచ్చి, ఆ సమయంలో కారు సడన్ గా 'బ్రేక్ డౌన్' కాకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు బ్యాటరీని 'టెస్ట్'ని చేయడం చాలా మంచిది. నెక్స్ట్ సర్వీస్ లో మీరు మీ కారుని 'సర్వీస్' కోసం తీసుకువెళ్లినప్పుడు దాని బ్యాటరీ మంచి స్థితిలో ఉందా లేదా అని 'చెక్' చేయమని మెకానిక్‌ని అడగండి. అలాగే బ్యాటరీ సరిగ్గా 'రీఛార్జ్' అవుతోందా లేదా దాని కనెక్షన్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయని అని అడిగి తెలుసుకోండి.

మీ కారు బ్యాటరీ యొక్క జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా..? - చిట్కాలు

మీ కారు బ్యాటరీ వీక్ అయిందా అని తెలుసుకోవడం ఎలా..?

ఒకవేళ మీరు మీ కారును ప్రారంభించడంలో సమస్యలను ఎదుర్కుంటున్నట్లయితే, దానికి బ్యాటరీ లోపం కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. బాగా పాతబడిన బ్యాటరీలు ఎక్కువ కాలం చార్జ్‌ను నిలిపి ఉంచలేవు లేదా త్వరగా చార్జ్ కాకుండా సమస్యలకు కారణం అవుతుంటాయి. మరి బలహీనమైన బ్యాటరీని సూచించే సంకేతాలు మరియు కొత్త బ్యాటరీని కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకునేందుకు - ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
How to improve your car battery life tips and tricks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X