ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

కారులో ఇంజన్ మరియు ఇంధనం మాత్రమే ఉంటే సరిపోదు, కారు స్టార్ట్ అవడానికి అందులో బలమైన బ్యాటరీ కూడా ఎంతో అవసరం. కారులో బ్యాటరీ వీక్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. సరైన మెయింటినెన్స్ లేకపోయినట్లయితే, కారులో కొత్త బ్యాటరీ వేసినా అది కొంత కాలానికే పాడైపోతుంది.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

కారులో నిత్యం చెక్ చేసే అంశాలలో బ్యాటరీ యూనిట్ కూడా ఒకటి. సాధారణంగా కారుని అధీకృత సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లినప్పుడు టెక్నీషియన్లు మనం చెప్పాల్సిన అవసరం లేకుండా బ్యాటరీని చెక్ చేస్తారు. బ్యాటరీ రేటింగ్, చార్జింగ్ స్థితి, ఆల్టర్నేటర్ పనితీరు మరియు డిస్టల్ వాటర్ లెవర్ మొదలైన అంశాలను తనిఖీ చేసి, బ్యాటరీ మార్పు అవసరమైతే సదరు వాహన యజమానులకు తెలియజేస్తారు.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

మీ కారును ప్రారంభించడంలో సమస్యగా ఉన్నట్లయితే, బ్యాటరీ లోపం కూడా అందుకు ఓ కారణం కావచ్చని తెలుసుకోండి. బాగా పాతబడిన బ్యాటరీలు ఎక్కువ కాలం చార్జ్‌ను నిలిపి ఉంచలేవు లేదా త్వరగా చార్జ్ కాకుండా సమస్యలకు కారణం అవుతుంటాయి. ఈ కథనంలో మనం బలహీనమైన బ్యాటరీని సూచించే సంకేతాలు మరియు కొత్త బ్యాటరీని కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక కార్లు 12.6 వోల్ట్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. బ్యాటరీని టెస్ట్ చేసినప్పుడు దాని సామర్థ్యం 12.5-12.6 వోల్టుల మధ్యలో ఉంటే, అది ఆరోగ్యకరమైన బ్యాటరీ అని అర్థం. అలాకాకుండా, బ్యాటరీ వోల్టేజ్ 12.2 కన్నా తక్కువగా ఇండికేట్ చేసినట్లయితే, అలాంటి బ్యాటరీ 50 శాతం మాత్రమే చార్జ్ అవుతుంది లేదా త్వరగా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందని అర్థం. ఒకవేళ బ్యాటరీ సామర్థ్యం 12 వోల్టుల కన్నా తక్కువగా ఉంటే దానిని డెడ్ బ్యాటరీగా పరిగణిస్తారు, ఇలాంటి సందర్భాల్లో బ్యాటరీ మార్పు అవసరం ఉంటుంది.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

కారు ప్రారంభించడానికి అదనపు సమయం:

కారును ప్రారంభించేటప్పుడు సాధారణం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లయితే, అది బలహీనమైన బ్యాటరీకి మొదటి సంకేతమని గుర్తుంచుకోవాలి. మంచి నాణ్యత కలిగిన బ్యాటరీ అయితే, ఒకే ప్రయత్నంలోనే కారు స్టార్ట్ అవుతుంది.

ఈ సమస్య ప్రధానంగా వర్షాకాలం మరియు శీతాకాలం వంటి చల్లటి వాతా వరణ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాత బ్యాటరీలు కలిగిన వాహనాలను కొంత సమయం క్రాంక్ చేసిన తర్వాత ప్రారంభమవుతాయి మరికొన్ని ఎంత సేపు ప్రయత్నించినా ప్రారంభం కావు. కానీ, కొత్త బ్యాటరీలు కలిగిన కార్లలో ఈ సమస్య ఉండకపోవచ్చు.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

కారులోని ఎలక్ట్రానిక్స్ స్వభావం మారడం:

కారులోని బ్యాటరీ మంచి స్థితిలో ఉంటే, అందులో ఉండే అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు యథావిధిగా లేదా ప్రకాశవంతంగా పనిచేస్తాయి. ఒకవేళ, కారు బ్యాటరీ లోపభూయిష్టంగా ఉంటే లైట్లు వెదజల్లే కాంతి మసకబారినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా, రేడియోలు వంటి విద్యుత్ పరికరాలు అసాధారణంగా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

ఇలాంటి సమయాల్లో బ్యాటరీని రీసెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాటరీ లోపభూయిష్టమైనదైతే దానిని వెంటనే రీప్లేస్ చేసుకోవాలి లేకపోతే కారులోని ఎలక్ట్రానిక్స్ సరిగ్గా పనిచేయకపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో, బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

వార్నింగ్ లైట్:

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆధునిక వాహనాల్లో, డాష్‌బోర్డ్‌పై బ్యాటరీ వార్నింగ్ లైట్ ఉంటుంది. కారు బ్యాటరీలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, కారులోని ఈసియూ దానిని ఆటోమేటిక్‌గా గుర్తించి డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై వార్నింగ్ లైట్ రూపంలో డ్రైవరును అలెర్ట్ చేస్తుంది. ఇలాంటి వార్నింగ్ వచ్చిన వెంటనే బ్యాటరీని చెక్ చేయించుకోవటం మంచిది.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

కొత్త బ్యాటరీని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు:

ప్రతి మూడేళ్లకు ఒక్కసారి లేదా అవసరమైన ప్రతిసారి టెక్నీషియన్ సలహా మేరకు కారు బ్యాటరీని రీప్లేస్ చేసుకోవటం మంచిది. ఇలా చేయటం వలన కారు బ్యాటరీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి, కారులోని ఎలక్ట్రానిక్ ఉపకరాణలు అన్ని చక్కగా పనిచేస్తాయి.

కారు బ్యాటరీ సామర్థ్యం అనేది కారును పార్క్ చేసే ప్రదేశం, నివశించే వాతావరణ పరిస్థితులు వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, బ్యాటరీ వయస్సు 3 సంవత్సరాలకు మించినట్లయితే, మీరు దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. రెగ్యులర్ చెక్స్ ద్వారా బ్యాటరీ ఆరోగ్యాన్ని, జీవితకాలాన్ని పరీక్ష చేయించుకోవటం మంచిది.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

ఒకవేళ మీరు కొత్త బ్యాటరీని కొనుగోలు చేయబోతున్నట్లయితే, ఆ బ్యాటరీ కొత్తదా కాదా అని ధృవీకరించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక నకిలీ బ్యాటరీలు లేదా మరమ్మత్తు చేయబడిన బ్యాటరీలను విక్రయిస్తుంటారు. వీటి వలన కారుకే ప్రమాదం వాటిళ్లే అవకాశం ఉంటుంది. కొత్త బ్యాటరీని కొనేటప్పుడు అది తయారైన తేదీ నుండి ఆరు నెలల లోపుగా కొనుగోలు చేయటం మంచిది. బ్యాటరీలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

బ్యాటరీ ప్రొడక్షన్ అయిన నెలను ఎలా గుర్తించాలి?

బ్యాటరీని తయారు చేసే కంపెనీలు వాటి తయారీ నెలను ఆంగ్ల అక్షరాలతో సూచిస్తాయి. అంటే, జనవరి నెలను A అక్షరంతో, ఫిబ్రవరి నెలను B అక్షరంతో ఇలా వరుసగా డిసెంబర్ నెలను L అక్షరంతో సూచిస్తారు. మరియు సంవత్సరంలోని చివరి రెండు అంకెలను దాని తర్వాత ముద్రిస్తారు. ఉదాహరణకు, బ్యాటరీపై A12 అని ముద్రించబడి ఉన్నట్లయితే, అది జనవరి 2012లో తయారైందని అర్థం. ఇలా బ్యాటరీ తయారైన నెలను మరియు సంవత్సరాన్ని గుర్తించవచ్చు.

ఈ సమస్యలు ఉంటే మీ కారు బ్యాటరీ వీక్ అయినట్లు అర్థం.. జాగ్రత్త !!

ఇంజన్ క్రాంకింగ్ శబ్ధం మాత్రం వినిపిస్తే..:

ఇగ్నిషన్‌లో కారు తాళం చెవిని ఉంచి స్టార్ట్ చేసినప్పుడు కేవలం కిర్రుమనే శబ్ధం మాత్రమే వినిపిస్తుంటే, సదరు కారులోని బ్యాటరీ పూర్తిగా డెడ్ అయినట్లు అర్థం. ఇలాంటి సమయాల్లో కారును పదే పదే ఇగ్నైట్ చేయడం వలన స్టార్టర్ మోటార్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో కారును జంప్ స్టార్ట్ చేయటం లేదా బ్యాటరీని మార్చుకోవటం చేయాలి.

Most Read Articles

English summary
Know About The Common Symptoms Of Weak Car Battery: Tips And Tricks. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X