Just In
- 39 min ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్‌కు ఆ కారు చాలా ప్రత్యేకం
- 57 min ago అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
- 1 hr ago BYD SEAL ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago ప్రముఖ నటి మనసుదోచిన టయోటా కారు ఇదే!.. ధర ఎంతంటే?
Don't Miss
- Finance IT News: టాప్ ఐటీ కంపెనీల్లో పెరిగిపోతున్న ఖాళీలు.. TCS, Wipro, Infosys షాపింగ్ రిపోర్ట్..
- News Water: ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరెజీకి చేరిన నీటి మట్టాలు..
- Technology 5,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 సహా కీలక ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports అంపైరింగ్ మనకే కాదు.. గంభీర్‌కు నచ్చలే: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Lifestyle బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందుగానే ఇలా ఫాస్ట్‌గా గుర్తించండి..!
- Movies రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఎలా
నకిలీ కార్డులను గుర్తించి రద్దు చేయడం మరియు పారదర్శకతను పెంచడానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రవాణా శాఖలు కొత్తగా తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి.
భారత నివాసితుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విశిష్ట గుర్తింపు కార్డు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ మరియు ఆన్‌లైన్ సేవలకు తప్పనిసరి అయిపోయింది. మొబైల్ నెంబర్ నుండి పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా మరియు డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా ఇంకా ఎన్నో సేవలకు ఆధార్ తప్పనిసరి చేశారు.
నకిలీ కార్డులను గుర్తించి రద్దు చేయడం మరియు పారదర్శకతను పెంచడానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రవాణా శాఖలు కొత్తగా తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి. అంతే కాకుండా ఇది వరకు తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే అవకాశాన్ని వెబ్‌సైట్లలో అందించాయి.
సులభమైన పద్దతిలో మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో నాలుగు సింపుల్ స్టెప్స్‌లో డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇవాల్టి స్టోరీలో వివరిస్తోంది. చూద్దాం రండి...
ఏపి, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రవాణా శాఖ వెబ్‌సైట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకునే సేవలను అందుబాటులో ఉంచాయి. ఉదాహరణ కోసం ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ లింకింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి.
#1
వెబ్‌సైట్ హోం పేజీలో ఎడమవైపున ఆధార్ నెంబర్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంట్రీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
#2
ఆధార్ డిటైల్స్ ఎంట్రీ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలక్ట్ సెర్చ్ ఎలిమెంట్ బాక్సులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ ఆప్షన్స్‌లో ఒక దానిని ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నెంబర్ బాక్సులో డ్రైవింగ్ లెసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డిటైల్స్ మీద క్లిక్ చేయాలి.
#3
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంభందించిన డిటైల్స్‌తో పాటు క్రింది వైపున ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కాలమ్ కనిపిస్తుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
#4
మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేంజెస్ అనే ఆప్షన్ నొక్కగానే మీ ఆధార్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ అయిపోతుంది.
మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు!
ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?