ట్రాఫిక్ పోలీసులు లంచం అడిగితే ఫిర్యాదు చేయటం ఎలా..?

Traffic Cops
మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి లంచం. ఎయిడ్స్ వ్యాధికి మందునైనా కనిపెట్టచ్చేమో కానీ లంచాన్ని అరికట్టేందుకు మాత్రం చర్యలు తీసుకోవటం కష్టమే అని చెప్పవచ్చు. ఇచ్చే వాళ్లున్నంత కాలం పుచ్చుకునే వాళ్లుంటారు. పుచ్చుకునే వాళ్లున్నంత కాలం ఇచ్చే వాళ్లుంటారు. సరే ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా లంచం అడిగారా..?

ఎవరైనా వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సదరు వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంటుంది. అంతేకాకుండా, వాహన చోదకులు సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉన్నారో లేదోనని తనిఖీ చేసే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఈ రెండు నిబంధనల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా విధించే అధికారం ట్రాఫిక్ ఉన్నతాధికారులకు ఉంటుంది. అలా కాకుండా.. మీ అన్ని పత్రాలు ఉండి, మీ తప్పు లేకపోయినప్పటికీ ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు లంచం అడిగినట్లయితే, వారిపై ఎలా ఫిర్యాదు చేయాలో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

ట్రాఫిక్ పోలీసులు లంచం అడిగనట్లయితే ఎలా ఫిర్యాదు చేయాలి..?
ట్రాఫిక్ పోలీసు లంచం అడినట్లయితే, అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటే సదరు ట్రాఫిక్ పోలీసు లంచం అడిగినట్లుగా ఓ వ్రాతపూర్వక ఫిర్యాదు (వ్రిటన్ కంప్లయింట్)తో పాటుగా సాక్ష్యాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఇచ్చే వ్యక్తే సాక్ష్యంగా పరిగణించటం జరుగుతుంది. అయితే, ఇలా సమర్పించిన వెంటనే లంచం అడిగిన ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవటం జరగదు, ఇందుకు కొంత సమయం పడుతుంది. మీరు వ్రాతపూర్వకంగా సమర్పించే ఫిర్యాదు ఆధారంగా, సదరు లంచం అడిగిన ట్రాఫిక్ పోలీసుపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతారు.

లంచం అడిగిన ట్రాఫిక్ పోలీసుపై మీరు ఫిర్యాదు ఇస్తున్నారంటే, ఈ కేసులో విచారణలో భాగంగా, ఎప్పుడైనా పైఅధికారులు కోరినప్పుడు వారి ముందు మీరు హాజరు కావలసి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా తప్పు ఎవరిదనేది తేల్చడం కష్టమవుతుంది. ఇద్దరి తరఫున వాదోపవాదాలు విన్న తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వీలుంటుంది.

ఒక సామాజిక పౌరుడిగా లంచం ఇవ్వటం కానీ, లంచం తీసుకోవటాన్ని ప్రోత్సహించటం కానీ నేరం. కాబట్టి, మీరు నిజంగా తప్పు చేసినట్లు భావిస్తే, మీ తప్పును న్యాయంగా ఒప్పుకొని, లంచం ఇవ్వటానికి బదులు జరిమానాను కట్టి ఛలాన్ తీసుకోండి. ఒకవేళ మీ తప్పులేదని ఖచ్చితంగా భావిస్తే, లంచం అడిగిన అధికారులపై ఫిర్యాదు చేయండి. మీరు కట్టే జరిమానా నేరుగా ప్రభుత్వానికి చేరుతుందని గుర్తుంచుకోండి. అదే లంచం ఇచ్చి తప్పించుకున్నట్లయితే, ఆ సొమ్ము అడ్డదారిలో దారిలో అక్రమ అధికారుల జేబుల్లోకి వెళ్తుంది.

ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు లంచం అడిగినట్లయితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 పై ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.

ఇకనైనా నిజాయితీగా వ్యవహరిద్దాం.. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..!!

(ఈ కథనం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ప్రచురించబడినది)

Most Read Articles

English summary
Whenever a Traffic cop is asking for bribe, a written complaint is needed to take action, evidence accompanying it also needed. The evidence can be the Individual giving the complaint. You can also report these kind of bribe incidents at traffic helpline number 9010203626. HTP.
Story first published: Wednesday, May 9, 2012, 20:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X