టూవీలర్ రైడింగ్ చేసేటప్పుడు కేశాలను సంరంక్షించుకోవటం ఎలా?

By Ravi

అమ్మాయిలు ఈ కథనం ప్రత్యేకించి మీ కోసమే. ప్రతి అమ్మాయికి తమ శిరోజాలు (కేశాలు/జుట్టు) అంటే ఎంతో ఇష్టం, వీటిని సంరంక్షించుకునేందుకు అమ్మాయిలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, నేటి ఆధునిక ఫ్యాషన్ పుణ్యమో లేక పాపమో తెలియదు కానీ, కేశాలను సంరంక్షించుకోవటం వీరికి కష్టంగా మారుతోంది.

మరోవైపు విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం కూడా కేశాల సంరక్షణకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. ప్రత్యేకించి, ద్విచక్ర వాహనాలను నడిపే మహిళలు విషయంలో కేశాల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. పొల్యూషన్‌తో నిండిన రోడ్లపై రైడ్ చేస్తుండటం వలన చుండ్రు, కేశాలు రాలిపోవటంతో పాటు అనేక చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి.

మరి ఈ పరిస్థితుల నుంచి తమకు ఇష్టమైన కేశాలను రక్షించుకోవటం ఎలా..? ప్రత్యేకించి టూవీలర్ నడుపుతున్నప్పుడు శిరోజాల విషయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టూవీలర్ రైడింగ్ చేసేటప్పుడు కేశాలను సంరంక్షించుకోవటం ఎలా?

అమ్మాయిలు టూవీలర్ నడుపుతున్నప్పుడు తమ శిరోజాల విషయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

హెల్మెట్ ధరించడం

హెల్మెట్ ధరించడం

చాలా మంది అమ్మాయిలకి హెల్మెట్ ధరించడం నచ్చదు. హెల్మెట్ ధరిస్తే జట్టు పాడవుతుందనేది వారు భావిస్తారు. వాస్తవానికి ఇది నిజం కాదు, హెల్మెట్ ధరించి టూవీలర్ నడిపినప్పుడు కోల్పోయే కేశాల సంఖ్య కన్నా, హెల్మెట్ ధరించకుండా టూవీలర్ నడిపేటప్పుడు కోల్పోయే కేశాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

హెల్మెట్ ధరించడం

హెల్మెట్ ధరించడం

హెల్మెట్ ధరించడం వలన మీ కేశాలకు సంరంక్షణ లభించడమే కాకుండా, మీ తలకు/ప్రణాలకు కూడా భద్రత లభిస్తుంది. అయితే, హెల్మెట్‌ను ఎంచుకునే సమయంలో మీకు చక్కగా సరిపోయే వాటిని, సురక్షితమైన వాటిని ఎంచుకోవాలి. మీరు ప్రయాణించే ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లయితే, ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను, కాలుష్యం తక్కువగా ఉంటే హాఫ్ ఫేస్ హెల్మెట్‌ను ఎంచుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఫుల్ ఫేస్ హెల్మెట్ ఉత్తమమైనది, సురక్షితమైనది.

లూజ్ హెయిర్ వద్దు

లూజ్ హెయిర్ వద్దు

టూవీలర్‌పై రైడ్ చేసేటప్పుడు హెయిర్ లూజ్‌గా ఉంచుకోకండి. దీని వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. అంతేకాకుండా, కాలుష్యానికి మీ జుట్టు రంగు మారిపోవటం, చిట్లిపోవటం, పాడవటం జరుగుతుంది. కాబట్టి, రైడ్‌ ప్రారంభించడానికి ముందుగా మీ జుట్టును చక్కగా ముడి కట్టుకొని వెళ్లటం మంచిది.

స్కార్ఫ్ లేదా హెయిర్ బ్యాండ్స్‌

స్కార్ఫ్ లేదా హెయిర్ బ్యాండ్స్‌

హెల్మెట్ ధరించడానికి ముందుగా మీ కేశాలను చక్కగా స్కార్ఫ్‌తో చుట్టుకోవటం కానీ లేదా హెయిర్ బ్యాండ్‌తో ముడి వేసుకోవటం కానీ చేయండి. వీలైనంతవరకు మెత్తగా ఉన్న కాటన్ స్కార్ఫ్‌లను ఉపయోగించండి.

దువ్వెన

దువ్వెన

మీరు తరచూ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నట్లయితే, మీ వెంట ఎల్లప్పుడూ ఓ దువ్వెనను మీ బ్యాగులో కానీ లేదా టూవీలర్‌లో కానూ ఉంచుకోండి.

Most Read Articles

English summary
Girls generally are so passionate about taking care of their crowning glory-hair, especially those who own a scooter or a bike loathe to wear a helmet, as they feel the head saver could damage their hair drastically. Following are few tips to protect your hair while riding.
Story first published: Saturday, October 5, 2013, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X