ఎలుకల బారి నుంచి మీ కారును కాపాడుకోవటం ఎలా?

By Ravi

ఎలుకలు (ర్యాట్స్).. చూడటానికి ఇవి చిన్నగా కనిపించే ఈ జీవులే అయినా, వీటి వలన కలిగే నష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ఎలుకలు ఇళ్లల్లోనే కాదు కార్లలో కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ప్రత్యేకించి క్లోజ్డ్ గ్యారేజ్‌లలో కాకుండా బయటి వైపు పార్క్ చేసే కార్లు, వాహనాలలో ఎలుకలు కాపురం పెట్టేస్తుంటాయి.

వాహనాలలోని వైర్లు, ఫ్యూయెల్ పైపులు, హోస్ పైప్స్, బెల్టులు, బల్బ్ హోల్డర్లు, రబ్బర్ వస్తువులు, కనెక్టర్లను కొరికివేయటం కలుగుల గుండా కారు లోపలికి ప్రవేశించి, కారును అశుద్ధం చేయటం వంటి సమస్యలను ఈ ఎలుకల ద్వారా ఎదుర్కుంటుంటాం.

ఈసియూ (ఇంజన్ కంట్రోల్ యూనిట్)కి కనెక్ట్ అయి ఉండే కేబుల్స్‌ని ఎలుకలు కొరికి వేస్తే, ఇంజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండదు. అంతేకాకుండా, కారులోని పలు ఎలక్ట్రానిక్ అప్లికేషన్లు కూడా స్టార్ట్ కావు. పైపెచ్చు తెగిన కేబుల్స్ వలన కారులో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

మరి కార్లలో ఎలుకలు సృష్టించే భీభత్సానికి అడ్డుకట్ట వేయటం ఎలా? అసలు ఇది సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పరిశీలించండి..!

ఎలుకల బారి నుంచి మీ కారును కాపాడుకోవటం ఎలా?

తర్వాతి స్లైడ్‌లలో కార్లలోకి ఎలుకలు ప్రవేశించకుండా ఉండేందుకు ఏంచేయాలో తెలుసుకోండి.

టొబాకో

టొబాకో

కారు ఇంజన్ బేలో టొబాకో (పొగాకును) చిన్న గుడ్డలో మూటకట్టి రెండు మూడు చోట్ల కేబుల్స్‌కి కట్టి ఉంచినట్లయితే, ఆ వాసనకు ఎలుకలు కార్ ఇంజన్ బేలోకి ప్రవేశించవు.

నాఫ్తలీన్ బాల్స్

నాఫ్తలీన్ బాల్స్

నాఫ్తలీన్ బాల్స్ (కలరా ఉండలు) కూడా ఎలుకల నివారణకు చక్కగా ఉపయోగపడుతాయి. కొన్ని కలరా ఉండలను కారు ఇంజన్ బేలో అక్కడక్కడా ఉంచినట్లయితే, ఆ వాసనకు ఎలుకలు కారులోకి రాకుండా ఉంటాయి.

పెప్పర్ పౌడర్

పెప్పర్ పౌడర్

పెప్పర్ పౌడర్ (మిరియాల పొడి) వంటకే కాదు ఎలుకలను అరికట్టడానికి కూడా పనికొస్తుంది. కారు ఇంజన్ బే వద్ద పెప్పర్ పౌడర్‌ను చల్లినట్లయితే, ఆ వాసనకు ఎలుకలు కారులోకి రాకుండా ఉంటాయి. అయితే, డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కారులో కాస్తంత పెప్పర్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది.

ర్యాట్ డిటరెంట్

ర్యాట్ డిటరెంట్

ర్యాట్ డిటరెంట్ (ఎలుకల నివారిణి) అన్ని షాపులలోను, ఆన్‌లైన్ స్టోర్లలోను లభిస్తుంటుంది. దీనిని కార్ ఇంజన్ బేలో అక్కడక్కడా ఉంచినట్లయితే, ఎలుకలు వీటిని తిని చనిపోతాయి. ఒకవేళ కారు ఇంజన్ బేలో ఎలుకలు చనిపోయిన ఉన్నట్లయితే, వాటిని వెంటనే బయటకు దూరంగా తీసిపారేయాలి. లేకపోతే, కారులో విపరీతమైన దుర్వాసన రావచ్చు.

ర్యాట్ పాయిజన్

ర్యాట్ పాయిజన్

ర్యాట్ పాయిజన్ (ఎలుకల మందు)ను ఆటా (గోధుమపిండి)లో కలిపి ఇంజన్ బే వద్ద ఉంచినట్లయితే, వీటిని తిన్న ఎలుకలు చనిపోయే ఆస్కారం ఉంటుంది.

డ్రైనేజ్‌కి దగ్గర్లో పార్క్ చేయకండి

డ్రైనేజ్‌కి దగ్గర్లో పార్క్ చేయకండి

ఎలుకలు ఎక్కువగా మురికి కాలువలు, తడిసిన నేలల వద్ద ఉంటాయి. కాబట్టి, మీ కారును వీలైనంత వరకూ అలాంటి చోట్ల పార్క్ చేయకండి. ఒకవేళ పార్క్ చేయాల్సి వస్తే, పైన తెలిపిన చిట్కాలను పాటించండి.

పార్కింగ్ ఏరియాను మార్చండి

పార్కింగ్ ఏరియాను మార్చండి

మీ కారును పార్క్ చేసే ప్రాంతంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండి, దీనిని నియంత్రించేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అవుతూ ఉంటే, మీ పార్కింగ్ ప్రాంతాన్ని మార్చుకోవటమే ఉత్తమమైన మార్గం.

ఆల్ట్రా-సోనిక్ డివైజ్

ఆల్ట్రా-సోనిక్ డివైజ్

ఎలుకల బెడను తప్పించుకునేందుకు ఆల్ట్రా-సోనిక్ పరికరాలు కూడా మంచివే. అయితే, ఇవి పనిచేయాలంటే విద్యుత్/బ్యాటరీ తప్పనిసరిగా కావల్సి ఉంటుంది. వీటి నుంచి విడుదలయ్యే శబ్ధ తరంగాల వలన ఎలుకలు ఈ పరికరాలు ఉండే చోటుకి రాలేవు.

ఎలుకల బారి నుంచి మీ కారును కాపాడుకోవటం ఎలా?

ఫెనాల్

మెష్

మెష్

కారు గ్యారేజ్ డ్రైనేజ్ హోల్స్, ఇంటి డ్రైనేజ్ హోల్స్‌ను ఇనుప మెష్‌తో ఫిక్స్ చేసుకున్నట్లయితే, కలుగు గుండా ఎలుకలు ప్రవేశించే ఆస్కారం ఉండదు.

Most Read Articles

English summary
Rats will cause biggest problems for Car. Rats usually end up chewing things like hoses, belts, wires, bulb holders, rubber inserts, connecters and fasteners in Cars. Here are given some simple tips to protect your car from rats. 
Story first published: Tuesday, November 11, 2014, 13:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X