ట్రాఫిక్ రూల్స్: జరిమానా విధించే అధికారం ఎవరికి ఉంది?

By Ravi

Traffic Police
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారు ప్రభుత్వానికి జరిమానా కట్టక తప్పదు. మరి, జరిమానాను వసూలు చేసే అధికారం ఎవరికి ఉంది? సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు జరిమానాల పేరుతో మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? అయితే, ఈ ట్రాఫిక్ రూల్ గురించి తెలుసుకోండి.

ఏవరైనా తెలిసో తెలియకో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానాను విధించే అధికారం సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ), ఆపై హోదా కలిగిన ట్రాఫిక్ అధికారులకు మాత్రమే ఉంటుంది. ఎస్ఐ హోదా కన్నా తక్కువ హోదా కలిగిన అధికారులు వాహనాన్ని ఫొటో తీయటం లేదా ఎస్ఐ వచ్చే వరకు సదరు వాహనాన్ని నిర్భందించేందుకు మాత్రమే అధికారం ఉంటుంది.

ఒకవేళ మీ తప్పు లేకపోయినా ఛలాన్ రాసి, మీ నుంచి జరిమానా వసూలు చేసినట్లయితే, సదరు ఛలాన్ రిసీప్టుని తీసుకొని, జరిమానా విధించిన అధికారి పేరు, అతని హోదా వివరాలను తెలుసుకొని పూర్తి వివరాలతో ఓ ఫిర్యాదును ట్రాఫిక్ ఉన్నతాధికారులకు చేరవేయచ్చు.

మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారులు అవసరమైన డాక్యుమెంట్లను తనిఖీ చేసే ఆస్కారం ఉంటుంది. మీ వద్ద అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ, జరిమానా కట్టమనో లేక లంచం ఇవ్వమనో ఏ అధికారి అయినా కోరితే, సదరు అధికారి పేరు, హోదా వివరాలను నోట్ చేసుకొని తమ ఫిర్యాదును ట్రాఫిక్ అధికారులకు పంపించవచ్చు లేదా +91 9010203626 ట్రాఫిక్ కంప్లైంట్ నెంబరుపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

ఈ విధంగా ఫిర్యాదు చేసేటప్పుడు మీవైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ పేరుపై తప్పుడు ఛలాన్ రాసినప్పటికీ, మీరు ఎట్టి పరిస్థితుల్లోను పోలీసు వారితో వాగ్వివాదానికి దిగటం కానీ, గొడవపడటం కానీ చేయకూడదు. ఎవరైనా ట్రాఫిక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే వారి పూర్తి వివరాలను, సాక్ష్యాలతో పాటుగా హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి సమర్పించవచ్చు. మరింత సమాచారం కోసం http://www.htp.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మూలం: హైదరాదాబ్ ట్రాఫిక్ పోలీస్

Most Read Articles

English summary
Only traffic officers of the rank of sub-inspector and above have the powers to impose fines. The Rank below SI can only click the vehicle photograph or detain it for any violation until a SI comes. Also, If you are charged falsely, accept the slip. Note the name and rank of the officer, forward a complaint with all the details here.
Story first published: Monday, July 22, 2013, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X