2017లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వేగంతో ప్రయాణించే టాప్-10 రైళ్లు

Written By:

రైళ్లు ఎంత వేగంగా ప్రయాణించినా విమానాల మాదిరిగా సముద్రాలను దాటలేవు. కానీ విమానాల కన్నా అధిక వేగంతో ప్రయాణించే అవకాశం రైళ్లకు ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో విమానాల కన్నా అధిక ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఇవాళ్టి స్టోరీలో 2017 ఏడాదికి గాను ప్రపంచంలోకెల్లా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్ల గురించి ఓ లుక్కేసుకుందాం రండి...

10. తైవాన్ - THSR 700T - 299.9 కిమీలు

10. తైవాన్ - THSR 700T - 299.9 కిమీలు

టాప్ 10 ఫాస్టెస్ట్ ట్రైన్స్ జాబితాలో 10 వ స్థానంలో ఉన్న ఈ రైలు తైవా హై స్పీడ్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ సిరీస్‌లో ఒకటి. జనవరి 5, 2007లో Taipei City మరియు Kaohsiung నగరాల మధ్య THSR 700 రైలును తొలిసారిగా ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్ మొదలయ్యాక నాలుగన్నర గంటల జర్నీ టైమ్ కాస్త 90 నిమిషాలకు దిగివచ్చింది.

09. ఇటలీ - ETR 500 - 299.9 కిమీలు

09. ఇటలీ - ETR 500 - 299.9 కిమీలు

ఇటలీలో ETR 500 రెడ్ యారో(Frecciarossa) రైలు సర్వీస్ అత్యంత వేగవంతమైనది. దీనిని ట్రెనిటాలియా సంస్థ నిర్వహిస్తోంది. 72 ప్రాంతాలను కలుపుతూ మిలాన్-రోమ్-నాపల్ మార్గంలో ప్రయాణించే ఆ రైలు గరిష్ట వేగం గంటకు 299.9 కిలోమీటర్లుగా ఉంది. ఇప్పుడు ఇటలీలోని మిలాన్ మరియు రోమ్ మార్గంలో 28 నాన్ స్టాప్ ETR 500 రైళ్లు ప్రతిరోజూ సేవలందిస్తున్నాయి.

08. ఫ్రాన్స్ - SNCF TGV డుప్లెక్స్ - 319.9 కిమీలు

08. ఫ్రాన్స్ - SNCF TGV డుప్లెక్స్ - 319.9 కిమీలు

ఫ్రాన్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫాస్టెస్ట్ రైలు టిజివి డుప్లెక్స్. ఈ శక్తివంతమైన రైలు గరిష్టంగా 319.9కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫ్రాన్స్‌లో రైల్వే నిర్వహణ చేస్తున్న SNCF రైల్వే కంపెనీ వీటిని నిర్వహిస్తోంది. ఫ్రాన్స్‌లోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ తొలి రైలును TGV డుప్లెక్స్ రైలు సర్వీసును డిసెంబర్ 2011లో ప్రారంభించారు.

07. ఫ్రాన్స్ - అల్‌స్టామ్ యురోడుప్లెక్స్ - 319.9 కిమీలు

07. ఫ్రాన్స్ - అల్‌స్టామ్ యురోడుప్లెక్స్ - 319.9 కిమీలు

TGV డుప్లెక్స్ శ్రేణిలో యూరోడుప్లెక్స్ మూడవ సిరీస్ రైళ్లు. వీటిని కూడా ఫ్రెంచ్ రైల్వే కంపెనీ SNCF నిర్వహిస్తోంది. ఫ్రెంచ్, స్విట్జర్లాండ్, జర్మనీ మరియు లగ్సెంబర్గ్ రైల్వే నెట్‌వర్క్‌లను కలుపుతూపోయే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 319.9కిలోమీటర్లుగా ఉంది. ఫ్రాన్స్‌లో అత్యధిక వేగంతో పరుగులుపెట్టే రైలు ఇదే.

06. జపాన్ - E5 సిరీస్ షింకన్‌సెన్ హయాబుసా - 320కిమీలు

06. జపాన్ - E5 సిరీస్ షింకన్‌సెన్ హయాబుసా - 320కిమీలు

నేడు జపాన్‌లో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు E5 సిరీస్ షింకన్‌సెన్ హయాబుసా రైలు. ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ మార్చి 5, 2011లో ప్రారంభించింది. జపాన్‌లోని Tokyo మరియు Aomory నగరాల మధ్య గంటకు 320కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 715కిమీల దూరాన్ని కేవలం 2 గంటల 56 నిమిషాల్లోనే చేరుకుంటుంది.

05. స్పెయిన్ - టాల్గో 350 - 349కిమీలు

05. స్పెయిన్ - టాల్గో 350 - 349కిమీలు

స్పెయిన్‌కు చెందిన టాల్గో 350 రైలు ఆ దేశ రైల్వే కంపెనీ నిర్వహిస్తోంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ మరియు బార్సిలోనా నగరాల మధ్య టాల్గో 350 రైలు గంటకు 349కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

04. స్పెయిన్ - సైమన్స్ వెలారో E/AVS 103 - 349కిమీలు

04. స్పెయిన్ - సైమన్స్ వెలారో E/AVS 103 - 349కిమీలు

స్పానిష్ వెర్షన్‍‌కు చెందిన వెలార్ ఇ హై స్పీడ్ రైళ్లను జర్మనీకి చెందిన ఇంజనీరింగ్ దిగ్గజం సైమన్స్ అభివృద్ది చేసింది. స్పెయిన్‌లో ఈ వెలార్ రైళ్లను ఏవిఎస్ 103 పేరుతో పిలుస్తారు. బార్సిలోనా మరియు మాడ్రిడ్ నగరాల మధ్య తిరిగే ఈ రైళు గరిష్టంగా గంటకు 349కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

03. ఇటలీ - AVG Italo - 359కిమీలు

03. ఇటలీ - AVG Italo - 359కిమీలు

ఇటలీలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు ఏవిజి ఇటాలో. ఏప్రిల్ 2007లో రోమ్ మరియు నాపల్ నగరాల మధ్య సేవలు ప్రారంభించిన ఈ రైలు గరిష్టంగా గంటకు 359కిమీల వేగంతో ప్రయాణిస్తుంది.

02. చైనా - హార్మనీ CRH 380A - 379కిమీలు

02. చైనా - హార్మనీ CRH 380A - 379కిమీలు

ప్రపంచంలోకెల్లా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్ల జాబితాలో రెండవ స్థానంలో చైనాకు చెందిన హార్మనీ CRH 380A నిలిచింది.చైనా రైల్వే విభాగం రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మరియు మల్టిపుల్ యూనిట్ రైలు గరిష్టంగా గంటకు 379కిమీల వేగంతో దూసుకెళ్తుంది.

01. చైనా - షాంఘై మాగ్లేవ్ - 430కిమీలు

01. చైనా - షాంఘై మాగ్లేవ్ - 430కిమీలు

2017 ఏడాదిలో ప్రపంచంలోకెల్లా అత్యధిక వేగంతో పరుగులు పెట్టే రైలు చైనాలో ఉంది. షాంఘై మాగ్లేవ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ రైలు గరిష్ట వేగం గంటకు 430కిలోమీటర్లుగా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రైలు అత్యధిక వేగంతో దూసుకెళ్లే విధంగా అభివృద్ది చేశారు.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu Top 10 Fastest Trains In The World 2017
Story first published: Saturday, June 17, 2017, 16:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark