ఇండియాలోని పది విభిన్న రైల్వే స్టేషన్ల గురించి ఆసక్తికరమైన నిజాలు

Written By:

ప్రభుత్వ ఆస్తులు అంటే దాదాపు అన్నీ ఒకే శైలిలో ఉంటాయి. కానీ రైల్వే స్టేషన్ల విషయానికి వస్తే, ఇది చాలా విభిన్నం. ఒక్కో ప్రాంతానికి సంభందించిన ప్రత్యేకతలతో ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం ఉంటుంది. నిర్మాణం పరంగానే కాకుండా ఆ ప్రాంత ప్రత్యేకత ఆధారంగా ఇండియన్ రైల్వేలో ఉన్న పది విభిన్న రైల్వే స్టేషన్ల గురించి ఆసక్తికరమైన విషయాలు నేటి కథనంలో...

అత్యంత ఎత్తైన, అత్యంత పురాతణమైన, పురాతణ ఫోర్ట్ ఆకారంలో, జలపాతం క్రింద ఇలా విభిన్న ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్న పది ఇండియన్ రైల్వే స్టేషన్ల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రాయపురం రైల్వే స్టేషన్

రాయపురం రైల్వే స్టేషన్

చెన్నై సబర్బన్ రైల్వే సెక్షన్‌లోని దక్షిణ రైల్వేలో అత్యంత పురాతణమైన స్టేషన్ ఇది. భారత దేశపు అత్యంత పురాతణమైన మరియు దక్షిణ భారత దేశంలో తొలి మరియు పురాతణ రైల్వే స్టేషన్ రాయపురం స్టేషన్. జూన్ 28, 1856లో ఈ స్టేషన్ ప్రారంభించబడింది.

గుమ్ రైల్వే స్టేషన్

గుమ్ రైల్వే స్టేషన్

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ గుమ్ రైల్వే స్టేషన్ భారతదేశంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్. సముద్ర మట్టానికి 7,407 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ జిల్లాలో కలదు.

దూద్‌సాగర్ రైల్వే స్టేషన్

దూద్‌సాగర్ రైల్వే స్టేషన్

ఇండియన్ రైల్వేలో అతి చిన్న రైల్వే స్టేషన్‌గా ఈ దూద్‌సాగర్ స్టేషన్ ప్రాచుర్యం పొందింది. గోవా మరియు కర్ణాటక సరిహద్దులోని ఆకురాల్చే అడవుల్లో ఉన్న భగవాన్ మహవీర్ అభయారణ్యంలో ఉన్న జలపాతానికి సమీపంలో ఈ దూద్‌సాగర్ రైల్వే స్టేషన్ కలదు. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు జలపాతం క్రిందుగా, వంతెన మీద రైళ్లో ప్రయాణించవచ్చు.

మన్వాల్ రైల్వే స్టేషన్

మన్వాల్ రైల్వే స్టేషన్

ఇండియన్ రైల్వేలోని మొదటి గ్రీన్ స్టేషన్‌గా ఇది పేరుగాంచింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో, సముద్ర మట్టానికి 491 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ రైల్వే మొత్తం సాంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించుకుంటుంది. లైట్లు మరియు ఫ్యాన్లు అన్నింటికి సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందుతుంది.

సార్‌నాథ్ రైల్వే స్టేషన్

సార్‌నాథ్ రైల్వే స్టేషన్

ఇండియన్ రైల్వేలో ఉన్న అత్యంత విభిన్నమైన రైల్వే స్టేషన్ సార్‌నాథ్ స్టేషన్. సార్‌నాథ్ స్టేషన్ నిర్మాణం మరియు కట్టడం మొత్తం సాంచీ స్తూపం ఆధారంగా డిజైన్ చేయబడింది. సార్‌నాథ్ మరియు వారణాసి కలిపే మార్గంలో ఈ స్టేషన్ కలదు.

కటక్ రైల్వే స్టేషన్

కటక్ రైల్వే స్టేషన్

ఫోర్ట్ స్టైల్ నిర్మాణం ఈ స్టేషన్ ప్రత్యేకత. హౌరా మరియు చెన్నై మార్గంలో ఉన్న ఈ స్టేషన్‌ను తొలిసారి సందర్శించబోయే వారు దీనిని స్టేషన్ అని గుర్తించడంలో విఫలం చెందడం ఖాయం. ఎంట్రన్స్ మరియు లోపలి భాగం పూర్తిగా కోట తరహాలో నిర్మించబడి ఉంటుంది.

వాషి రైల్వే స్టేషన్

వాషి రైల్వే స్టేషన్

హార్బర్ లైన్ మీదుగా ఇండియన్ రేల్వేకు ఉన్న ఇండియన్ రైల్వే స్టేషన్‌లలో వాషి రైల్వే స్టేషన్ అతి ప్రధానమైనది. ముంబాయ్‌లోని ఇంటర్నేషనల్ ఇన్ఫోటెక్ పార్క్ బిల్డింగ్ క్రింద ఈ స్టేషన్ నిర్మించబడింది.

రషిద్‌పుర కోహ్రి రైల్వే స్టేషన్

రషిద్‌పుర కోహ్రి రైల్వే స్టేషన్

ఈ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ లేదా టిటిఇ మరియు గార్డ్ ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. రషిద్‌పుర కోహ్రి రైల్వే స్టేషన్‌ పూర్తిగా స్థానికుల ఆధారంతో నడుస్తోంది. ఇండియన్ రైల్వేలో స్థానికుల చేత నిర్వహించబడుతున్న ఏకైక రైల్వే స్టేషన్ రషిద్‌పుర కోహ్రి రైల్వే స్టేషన్ రాజస్థాన్‌లో కలదు.

ధనుష్కోటి రైల్వే స్టేషన్

ధనుష్కోటి రైల్వే స్టేషన్

తమిళనాడు రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉన్న రామేశ్వరం దీవి యొక్క దక్షిణ కొన భాగంలో ధనుష్కోటి కలదు. దీనిని దెయ్యాల పట్టణం అని కూడా పిలుస్తారు. ఇండియాలో ఉన్న ఐదు ఘోస్ట్ టౌన్‌లలో ధనుష్కోటి ఒకటి. దెయ్యాల పట్టనంలో ఉన్న ఏకైక భారతదేశపు రైలే స్టేషన్ ధనుష్కోటి స్టేషన్.

సరిగ్గా 51 ఏళ్ల క్రితం 1964 డిసెంబర్ 21 రాత్రి వచ్చిన పెద్ద తుఫాన్ ధనుష్కోటిని పూర్తిగా ముంచేసింది. ఈ ఘటనలో సుమారుగా మూడు వేల మందికి పైగా మరణించారు. రైలులో ప్రయాణిస్తున్న ఐదు మంది స్టాఫ్, 115 మంది ప్రయాణికులతో సహా రైలు సముద్రంలో మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంతం దెయ్యాల పట్టణంగా ప్రాచుర్యం పొందింది.

భవాని మండి రైల్వే స్టేషన్

భవాని మండి రైల్వే స్టేషన్

దేశీయంగా ఉన్న విభిన్న రైల్వే స్టేషన్లలో భవాని మండి స్టేషన్ ఒకటి. రెండు రాష్ట్రాలను వేరూ చేస్తూ నిర్మించబడింది ఈ స్టేషన్. ఈ స్టేషన్‌కు ఉత్తర భాగం వైపు మహారాష్ట్ర మరో వైపు రాజస్థాన్ రాష్ట్రం కలదు. రాజస్థాన్‌లోని జల్వార్ అనే ప్రాంతాన్ని పాలించిన శ్రీ భవాని సింగ్ 1911లో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయించాడు. ఈయన పేరు మీదుగా దీనికి భవాని మండి రైల్వే స్టేషన్ అనే పేరు వచ్చింది.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu 10 Unique and Interesting Facts of Indian Railway Stations
Story first published: Monday, June 19, 2017, 13:15 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark