ప్రతి విమానయాన అభిమాని అనుభవం పొందాల్సిన 20 విమానాలు

Written By:

తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి అన్న సామెత ప్రకారం విమాన ప్రయాణం చేయాలంటే ఈ విమానాలనే ఎంచుకోవాలి చెప్పవచ్చు. నాలుగైదు దశాబ్దాల క్రితం విమాన ప్రయాణం ఏదో కొద్ది మందికి మాత్రం అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు విమానయాన రంగంలో జరిగిన అభివృద్దిని గమనిస్తే ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే విధంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

వృత్తి, వ్యాపారరీత్యా ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న వారికి విమాన ప్రయాణం కొత్తేమీ కాదు. అయితే విమానయాన రంగం ప్రారంభమైనప్పటి నుండి 20 అతి ముఖ్యమైన దిగ్గజ విమానాలు సేవల్లోకి వచ్చాయి. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ విమానాలలో ప్రయాణించాలంటోంది ఆన్‌లైన్ ఆంగ్ల వార్తా వేదిక సిఎన్ఎన్

To Follow DriveSpark On Facebook, Click The Like Button
20. డి హ్యావిల్లాండ్ కెనడా డిహెచ్‌సి-6 ట్విన్

20. డి హ్యావిల్లాండ్ కెనడా డిహెచ్‌సి-6 ట్విన్

గత 50 సంవత్సరాల విమానయాన రంగం చరిత్రలో అత్యుత్తమ విమానాలను జల్లెడపడితో అందులో 20 ఉన్నాయి. వాటిలో చివరిది డిహెచ్‌సి-6. చిత్రంలో ఉన్న విమానం చూడటానికి పరిమాణం పరంగా చిన్నగా ఉన్నప్పటికీ అత్యంత శక్తివంతమైన మరియు ధృడమైనది. చిన్నగా ఉన్న రన్‌వేల మీద సులభంగా ల్యాండ్ అవుతుంది.మొదటి సారిగా 1965 లో విమానయాన రంగంలో పరిచయం చేయడం జరిగింది.

19. బోయింగ్ 737

19. బోయింగ్ 737

ఈ విమానం ప్రస్తుతం చాలా మందికి సుపరిచితం అని చెప్పవచ్చు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1967 లో బోయింగ్ 737 విమానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అత్యుత్తమ అమ్మకాలు సాగిస్తున్న విమానాలలో ఇదీ ఒకటి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 9,000 737 విమానాలలో అనేక వేరియంట్లు ఉన్నాయి. ప్రపంచ నలుమూలల ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ సర్వీసుల్లో ఈ విమానాలను వినియోగిస్తున్నాయి.

18. బోయింగ్ 747

18. బోయింగ్ 747

బోయింగ్ సంస్థ ఈ 747 విమానాన్ని 1969 లో ప్రపంచానికి పరిచయం చేసింది. విమానానికి ముందు వైపున డబుల్ డెస్క్, వెనుక వైపున సింగల్ డెస్క్ కలగిన ఈ విమానం జుంబో జెట్ పేరుతో దిగ్గజం విమానంగా పేరుగాంచింది. డిజైన్ పరంగానే కాకుండా సామర్థ్యం, విశ్వసనీయత పరంగా సుమారుగా 40 ఏళ్లపాటు క్వీన్ ఆఫ్ ది స్కైస్ గా కొనసాగింది. ఈ జుంబో విమానాలను బ్రిటీష్ ఎయిర్‌వేస్ మరియు లుఫ్తాన్సా విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

17. ఇల్యూషిన్ ఐఎల్-76

17. ఇల్యూషిన్ ఐఎల్-76

ఇల్యూషిన్ ఐల్-76 విమానం మొదటిసారిగా 1971 లో పరిచయం అయ్యింది, తరువాత 1974 నాటికి సోవియట్ ఎయిర్ ఫోర్స్‌లో సేవలు ప్రారంభించింది. ఈ విమానం యొక్క ప్రాథమిక కర్తవ్యం, విభిన్న ఎత్తైన మార్గాలలో ప్రయాణించడం, అగ్నిమాపక సేవలందించడం, మిలిటరీలో సరకు మరియు సైనికుల రవాణాతో పాటు ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు అనేక ఇతర మిలిటరీ అవసరాలకు వినియోగంలో ఉంది. అతి తక్కువ విమానాలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. అయితే ఇప్పటికీ అవసరాన్ని బట్టి తయారవుతున్నాయి.

16. ఆంటనోవ్ ఏఎన్-72/ఏఎన్-74

16. ఆంటనోవ్ ఏఎన్-72/ఏఎన్-74

ఆంటనోవ్ విమానాలు సాధారణంగా మిగతా వాటికంటే కాస్త అందవిహీనంగానే ఉంటాయి. అందులో ఒకటి ఏఎన్-72 1977 లో మరియు రెండవది ఏఎన్-74 1983లో విమానయాన రంగానికి పరిచయం చేయబడ్డాయి. రెండు జెట్ ఇంజన్‌లు విమాన శరీరం పై భాగంలో అమర్చిబడి ఉంటాయి. రష్యాలోని కొన్ని టూర్ ఆపరేటర్లు ఈ విమానాలను వినియోగిస్తున్నాయి.

15. బిఎఇ 146/ అవ్రో ఆర్‌జె

15. బిఎఇ 146/ అవ్రో ఆర్‌జె

బ్రిటీష్‌కు చెందిన తక్కువ దూరాలకు విమానాలను నడిపే సంస్థ ఈ విమానాలను వినియోగిస్తోంది. 1981 లో పరిచయం అయిన బిఎఇ 146 విమానం అనంతరం అవ్రొ ఆర్‌జె విమానం 1992 లో పరిచయం అయ్యింది. రూపం పరంగా ఇది ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుంది.

14. ఏటిఆర్ 42

14. ఏటిఆర్ 42

ఏటిఆర్ 42 1984 నుండి సేవల్లోకి వచ్చింది. 1980 లో ఫ్రెంచ్‌కు చెందిన ఏరోస్పాటైల్ సంస్థ (ఇప్పుడు ఎయిర్ బస్‌తో కలిసిపోయింది) మరియు ఇటలీకి చెందిన అలెనీయా తో కలిసి రీజనల్ ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను నిర్మించాలనుకున్నాయి. దాకని ప్రతిఫలమే ఈ ఏటిఆర్ 42. 42 మరియు తరువాత వచ్చిన 72 శ్రేణి విమానాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.

13. ఎయిర్‌బస్ ఏ320

13. ఎయిర్‌బస్ ఏ320

ఈ జాబితాలో అందించిన బోయింగ్ 737 మరియు ఎయిర్‌బస్ ఏ320 రెండు ఒకే తరహా విమానాలు రెండూ కూడా విమానయాన రంగంలో అతి ముఖ్యమైనవి. ఎయిర్‌బస్ మొదటి సారిగా 1987 లో ఈ ఏ320 విమాన్ని పరిచయం చేసింది. గత 20 సంవత్సరాల నుండి బోయింగ్ 737 కన్నా ఎక్కువ విమానాలను విక్రయించగలిగింది. ఎయిర్‌బస్ ఇప్పుడు బోయింగ్ 737 మీద ఆధిపత్యం కోసం ఏ320నియో విమానాన్ని అభివృద్ది చేస్తోంది.

12. ఏఎన్-225 మ్రియా

12. ఏఎన్-225 మ్రియా

పరిమాణం పరంగా చాలా మంది ఎయిర్‌బస్ ఎ380 పెద్ద విమానం అనుకుంటారు, కానీ ఆంటనోవ్‌కు చెందిన ఏఎన్-225 మ్రియా కూడా ఈ పరిమాణం పరంగా ఏ380 తరహాలో ఉంటుంది. ప్రారంభంలో దీనిని సోవియట్‌కు చెందిన స్పేస్ షటిల్ ను మోసుకెళ్లడానికి రూపొందించారు. తరువాత కార్గో సరుకు రవాణా కోసం దీని మార్చేశారు. ఈ విమానం ఇప్పటికీ సేవల్లో ఉంది.

అయితే ఇందులో ప్రయాణించడానికి కుదరదు, ఉక్రెయిన్‌కు చెందిన కార్గో ఆపరేటర్ ఆంటనోవ్ ఎయిర్‌లైన్స్ ను ఒప్పించగలిగితే ప్రయాణించవచ్చు.

11. ఇల్యూషిన్ ఐఎల్-96

11. ఇల్యూషిన్ ఐఎల్-96

ఇల్యూషిన్ ఐఎల్-96 మొదటి విమానం 1988 లో ప్రపంచానికి పరిచయం చేయబడింది. లాంగ్ రేంజ్ కోసం నాలుగు ఇంజన్‌లను కలిగి ఉన్న విశాలమైన బాడీ కలిగిన విమానాన్ని రష్యాకు చెందిన విమానాల తయారీ సంస్థ నిర్మించింది. దీనిని కూడా ముందుగా సోవియట్ సివిలియన్ సర్వీసెస్ కోసం వినియోగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇల్యూషిన్ ఐఎల్-96 విమానాలు కేవలం 29 మాత్రమే ఉన్నాయి.

10. ఎయిర్‌బస్ ఏ340

10. ఎయిర్‌బస్ ఏ340

దూర ప్రాంత ప్రయాణాల కోసం ఎయిర్‌బస్ ఈ ఏ340 విమానాన్ని 1980 నుండి అభివృద్ది చేస్తూ వచ్చింది. చివరికి 1991 నాటికి విమానయాన రంగానికి పరిచయం చేసింది. ఇందులో ఏకంగా 260 నుండి 350 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఉన్న బోయింగ్ 747 మరియు బోయింగ్ 767 సిరీస్‌లోని చిన్న విమానాలతో గట్టి పోటీపడుతోంది. ఎయిర్‌బస్ ఈ ఏ340 ను అనేక సిరీస్‌లలో ప్రవేశపెట్టింది.

09. బాంబర్‌డైయర్ సిఆర్‌జె

09. బాంబర్‌డైయర్ సిఆర్‌జె

కెనడాకు చెందిన ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ సంస్థ బాంబర్‌డైయర్ ఈ విమానాన్ని చిన్న పరిమాణంలో ఆకర్షణీంగా 50 నుండి 100 మంది వరకిు ప్రయాణించే విధంగా అభివృద్ది చేసింది. సిఆర్‌జె పేరుతో విభిన్న సిరీస్‌లలో వీటిని విక్రయిస్తోంది బాంబర్‌డైయర్. 100 కు పైబడి సిఆర్‌జె విమానాలు సేవల్లో ఉన్నాయి.

08. బోయింగ్ 777

08. బోయింగ్ 777

బోయింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న విమానాలలో ఒకటి బోయింగ్ 777 సిరీస్ విమానం. ఇందులో గరిష్టంగా 300 నుండి 450 మంది వరకు ప్రయాణించవచ్చు. బోయింగ్ పరిచయం చేసిన ఈ కమర్షియల్ విమానం 100 శాతం డిజిటల్‌గా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ మరియు ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్‌లైన్స్‌లలో సేవల్లో ఉంది.

07. ఎంబ్రాయెర్ ఇ-జెట్

07. ఎంబ్రాయెర్ ఇ-జెట్

బ్రెజిల్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయెర్ ఇ-జెట్ శ్రేణిలో ఇ170/175 కలవు. 70 నుండి 80 మంది సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మరియు ఇ190/195 శ్రేణిలోని విమానాలు 100 నుండి 120 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 2002 లో సేవల్లోకి వచ్చిన వీటిని 2004 నాటికి 1,000 కి పైగా విమానాలను డెలివరీ ఇచ్చినట్లు ఎంబ్రాయెర్ తెలిపింది.

06. ఆంటనోవ్ ఏఎన్-148/158

06. ఆంటనోవ్ ఏఎన్-148/158

ఆంటనోవ్ డిజైన్ బ్యూరో అభివృద్ది చేసిన మరో శ్రేణి 148 మరియు 158. ఈ రెండింటిలో మొత్తం 40 విమానాలను మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా విక్రయించింది. పెద్దగా విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం, అసాధారణ డిజైన్. బిఎఇ 146 రూపానికి కాస్త దగ్గరిపోలికలతో ఉంటుంది. ఈ విమానాలలో ప్రయాణించాలంటే రష్యాకు చెందిన రోస్సియా లేదా అంగారా ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

05. ఎయిర్‌బస్ ఏ380

05. ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ విడుదల చేసిన విమానాలలో కెల్లా భారీ పరిమాణంలో ఉన్న డబుల్ డెక్కర్ విమానం ఇది. పరిమాణం పరంగా మరే ఇతర విమానాలు దీనితో పోటీపడలేవని చెప్పాలి. దీని ద్వారా సుమారుగా 800 మంది వరకు ప్రయాణించవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకు విమానయాన సంస్థలు దీనిని అధికంగా ఎంచుకుంటున్నాయి.

04. సుఖోయ్ సూపర్ జెట్ 100

04. సుఖోయ్ సూపర్ జెట్ 100

110 సీటింగ్ సామర్థ్యం ఉండే సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానాన్ని రష్యాలోని ఎయిర్ లైన్స్ సంస్థలు వినియోగిస్తున్నాయి. సరసమైన ధరతో తక్కువ నిర్వహణ సామర్థ్యంతో వీటిని వినియోగిస్తున్నాయి. ఇటలీ లోని అలేనియా మరియు ఇతర విభిన్న ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ సంస్థలు భాగస్వామ్యంతో ఈ విమానాన్ని తయారు చేశాయి. ప్రస్తుతం మెక్సికోలోని ఇంటర్‌జెట్, ఇండోనేషియాలోని స్కై ఏవియేషన్ సంస్థలు వినియోగిస్తున్నాయి.

03. బోయింగ్ 787

03. బోయింగ్ 787

బోయింగ్ 787 విమానాన్ని మొదటి సారిగా 2009 లో పరిచయం చేయడం జరిగింది. దీనిని తక్కువ బరువుతో నిర్మించేందుకు ఎయిర్ క్రాఫ్ట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిశ్రమ పదార్థాలను వినియోగించి నిర్మించడం జరిగింది. దీనిని ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారు.

02. ఎయిర్‌బస్ ఏ350 ఎక్స్‌డబ్ల్యూబి

02. ఎయిర్‌బస్ ఏ350 ఎక్స్‌డబ్ల్యూబి

బోయింగ్ 787 విమానం విమాన పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న తరుణంలో ఈ ఏ350 విమానాన్ని విశాలమైన బాడీతో అత్యంత దూరం ప్రయాణించే విధంగా 280 నుండి 400 మంది ప్రయాణించే సామర్థ్యం ఎయిర్‌బస్ తయారు చేసింది. బోయింగ్ వారి 777 మరియు డ్రీమ్ లైనర్ విమానాలకు ఇది ప్రత్యక్షంగా బలమైన పోటీనిస్తోంది. డెలివరీలు ప్రారంభించిన 2015 ఏడాది నుండి సుమారుగా 800 యూనిట్ల ఏ350 విమానాలను విక్రయించింది ఎయిర్‌బస్.

01. బాంబర్‌డైయర్ సి సిరీస్

01. బాంబర్‌డైయర్ సి సిరీస్

బాంబర్‌డైయర్ సి సిరీస్ కుటుంబంలోని సిఎస్100 విమానాన్ని 2013 లో మరియు సిఎస్300 విమానాన్ని 2015 లో విమానయాన సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బోయింగ్ మరియు ఎయిర్‍‌‌బస్ సంస్థల్లోని 110 నుండి 160 సీటింగ్ సామర్థ్యం ఉన్న విమానాలకు ఈ రెండు గట్టి పోటీనిస్తున్నాయి. 2016 జూలైలో సేవలు ప్రారంభించిన ఈ విమానాలు ఇప్పుడు స్విస్ గ్లోబల్ ఎయిర్ వద్ద ఉన్నాయి.

 
English summary
20 planes every aviation fan should experience
Story first published: Friday, January 20, 2017, 16:53 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark