1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). ఈ దేశంలో అప్పుడప్పుడు లక్కీ డ్రా ద్వారా చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు మరియు బంగారం వంటివి గెలుచుకుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క 50 వ జాతీయ దినోత్సవం సందర్భంగా భారతదేశానికి చెందిన ఒక డ్రైవర్ మహ్జూజ్ యొక్క వీక్లి లక్కీ డ్రాలో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

నివేదికల ప్రకారం, ఇటీవల ముగిసిన మహ్జూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారతదేశానికి చెందిన 22 సంవత్సరాల వయసు కలిగిన అక్షయ్ ఎరియకదన్ అరవిందన్ ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. ఇతడు భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

అక్షయ్ ఎరియకదన్ అరవిందన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే కారు డ్రైవర్. అతను 2018 సంవత్సరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లాడు. అతను తన తల్లి, సోదరుడు మరియు సోదరితో సహా తన కుటుంబాన్ని పోషించడానికి అక్కడ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

అయితే అతని తండ్రి 2020 లో క్యాన్సర్‌ మహమ్మారి వల్ల మరణించారు. అయితే ఇక్కడ ఒక యాదృచ్ఛికమైన విషయం ఏమిటంటే, అక్షయ్ తన తండ్రి మొదటి వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును అందుకున్నాడు. అక్షయ్ ఈ అవార్డును తన దివంగత తండ్రికి అంకితమిచ్చాడు. ఇది నిజంగా చాలా అరుదైన విషయం.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

ఈ సందర్భంగా అక్షయ్ తన తన తండ్రి స్వర్గం నుంచి తనను ఆశీర్వదించడం వల్ల బంగారం గెలుచుకున్నానని చెప్పారు. ఇన్నాళ్లూ తనకు వెన్నుదన్నుగా నిలిచే తన తండ్రి లేకపోవడం వల్ల చాలా కష్టాలను భరించానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తానూ గెలుపొందిన ఈ అదృష్టంతో తనకు ఉన్న ఆర్థిక భారాలు మరియు బాధ్యతలు చాలా వరకు తగ్గుతాయని తెలిపాడు.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

ఈ మెగా ప్రైజ్‌తో పాటు, మహ్జూజ్ లక్కీ డ్రా మరో ఇద్దరు భారతీయులను కూడా వరించింది. ఇందులో ఇమ్రాన్ మరియు రిజుజు ఉన్నారు. వీరిద్దరూ 10 లక్షల దిర్హామ్‌లు (రూ. 2,06,34,490) గెలుచుకున్నారు. ఇమ్రాన్ యూఏఈలో సేల్స్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, రిజు మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దిర్హామ్ 1 మిలియన్ యొక్క రెండవ ప్రైజ్ మనీని 43 మంది వేర్వేరు విజేతలు పంచుకున్నారు, ఒక్కొక్కరికి 23,255 దిర్హామ్‌లు (రూ. 4,79,855) బహుమతి అందుతుంది.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భారతీయులు లక్కీ డ్రాలో బహుమతి గెలుచుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలామంది భారతీయులు ఇలాంటి లక్కీ డ్రాలో గొప్ప గొప్ప బహుమతులు గెలుచుకున్నారు.

ఇంతకు ముందు దుబాయ్ డ్యూటీ-ఫ్రీ ద్వారా లక్కీ డ్రాలో కొంతమంది భారతీయులు రేంజ్ రోవర్ మరియు మెక్‌లారెన్ 570S స్పైడర్‌లను గెలుచుకున్నారు. యుఎఇ రిజిస్ట్రేషన్ పాలసీకి అనుగుణంగా, ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఇఐటిసి) నుండి డు గడువు ముగిసిన ID రిజిస్ట్రేషన్‌లు కలిగిన కస్టమర్‌లను జనవరి 31 లోపు వారి నంబర్‌ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాలని ఆహ్వానించారు. బల్వీర్ తన డు మొబైల్ నంబర్‌ను తిరిగి నమోదు చేసుకున్నాడు, కంపెనీ తన కస్టమర్లందరిచే చేయవలసిందిగా పేర్కొంది.

1 కేజీ బంగారం గెలుచుకున్న 22 ఏళ్ల భారతీయ డ్రైవర్.. ఎక్కడంటే?

జనవరి 31వ తేదీకి ముందు ID రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకున్న కస్టమర్‌లందరూ లక్కీ డ్రా పోటీలో ప్రవేశించారు, ఇందులో మెక్‌లారెన్ స్పోర్ట్స్ కారును మొదటి బహుమతిగా పొందారు. UAE లో అప్పుడప్పుడు సాధారణ జాక్‌పాట్‌లు జరుగుతాయి. అనేక మంది భారతీయ ప్రవాసులు దేశంలో కోట్లాది రూపాయల విలువైన ప్రైజ్ మనీని గెలుచుకున్నట్లు నివేదించారు. ఇది వారి జీవితాలనే చాలా వరకు మార్చి వేస్తుంది.

ఇలాటి లక్కీ డ్రాలు ప్రపంచంలో చాలా దేశాల్లో జరగటం గురించి మనం ఇప్పటికే చాలా సార్లు విని ఉంటాము. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం చాలా పెద్ద మొత్తంలో జాక్ పాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి మున్ముందు కూడా ఎక్కువ సంఖ్యలో తప్పకుండా జరుగుతాయి. ఇలాటి లక్కీ డ్రాలో చాలా మంది వారి అదృష్టాలను పరీక్షించుకోవచ్చు.భారతదేశంలో కూడా అప్పుడప్పుడు పండుగల సందర్భంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ఇలాంటి లక్కీ డ్రాలో కార్లు లేదా బైకులు వంటివి గెలుచుకోవచ్చు, కానీ ఇంత పెద్ద మొత్తంలో లక్కీ డ్రా అంటే ఇప్పటి వరకు మనదేశంలో జరగలేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఇలాంటివి కేవలం వారి అద్రుష్టాల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. కావున అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి వాటిని పొందుతారు.

Most Read Articles

English summary
22 years old indian driver wins 1 kg gold in united arab emirates details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X