స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టార్

మార్వెల్ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌లో కనిపించే బ్రిటీష్ నటుడు టామ్ హాలండ్ (Tom Holland) జర్మన్ కార్ బ్రాండ్ పోర్ష్ అందిస్తున్న టేకాన్ టర్బో ఎస్ (Porsche Taycan Turbo S) ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి, తన గో గ్రీన్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు మన టాలీవుడ్ "స్పైడర్" సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఇప్పుడు తన పర్యావరణ సాన్నిహిత్యమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా ఇందిస్తున్న ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రోన్ (Audi e-Tron)ను మహేష్ బాబు కొనుగోలు చేశారు.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

మహేష్ బాబు ఇప్పుడు తన కార్ గ్యారేజీలో ఇతర లగ్జరీ కార్ల సరసన ఈ ఎలక్ట్రిక్ కారును కూడా చేర్చుకున్నారు. ఇటీవల ఆయన ఆడి ఇ-ట్రాన్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డెలివరీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో నటుడు మహేష్ బాబు మరియు ఆడి ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్‌లు కనిపిస్తారు. సమాచారం ప్రకారం, మహేష్ బాబు యొక్క కొత్త ఆడి ఇ-ట్రాన్ నేవీ బ్లూ కలర్ ఆప్షన్ లో పెయింట్ చేయబడి ఉంది.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి బ్రాండ్, గతేడాది జులై నెలలో 'ఆడి ఇ-ట్రోన్' (Audi e-Tron) ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇ-ట్రోన్ ఆడి బ్రాండ్‌కు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఆ సమయంలో ఈ కారు మార్కెట్లోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయి రికార్డు సృష్టించింది. ఆడి ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు (భారతదేశానికి) దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, మనదేశంలో ఈ ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ కారు ధర కోటి రూపాయలకు పైగానే ఉంటుంది.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

భారత మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆడి ఇ-ట్రోన్, ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఇ-ట్రోన్ జిటి మరియు ఆడి ఆర్ ఇ-ట్రోన్ జిటి వేరియంట్లు ఉన్నాయి. దేశీయ విపణిలో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.99.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఆడి ఇ-ట్రోన్ 50 క్వాట్రో వేరియంట్‌లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్‌పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

ఆడి ఇ-ట్రోన్ లో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ రెండు వేరియంట్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్‌ను మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. బేస్ వేరియంట్ అయిన ఆడి ఇ-ట్రోన్ 50 పూర్తి చార్జ్ పై 359 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుండగా, ఆడి ఇ-ట్రోన్ 55 పూర్తి ఛార్జ్‌పై 484 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కార్లను 150 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్‌ ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

కంపెనీ ఈ కారును స్టాండర్డ్ చార్జర్ తో కూడా అందిస్తోంది. ఇందులోని బ్యాటరీలను 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్‌ను ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, సుమారు 8.5 గంటల సమయంలో బ్యాటరీలను 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ సిరీస్‌లో జిటి (గ్రాన్ తురిస్మో) మోడళ్లను కూడా విక్రయిస్తోంది. ఇవి పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్లుగా ఉంటాయి. ఇందులో కొత్త Audi e-Tron GT (ఆడి ఈ-ట్రోన్ జిటి) మరియు Audi RS e-Tron GT (ఆడి ఆర్ఎస్ ఈ-ట్రోన్ జిటి) మోడళ్లు ఉన్నాయి. ఇవి గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదలయ్యాయి.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

దేశీయ మార్కెట్లో Audi RS e-Tron GT ధర రూ. 1.80 కోట్లు (ఎక్స్-షోరూమ్) కాగా, Audi RS e-Tron GT ధర రూ. 2.05 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త ఇ-ట్రోన్ జిటి వెర్షన్ లో 83.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 475 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 245 కిమీగా ఉంటుంది. ఆడి ఇ-ట్రోన్ జిటి పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

స్పైడర్ మ్యాన్ బాటలోనే మహేష్ బాబు కూడా.. ఎకో-ఫ్రెండ్లీ ఆడి ఇ-ట్రోన్ ఈవీని కొన్న సూపర్ స్టూర్

ఇక ఆడి ఆర్ ఇ-ట్రోన్ జిటి వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 93.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 590 బిహెచ్‌పి పవర్ ను మరియు 830 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 250 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఆడి ఆర్‌ఎస్ ఇ-ట్రోన్ జిటి పూర్తి చార్జ్ పై 481 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Actor mahesh babu takes delivery of audi e tron details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X