ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు "సోనూ సూద్" కరోనా సమయంలో ఎంతోమంది పేదల పాలిట దేవునిగా నిలిచాడు. విదేశాలలో ఉన్న విద్యార్థులను సైతం మన దేశానికీ తీసుకు రావడానికి ఎంతగానో కృషి చేసాడు. సోనూ సూద్ దృష్టిలో పడిన ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వయంగా సహాయం చేసాడు. ఇటీవల కాలంలో తమ సొంత ఆస్తులను సైతం తాకట్టు పెట్టి సేవచేసిన మహాను భావుడు మరియు కలియుగ దానకర్ణుడు సోనూసూద్ ఇప్పుడు పేదవారికి ఉపాధి కల్పించడానికి ఇంకో అడుగు ముందుకు వేసి ఈ- రిక్షాలు ఇవ్వడానికి పూనుకున్నాడు.

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల అధిక స్థాయిలో వాయు కాలుష్యం రావడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ముడి చమురు దిగుమతులను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముడి చమురు దిగుమతి తగ్గించడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగుపడుతుంది.

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

కాబట్టి ఫెడరల్ ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు మరియు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాల కారణంగా, ఎలక్ట్రిక్ ఉత్పత్తులను అమ్మకానికి ప్రవేశపెట్టడానికి వాహన తయారీదారులు పోటీని ప్రారంభించారు.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద‌ల‌కు ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ట్లు సోనూసూద్ తెలిపాడు. "ఖుద్ క‌మావో, ఘ‌ర్ చలావో" పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. గ‌త కొన్ని నెల‌లుగా ఎంతో మంది త‌న‌పై ఎంత‌గానో ప్రేమ‌ను కురిపించార‌ని, అదే ఇప్పుడు త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించేలా ప్రేరేపిస్తున్నాయ‌ని సోనూ చెప్పాడు.

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ఇప్పటికి ఎంతోమంది ప్రజలకు సేవ చేయడంతో మరింత సేవచేయాలనే భావంతో ఈ ఖుద్ క‌మావో, ఘ‌ర్ చ‌లావో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపాడు. అవ‌స‌ర‌మైన వారికి నిత్యావ‌స‌రాలు ఇవ్వడానికి బ‌దులు ఇలా జీవ‌నోపాధి కల్పించడం ఉత్తమం అని భావించడం వల్ల ఈ పని చేయడానికి పూనుకున్నానన్నాడు.

MOST READ:వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ఈ - రిక్షాలు ఇవ్వడం వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రజలు మళ్ళీ వారి సొంతకాళ్లపై నిలపడటానికి అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది మొద‌ట్లో సోనూ ప్ర‌వాసీ రోజ్‌గార్ మొబైల్ యాప్ ప్రారంభించి దీని ద్వారా 50 వేల మందికి ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించాడు. త‌న సేవా కార్య‌క్ర‌మాల కోసం ఈ మ‌ధ్యే ముంబైలోని త‌న రూ. 10 కోట్ల విలువైన ఆస్తిని తాకట్టు పెట్టని విషయం అందరికి తెలిసిందే.

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

జీవనోపాధి కోల్పోయిన వారికి ఎలక్ట్రిక్ రిక్షాలను అందించాలని సోను సూద్ నిర్ణయించడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో వివిధ కొత్త ఎలక్ట్రిక్ రిక్షాలను ప్రవేశపెడుతున్నారు. యుపి టెలిలింక్స్ లిమిటెడ్ ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ రిక్షాను కూడా విడుదల చేసింది.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

కొత్త ఉత్పత్తికి లయన్ లి-అయాన్ అని పేరు పెట్టారు. ఇవి దాదాపు ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 30 పైసలు మాత్రమే ఖర్చవుతుందిని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ రిక్షా ధర 1.85 లక్షల రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వ ఫేమ్ ఇండియా II స్కీమ్ కింద 37 వేల రూపాయల గ్రాంట్ మాత్రమే లభిస్తుండటం గమనార్హం.

Most Read Articles

English summary
Actor Sonu Sood To Gift Electric Rickshaws To Those Who Have Lost Their Livelihood. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X