Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. ఇకపై వారు టోల్‌గేట్ చెల్లించకుండా ఉచితంగా వెళ్ళవచ్చు.. వారెవరనుకుంటున్నారా..!
ఇటీవల నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఒక శుభవార్తను ప్రకటించింది. అదేమిటంటే వికలాంగుల యాజమాన్యంలోని అన్ని వాహనాలు భారతదేశంలోని జాతీయ రహదారులపై ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించబడ్డాయి. ఈ సదవకాశాన్ని పొందటానికి తమ వాహనాల కోసం జీరో ట్రాన్సక్షన్ ఫాస్ట్‌ట్యాగ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి పొందవలసి ఉంటుంది.

వికలాంగుల యాజమాన్యంలోని అన్ని వాహనాలను టోల్‌గేట్ల వద్ద టోల్ చెల్లించకుండా మినహాయించడానికి ఫెడరల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ చర్యలు తీసుకుంది. ఈ వార్త వికలాంగ వాహనదారులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

భారతదేశంలో ఇప్పటి వరకు వికలాంగుల ఉపయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను మాత్రమే కస్టమ్స్ సుంకం నుండి మినహాయించారు. అంటే వికలాంగుల ఉపయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించి వాహనాలు టోల్‌గేట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
MOST READ:11 బోయింగ్ 767-300 జంబో జెట్లను కొనుగోలు చేసిన అమెజాన్.. కారణం ఇదే

ఈ రకమైన వాహనాలను సెంట్రల్ మోటారు వాహన చట్టం ప్రకారం చెల్లని వాహనాలుగా పరిగణిస్తారు. అయితే, వికలాంగుల యాజమాన్యంలోని అన్ని వాహనాలను కస్టమ్స్ సుంకం నుండి మినహాయించడానికి ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు.

2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.7 కోట్ల మంది వికలాంగులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ వీరిలో కొంతమంది వికలాంగులు మాత్రమే వాహనాలను నడుపుతున్నారు. ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ చెప్పిన ఈ విషయంతో వికలాంగులు చాలా సంతోషిస్తారు.
MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

టోల్‌గేట్ చెల్లింపు నుండి మినహాయింపు పొందిన వాహనాలకు ప్రభుత్వం జీరో ట్రాన్సక్షన్ అనేది ఏర్పాటు చేసింది. అంటే పార్లమెంటు సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు మొదలైన వారి వాహనాలపై జీరో లావాదేవీల జరుగుతాయి. అంటే ఈ వాహనాలు కూడా టోల్ గేట్ వద్ద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా, అత్యవసర సర్వీసుల్లో ఉపయోగించే వాహనాలు కూడా టోల్ గేట్ లో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. టోల్‌గేట్ ఫీజు చెల్లించకుండా మినహాయింపు లేని వర్గంలోని కొంతమంది సభ్యులు దీనిని దుర్వినియోగం చేయకుండా జీరో ట్రాన్సాక్షన్ ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉపయోగపడతాయి.
MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

నేషనల్ హైవే అథారిటీ ఇంతకు ముందు 2021 జనవరి 01 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని ప్రకటించింది, కానీ కరోనా మహమ్మారి వల్ల అందరూ ఫాస్ట్‌ట్యాగ్‌లను పొందలేకపోవడం వల్ల ఇప్పుడు ఆ గడువును 2021 ఫిబ్రవరి 15 కి పొడిగించడం జరిగింది.

2021 ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి, కావున వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ ఫాస్ట్‌ట్యాగ్ వల్ల వాహనదారులకు కూడా టోల్ గెట్ లో ఎక్కువ సమయం వేచి ఉండవలసిన అవసరం ఉండదు, దీని వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది.
MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?