Just In
- 9 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 12 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 12 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 13 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
పాక్షిక స్వేచ్ఛా?.. అబద్ధాలు, అర్థసత్యాలు వద్దు: యూఎస్ ఎన్జీవోపై భారత్ ఆగ్రహం
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Lifestyle
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!
భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి పేస్ మాస్క్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. ఎందుకంటే మహమ్మరి నివారణకు ఫేస్ మాస్క్ ధరించడం అత్యవసరం. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఫేస్ మాస్క్ ధరించి ఇంటి నుండి బయటికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం ఫేస్ మాస్క్ ధరించడం ఫ్యాషన్‌గా మారింది. ఏదైనా ఆఫిసులకు లేదా వేడుకలకు కూడా ఫేస్ మాస్క్ తప్పకుండా ధరించాలి. అంతే కాదు కొంతమంది ఫోటో తీసేటప్పుడు కూడా ప్రజలు ఫేస్ మాస్క్ ధరిస్తున్నారు. కానీ కొన్ని నిబంధనల ప్రకారం ఏదైనా అధికారిక రికార్డు పొందడానికి ప్రజలు తమ పూర్తి ముఖాన్ని చూపించాలి.

ఒక వ్యక్తి యొక్క మొత్తం ముఖం కనిపించనట్లైతే అది అధికారికంగా దృవీకరించబడదు. కానీ కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫేస్ మాస్క్ ధరించిన మహిళకు ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసింది. దీనిపై రవాణా శాఖ స్పందిస్తూ, ఇది అధికారులు తప్పిదం అని పేర్కొన్నారు.
MOST READ:ఇలాంటి విచిత్రమైన ఎలక్ట్రిక్ కారును ఎప్పుడైనా చూశారా?

ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయిన తరువాత కాలిఫోర్నియా రవాణా శాఖ ట్రోలింగ్ చేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మహిళ గత నెలలో కాలిఫోర్నియా రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. ఒక అధికారి దరఖాస్తు చేస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు తీశారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న ఆమె ఫోటో తీసేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించింది. ఫేస్ మాస్క్ తొలగించమని ఎవరూ చెప్పలేదు, ఆమె కూడా పేస్ మాస్క్ తీయలేదు. ఈ తప్పు తెలుసుకున్న వెంటనే, ఆమె ఫోటో తీసిన ఆ అధికారి ఆమె ఫేస్ మాస్క్ తొలగించమని చెప్పారు.
MOST READ:త్వరలో రోడెక్కనున్న 400 కొత్త సిఎన్జి బస్సులు.. ఎక్కడో తెలుసా?

చివరకు ఆ మహిళ తన డ్రైవింగ్ లైసెన్స్ పొందినప్పుడు, ఫేస్ మాస్క్‌తో ఉన్న ఫోటోను అటాచ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసినట్లు తెలిసింది. వారు దీనిని తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో షేర్ చేశారు. చట్టబద్దమైన ఇటువంటివి జారీ చేయడంలో కూడా అధికారుల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి తాను $ 35 ఖర్చు చేశానని ఆమె చెప్పారు. ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌పై ఫేస్ మాస్క్ ధరించి ఉన్న ఫోటో చూడవచ్చు. సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు చాలా అజాగ్రత్తగా ఉన్నారని ఆయన అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌లలో అప్పుడప్పుడు చాలా తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు లైసెన్స్ నంబర్ కూడా తప్పుగా జారీ చేసే అవకాశం ఉంది. మరోసారి ఒక వ్యక్తి లైసెన్స్‌లో వేరొకరి ఫోటోలు కూడా ఉండటం గమనించి ఉంటారు. ఇప్పటికి డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది.

భారతదేశంలో వాహన సంబంధిత రికార్డులను డిజిటలైజ్ చేయడానికి డిజిలాకర్ మరియు ఓమ్ ట్రాన్స్పోర్ట్ మొబైల్ యాప్స్ విడుదల చేయబడ్డాయి. ఈ యాప్ లలో లైసెన్సులు డిజిటలైజ్ చేయబడతాయి. కావున ఇప్పుడు ఈవిధమైన తప్పులు దొర్లే అవకాశాలు ఉండవు. సాధారణంగా రవాణా శాఖ అర్హులైన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలి. అప్పుడే దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా తగ్గుతుంది.
MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..
Image Courtesy: Leslie Pilgrim