అమితాబచ్చన్ కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక కారు

By Anil

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్ దాదాపుగా రూ. 4.5 కోట్లు విలువైన జాగ్వారా ల్యాండ్ రోవర్ వారి రేంజ్‌రోవర్ ఆటోబయోగ్రఫి ఎడిషన్ కారును సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం భారత దేశం మొత్తం మీద అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యువి కారు కూడా ఇదే. అమితా బచ్చన్ గారి చేతులు మీదుగా విడుదల చేయబడిన ఈ లగ్జరీ ఎస్‌యువి కారు అమితాబ్ తమ లగ్జరీ కార్ల ప్రపంచంలోకి తీసుకున్నాడు. లాండ్ రోవర్ ప్రతినిధులు ఈ ఆటోబయోగ్రఫీ అనే ఎడిషన్ కారును అమితాబ్ బచ్చన్‌కు డెలివరీ ఇచ్చారు.

ల్యాండ్ రోవర్ బయోగ్రఫీ కారును అమితాబ్ బచ్చన్ గారికి డెలివరీ ఇచ్చినందు ఎంతో సంతోషంగా ఉందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అధినేత రోహిత్ సౌరి పేర్కొన్నారు. పూర్తిగా లగ్జరీ కార్లతో నిండిన అమితాబ్ గ్యారేజ్‌లోకి మరొక లగ్జరీ కారు వచ్చి చేరింది. దీనిని బట్టి అమితాబ్ లగ్జరీ కార్ల ప్రియుడు అని చెప్పకనే తెలుస్తోంది. అమితాబ్ గ్యారేజ్‌లో ఈ బయోగ్రఫీ ఎడిషన్ కారుతో పాటు రోల్స్ రాయిస్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.

అమితాబ్ గారికి కార్లలో నచ్చే ఫీచర్లు మరియు అతని లగ్జరీ కార్ల గ్యారేజ్ ఆస్థానంలో కొలువుదీరిన ఇతర కార్ల గురించి క్రింది గల ఇమేజ్ స్లైడర్‌ ద్వారా తెలుసుకుందాం రండి.

మోడల్ వివరాలు

మోడల్ వివరాలు

దేశ వ్యాప్తంగా లగ్జరీ ఎస్‌‌యువిలను అందిస్తున్న ల్యాండ్ రోవర్ కార్ల తయారీ సంస్థ తమ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్ కారును తయారు చేసింది. దాదాపుగా వంద వరకు సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉన్న దీనిని ప్రముఖ నటుడు బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ డెలివరీ తీసుకున్నాడు. ల్యాండ్ రోవర్ వారు వినియోగదారుల కోరిక ప్రకారం దీనిని వివిధ ఫీచర్లతో కస్టమైజ్ చేసి మరీ అందింస్తారు.

 సౌకర్యాలు

సౌకర్యాలు

ల్యాండ్ రోవర్ కారు మరింత స్పేస్‌ను కలిగి ఉంది, రెండవ వరుసలో గల సీట్లుకు మరింతి ఫూట్ స్పేస్ కల్పించారు. ఎంతంటే సాధారణ రేంజ్ రోవర్‌తో పోల్చితే ఇది 186 ఎమ్ఎమ్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది.

టిల్ట్ స్టీరింగ్ వీల్ కాదు టిల్ట్ సీటు

టిల్ట్ స్టీరింగ్ వీల్ కాదు టిల్ట్ సీటు

ఇందులోని సీటును దాదాపుగా 17 డిగ్రీల కోణం వరకు మలుపుకోవచ్చు, తరువాత సౌకర్యవంతమైన విశ్రాంతి కోసం లెగ్ పెడల్స్‌ను కూడా కల్పించారు.

లెథర్ అలంకరణ

లెథర్ అలంకరణ

దీని లోపల ఎంతో సౌకర్యాన్ని కలిగించే లెథర్ సీట్లను కల్పించారు మరియు లెథర్ ఫర్నిషింగ్ గల ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు.

నియంత్రికలు

నియంత్రికలు

వెనుకవైపున గల రెండు సీట్లకు మధ్య భాగంలో ముంజేతులకు విశ్రాంతి కోసం ఆర్మ్ రెస్ట్ కల్పించారు. ఈ ఆర్మ్ రెస్ట్ మీద మనకు కావాల్సిన అన్నింటిని స్విచ్‌ల ద్వారా నియంత్రించవచ్చు.

టేబుల్స్

టేబుల్స్

ఇందులో కూర్చున్న తరువాత ప్రతి ప్రయాణికునికి ప్రత్యేకమైన చిన్న తరహా టేబుల్‌ను అందించారు.

ప్రత్యేకమైన ఇంటీరియర్ లైటింగ్

ప్రత్యేకమైన ఇంటీరియర్ లైటింగ్

ప్రయాణ సమయంలో ఇంటీరియర్ లోపల గల లైటింగ్ చక్కటి మూడ్‌మను కలిగించే విధంగా ఉండాలి. ఇందుకోసం ఈ కారులోపల క్రోమ్ మెరుపులు వెదజల్లే లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీని వలన కళ్లకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.

సమాచారపు సీట్లు

సమాచారపు సీట్లు

కాళ్లు మరియు తొడలోని కణజాలం యొక్క సౌకర్యవంతాన్ని సీట్లు ప్రత్యేక సాధనం ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి.

ఫీచర్లు

ఫీచర్లు

  • సినాన్ ఆడాప్టివ్ హెడ్ లైట్లు
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • మెరీడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
  • న్యావిగేషన్
  • రిక్రియేషన్ సౌకర్యాలు
  • టీవీ స్క్రీన్
  • గ్లాస్ రూఫ్

    గ్లాస్ రూఫ్

    ఎలక్ట్రిక్ సిస్టమ్ ద్వారా ఇందులోని గ్లాస్ టాప్ రూఫ్‌ను తెరవవచ్చు.

    భద్రతపరమైన ఫీచర్లు

    భద్రతపరమైన ఫీచర్లు

    • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎనిమిది ఎయిర్ బ్యాగులు
    • డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్
    • ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్
    • రియాక్టివ్ గ్రౌండింగ్ రెస్పాన్స్
    • రోల్ స్టెబిలిటి కంట్రోల్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్
    • హిల్ డిసెంట్ కంట్రోల్
    • మైలేజ్

      మైలేజ్

      ఇది లీటర్‌‌కు 7.81 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అయితే ల్యాండ్ రోవర్ ప్రతినిధులు దీని మైలేజ్ గురించి మాట్లాడుతూ, ఇది లీటర్‌కు ఆరు కిలోమీటర్ల మైలేజ్‌తో పాటు 105-లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంకును కలిగి ఉంది.

      ఇంజన్ వివరాలు

      ఇంజన్ వివరాలు

      ఇది 4.4-లీటర్ కెపాసిటి గల వి-8 డీజల్ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ దాదాపుగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గంటకు అత్యధికంగా 218 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. దీని కోసం ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అందించారు.

      ధర వివరాలు.

      ధర వివరాలు.

      ముంబాయ్‌లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.75 కోట్లుగా ఉంది. అయితే దీని ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 4.50 కోట్లు గా ఉండవచ్చు. అమితాబ్ బచ్చన్ దీనిని 4.50 కోట్లకు డెలివరీ తీసుకున్నాడు. కాబట్టి దేశ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యువిలలో ఇది మొదటి స్థానంలో ఉంది.

      అమితాబ్ కార్లు

      అమితాబ్ కార్లు

      అమితాబ్ ప్రస్తుతం కొన్న రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎడిషన్ తరువాత ఎటువంటి లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేయనని తెలిపాడు. ఎందుకంటే ఇతని వద్ద ఇప్పటికే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. తరువాత స్లైడర్లలో ఇతని కార్లను చూడవచ్చు.

      కాంటిన్షియల్ బెంట్లీ జిటి

      కాంటిన్షియల్ బెంట్లీ జిటి

      దాదాపుగా 1.65 కోట్లు విలువైన ఈ కారులోని శక్తివంతమైన వి8 ఇంజన్ దాదాపుగా 552 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు కేవలం 4.4 సెకండ్ల కాలవ్యవధిలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 198 కిలోమీటర్లుగా ఉంది.

       మెర్సిడెస్ బెంజ్ ఎస్600

      మెర్సిడెస్ బెంజ్ ఎస్600

      దీని విలువ రూ. కోటి రుపాయలుగా ఉంది. ఇందులో 5.5-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 517 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

      పోర్షే కేమాన్

      పోర్షే కేమాన్

      పోర్షే కారులో 3.5-లీటర్ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 320 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.8 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

      బిఎమ్‌డబ్ల్యూ 760 ఎలాయ్

      బిఎమ్‌డబ్ల్యూ 760 ఎలాయ్

      ఈ కారులోని అత్యంత శక్తివంతమైన 6.0-లీటర్ కెపాసిటి గల వి-12 ఇంజన్ దాదాపుగా 535 బిహెచ్‌పి పవర్ మరియు అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

      ల్యాండ్ రోవర్ వోగ్

      ల్యాండ్ రోవర్ వోగ్

      అమితాబచ్చన్ ఇంతకుముందే ఒక ల్యాండ్ రోవర్ ఎస్‌యువిని కొనుగోలు చేశాడు. దీనిని ల్యాండ్ రోవర్ వోగ్ అని పిలుస్తారు. ఇందులో 4197 సీసీ కెపాసిటి వి8 ఇంజన్ కలదు.ఇది దాదాపుగా 402 పిఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ధర రూ. 1.05 కోట్లు.

Most Read Articles

English summary
Amitabh Bachchan Takes Delivery His New Range Rover Autobiography
Story first published: Tuesday, February 23, 2016, 13:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X