దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

ప్రపంచమే అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కొంత మంది కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ బద్దకస్తులై ఇతరులపైన ఆధారపడి కాలం గడిపేస్తున్నారు. అయితే మరికొంతమంది శరీరం సహకరించకపోయినా.. పట్టుదలతో ఎన్నో అద్భుతాలను సృష్టించి అందరిచేతా మన్ననలను పొందుతున్నారు. ఇలాంటి సంఘటలను ఇంతకు ముందు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చి ఉంటాయి, అయితే ఇప్పుడు అలంటి సంఘటన ఒకటి మరో సరి వెలుగులోకి వచ్చింది.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనే మాట ఈ రోజుది కాదు, అయినప్పటికీ ఈ రోజుకి ఈ మాటను ఎంతోమంది నిజం చేస్తున్నారు. నివేదికలు ప్రకారం, ఒక దివ్యాంగుడు మాడిఫైడ్ చేసిన ఒక వాహనాన్ని నడుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. దీనిని చూసిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఆ వ్యక్తికి ఏకంగా తన సంస్థలో ఉద్యోగం కల్పిస్తానని ప్రకటించాడు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

సాధారణంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు, ఇందులో భాగంగానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసారు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఒక వికలాంగుడు మాడిఫైడ్ వాహనాన్ని నడుపుతున్నాడు. అయితే కొంతమంది అతనిని కొన్ని ప్రశ్నలు కూడా అడగటం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ చేయబడింది.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

ఈ వీడియోలో ఆ దివ్యాంగుడు తనకు ఇద్దరు చిన్న పిల్లలు మరియు భార్య ఉన్నారని, అంతే కాకుండా వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పాడు. వారిని పోషించడానికి ఏదో ఒక పని చేయాలి, కావున నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అంతే కాకూండా ఆ వాహనాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగినప్పుడు, ఆ దివ్యాంగుడు దానిని స్టార్ట్ చేసి చూపిస్తాడు. అంతే కాకూండా అతనికి కాళ్ళు మరియు చేతులు లేకపోయినా దానిని ఎలా నడపాలో కూడా ఈ వీడియోలో చూపాడు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయ్యి ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి చేస్తున్న సాహసానికి అతడు ఎంతగానో ముగ్దుడవుతాడు. దీనిని ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎంత పాతది అనే విషయాలు తెలియవు, కానీ ఇతని సాహసం ప్రశంసనీయం అన్నారు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

అంతే కాకూండా అతను తన సహచరులైన రామ్ మరియు మహీంద్రా లాజిస్టిక్స్‌ని ట్యాగ్ చేసి, రామ్, మహీంద్రాలాగ్_MLL అతనిని లాస్ట్ మైల్ డెలివరీకి బిజినెస్ అసోసియేట్‌గా చేయగలరా? అంటూ ఆ వ్యక్తిని కనుగొని అతనికి ఉద్యోగం ఇప్పించడం గురించి మాట్లాడాడు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ప్రతిస్పందనగా, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్. ఖచ్చితంగా ఆనంద్! వీలైనంత త్వరగా అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అతడు నిజమైన సూపర్ హీరో అని తెలిపారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే, ఈ వీడియోను ట్విట్టర్‌లో 1.5 లక్షలకు పైగా వీక్షించారు మరియు 2,000 సార్లు రీట్వీట్ చేశారు.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

దివ్యాంగుడు చేసిన ఈ సాహసానికి త్వరలో అతనికి మహీంద్రా కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. కావున ఇలాంటి వారు తమ వల్ల ఏమి కాదు అని నిరాశ చెందకుండా, మరియు పట్టు వదలకుండా శ్రమిస్తే తప్పకుండా విజయ లక్ష్మి వరిస్తుంది.

ఇదిలా ఉండగా ఆనంద్ మహీంద్రా ఇటీవల షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది. దీనిని చూసిన చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. మీరు ఈ వీడియాలో ఒక చిన్న జీప్ చూడవచ్చు. కానీ ఈ జీప్ సాధారణంగా స్టార్ట్ కాదు, దీనిని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.

దివ్యాంగుడి సాహసానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. కంపెనీలో జాబ్ ఆఫర్

మీరు సాధారణంగా బైక్ ని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ హేయడం చూసి ఉంటారు, కానీ కారు కిక్ స్టార్ట్ తో స్టార్ట్ చేయడం బహుశా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. కావున ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో మోటార్ వాహన చట్టం ప్రకారం లేదు, కానీ సాధారణంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Anand mahindra offers job to a man with no limbs in delhi details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X