అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Written By:

అర్జున్ రెడ్డి ఇప్పుడు ఏ ఫిలిం ఇండస్ట్రీలో చూసినా ఇదే పేరును పటిస్తున్నారు. విభిన్న కథనంతో దర్శకుడు హాలీవుడ్ స్థాయిలో కథను నడిపాడు. ఎన్నో వివాదాల మధ్య, అధిక నిడివితో వచ్చిన అర్జున్ రెడ్డి భారీ సక్సెస్ అందుకుంది.

అర్జున్ రెడ్డి మూవీ గురించి మరియు మూవీలో హీరో విజయ్ దేవరకొండ సాయి ఉపయోగించిన బైకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం....

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్‌తో... అర్జున్ తరహా లైఫ్ స్టైల్ మరియు అందులో వినియోగించిన బైకు ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక ట్రెండ్ అయ్యాయి. ఎంతలా అంటే, అర్జున్ రెడ్డి బైకు గురించి ఎంతో మంది భారీగా గూగుల్‌లో శోధించారు.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

కోపం, ప్రేమ, శాంతి, స్త్రీల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ, విద్యా మరియు వృత్తికి న్యాయం చేస్తూనే స్వతంత్ర భావాల వలన జీవితం ఎలా మలుపు తిరిగింది ? దురలవాట్లు మనల్ని ఎక్కడి నుండి ఎక్కడి తీసుకెళతాయనే విషయాన్ని పరోక్షంగా వివరిస్తూ దాదాపు మూడు గంటల నిడివితో డైరక్టర్ అర్జున్ రెడ్డి సినిమాని నిర్మించాడు.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

ఎన్నో వివాదాస్పద సంఘటనల మధ్య థియేటర్లలోకి వచ్చినప్పటికీ అర్జున్ రెడ్డి బాక్సాఫీసు వద్ద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అనతి కాలంలోనే విజయ్ దేవరకొండ సాయికి అభిమానగనం విపరీతంగా పెరిగిపోయింది.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

సినిమా మొత్తంలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఉపయోగించే బైకు మరో ప్రత్యేకతను సంతరించుకుంది. నిజానికి రియల్ లైఫ్‌లో చాలా మందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఇష్టం. సినిమాలో కూడా అర్జున్ రెడ్డికి రాయల్ కంపెనీ ప్రారంభమైన తొలినాళ్లలో ఉత్పత్తి చేసిన ఇంటర్‌సెప్టార్ బైక్ అంటే ప్రాణం.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

1960 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకును అర్జున్ రెడ్డి సినిమాలో వినియోగించారు. హీరో విజయ్ మరియు హీరోయిన్ శాలిని పాండే సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చినపుడు తాను వాడిన బైకు గురించిన వివరాలు వెల్లడించారు.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

ఇంటర్‌సెప్టార్ బ్రిటీష్‌కు చెందిన మోటార్ సైకిల్‌. దీనిని రాయల్ ఎన్ఫీల్డ్ 1960లో ఉత్పత్తి చేసింది. 700 ఇంటర్‌సెప్టార్ పేరుతో 1960లో విడుదలైన ఇందులో సాంకేతికంగా ఇందులో 692సీసీ కెపాసిటి గల వర్టికల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

1970 వరకు ఇంటర్‌సెప్టార్ బైకులను 1,2 మరియు 3 సిరీస్‌లలో విడుదల చేస్తూ వచ్చింది. ప్రొడక్షన్‌ను భారీ సంఖ్యలో పెంచే సమయానికి కంపెనీ కార్యకలాపాలు నిలిపివేసింది.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకును ప్రత్యేకంగా అర్జున్ రెడ్డి సినిమా కోసం ఓ వ్యక్తి నుండి కొనుగోలు చేసి కొన్ని మోడిఫికేషన్స్ నిర్వహించి మూవీలో ఉపయోగించారు. ఆ బైకు విక్రయించిన వ్యక్తి తన బైకును తిరిగి వెనక్కి ఇవ్వమని కోరితే, ఇందుకు డైరక్టర్ నిరాకరించాడని విజయ్ చెప్పుకొచ్చాడు.

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ బైకు

రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైంది? రాయల్ ఎన్ఫీల్డ్ తొలుత ఏం విక్రయించేది ? ఇప్పటి వరకు ఎన్ని రకాల మోడళ్లను ప్రవేశపెట్టింది? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలతో పాటు, రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్....

English summary
Read In Telugu: vijay devarakonda used bike in arjun reddy movie, inresting facts about arjun reddy bike.
Story first published: Thursday, September 14, 2017, 18:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark