బాహుబలి కలెక్షన్స్ 1000 కోట్లు... మరి ఆ బాహుబలి కార్ల విలువ ఎంతో తెలుసా?

Written By:

బాహుబలి - ప్రపంచ సినీ పరిశ్రమలో టాలీవుడ్ కీర్తిన చాటిన చిత్రం... సినిమా నిర్మాణంలో ఓ విశిష్ట శైలిగల దర్శకధీరున్ని పరిచయం చేసిన సినిమా.... భారీ పెట్టుబడులతో ధైర్యంగా ముందుకు వచ్చిన నిర్మాతలకు కాసులు కురిపిస్తున్న చిత్రం... ఒక్కటేమిటి బాహుబలిలోని అణువనువూ చర్చించుకోదగినదే.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ప్రపంచ దేశాలకు ఓ తెలుగు కథానాయకుడిని మరియు ప్రతినాయకుడిని పరిచయం చేసిన చిత్రం బాహుబలి. బాహుబలి ది బిగినింగ్‌తో ప్రారంభమయ్యి... నమ్మిన బంటు అయిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే చిన్న ప్రశ్నతో బాహుబలి బిగినింగ్‌కు కొనసాగింపుగా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకధీరుడు రాజమౌళి.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ఇలాంటి చారిత్రాత్మక చిత్రం తెలుగులో పురుడుపోసుకుని, ప్రపంచ సినీపరిశ్రమ చూపును టాలీవుడ్ వైపు తిప్పుకునేందుకు కారణమైన బాహుబలి చిత్రం పట్ల ప్రతి తెలుగు వ్యక్తి ఓకింత గర్వంగా అనుభూతి చెందవచ్చు.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

చెప్పిన మాట వినే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 28, 2017న భారత దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ఈ చారిత్రత్మక చిత్రం బాహుబలి ది బిగినింగ్‌ మరియు బాహుబలి 2 లేదా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాల్లో కథానాయకుడు మరియు ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దగ్గుబాటి రానా కార్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రోల్స్ రాయిస్ కారును కలిగిన వ్యక్తులు ఇద్దరే. అందులో ఒకరు చిరంజీవి, ఇంకొకరు మన అమరేంద్ర బాహుబలి. హోదా మరియు హుందాతనానికి ప్రతీకైన రోల్స్ రాయిస్ కారును బాహుబలి ది బిగినింగ్ తర్వాత ప్రభాస్ కొనుగోలు చేశాడు.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బాహుబలి ది బిగినింగ్ విజయానంతరం ప్రభాస్ జరుపుకున్న తన బర్త్ డే సంధర్బంగా తన లైఫ్‌లో అతి ముఖ్యమైన వ్యక్తి కృష్ణం రాజు గారి నుండి గిఫ్ట్‌గా పొందినట్లు ఫిలిం నగర్‌లో వార్తలు కూడా వచ్చాయి.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ఏదైమయినప్పటికీ ప్రపంచంలోనే రోల్స్ రాయిస్ కార్లకు భారీ క్రేజ్ ఉంది. 2003 లో రోల్స్ రాయిస్ సంస్థ అంతర్జాతీయ విపణిలోకి ఈ ఫాంటమ్ కారును విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు గరిష్ట ధర రూ. 8.19 కోట్లు పైమాటే.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బాహుబలి చిత్రంలో శక్తివంతమైన పాత్రపోషించిన ప్రభాస్‌లా... ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6.7-లీటర్ల సామర్థ్యం గల శక్తివంతమైన వి12 ఇంజన్ కలదు. దీనికి 8-స్పీడ్ ట్రాన్స్‌‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 720ఎన్ఎమ్ టార్క్ మరియు 453బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. దీని బరువు గరిష్టంగా 2,680 కిలోలుగా ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బరువు చూస్తే భారీగా ఉంది మరి దీని వేగం ఎలా ఉంటుందో అనుకుంటున్నారా.... కేవలం 5.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 240కిలోమీటర్లుగా ఉంది. క్లాసిక్ కార్లలో అత్యంత వేగవంతమైనది ఇదే.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

ఫాంటమ్ కారు మొత్తాన్ని అల్యూమినియం లోహంతో నిర్మించారు. కారులోన అనేక విడిభాగాలను అధికంగా చేతితోనే తయారు చేస్తారు. కారు బాడీ మీద ఐదు సార్లు పెయింటింగ్, చేతితో కుట్టబడిన లెథర్ సీట్లు మరియు చెక్కతో రూపొందించిన ఇంటీరియర్ సొబగులు ఇందులో ప్రత్యేకాకర్షణ.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

సురక్షితమైన మరియు భద్రత పరంగా అత్యుత్తమ ప్రయాణానుకూలం ఉన్న ఇందులో సౌకర్యవంతమైన సీటింగ్ కోసం 5.3మీటర్ల పొడవుతో, 1.98 మీటర్ల వెడల్పుతో 3.3 మీటర్ల పొడవైన వీల్ బేస్‌తో దీనిని నిర్మించారు. ఇందులో 420వాట్స్ సామర్థ్యం ఉన్న 15-స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్ కలదు.

జాగ్వార్ ఎక్స్‌జె

జాగ్వార్ ఎక్స్‌జె

లగ్జరీ కార్లకు పేరుగాంచిన దేశీయ బ్రాండ్ జాగ్వార్‌కు చెందిన ఎక్స్‌జె లగ్జరీ సెడాన్ కారును వినియోగిస్తున్నాడు. టాటా దిగ్గజం భాగస్వామిగా వ్యవహరిస్తున్న జాగ్వార్ ఈ ఎక్స్‌జె లగ్జరీ సెడాన్ కారును పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

జాగ్వార్ ఎక్స్‌జె ధరల శ్రేణి రూ. 93.24 లక్షల నుండి 2.08 కోట్లు మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో అందుబాటులో ఉంది. ఇందులో మూడు లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు 5-లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ వేరియంట్ కూడా కలదు.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

జాగ్వార్ ఎక్స్‌జె లోని 1999సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 237బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఈ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 9.4కిమీలుగా ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

జాగ్వార్ ఎక్స్‌జె లోని 2993- సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 296బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల దీని మైలేజ్ లీటర్‌కు 12.9కిమీలుగా ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

జాగ్వార్ ఎక్స్‌జె లోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ వేరియంట్ 5.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ వేరియంట్. 470బిహెచ్‌పి పవర్ మరియు 642ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

భద్రత పరంగా జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లో ముందు వైపు రెండు, సీట్లకు ముందు మరియు సీట్లకు ప్రక్కవైపుల కర్టన్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ప్రమాదం జరిగినా దాని తీవ్రత ప్రయాణికుల దరిచేరని విధంగా కారు శరీరం మొత్తాన్ని అల్యూమినియం మెటల్‌తో నిర్మించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3

ప్రతి సెలబ్రిటీ కార్ల జాబితాలో ఖచ్చితంగా ఓ బిఎమ్‌డబ్ల్యూ ఉంటుంది. మరి మన డార్లింగ్ ప్రభాస్ వద్ద ఎక్స్3 ఎస్‌యూవీ ఉంది. దీని ధరల శ్రేణి రూ. 48.35 లక్షల నుండి 62.09 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బవేరియన్ మోటార్ వర్క్స్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఈ ఎక్స్‌3 ఎస్‌యూవీని ఒక పెట్రోల్ మరియు మూడు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పెట్రోల్ వేరియంట్లో ఉన్న 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ గరిష్టంగా 245బిహెచ్‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. టు వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీ 2.0- మరియు 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న రెండు రకాల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. రెండు వేరియంట్లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

దగ్గుబాటి రానా నటించింది కొన్ని చిత్రాల్లోనే అయినా బాహుబలి 1 మరియు 2 లలో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాడు. బాహుబలి ప్రాజెక్ట్ భారీ సక్సెస్ కావడంతో అవకాశాలు ఇప్పుడు వెతుక్కుంటూ రానా చెంతకు చేరుతున్నాయి. ఇప్పటికే ఓ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడనే వార్త తెలుగు చిత్రసీమలో సందడి చేస్తోంది.

దిగ్గజ నిర్మాత సురేశ్ బాబు తన కుమారుడు దగ్గుబాటి రానాకు ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీని బహుకరించినట్లు సమాచారం. ఖైరతాబాద్‌లోని ఆర్‌టిఓ కార్యాలయంలో ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినపుడు ఈ వార్త మీడియా కంటపడింది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

టిఎస్09 ఇజి 6369 నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గిఫ్టుగా వచ్చిన కార్లలో తిరగడం తనకు ఇష్టం లేదని, తను ముందు నుండి వినియోగిస్తూ వచ్చిన స్కోడా సూపర్బ్ కారునే ఉపయోగిస్తున్నాడు.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

దగ్గుబాటి రానాకు మునుపటి నుండి స్కోడా సూపర్బ్ ఎంతో ఇష్టం. స్కోడా సూపర్బ్ ప్రీమియమ్ సెడాన్ కారు 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

బాహుబలి ప్రభాస్ మరియు భల్లాలదేవ రానా కార్ కలెక్షన్

స్కోడా సూపర్బ్ కార్ల ధరల శ్రేణి రూ. 25.43 లక్షల నుండి 32.68 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో అందుబాటులో ఉంది.

English summary
Read In Telugu To Know About Bahubali 2 Prabhas And Rana's Car Collection

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more