BMW 7-సిరీస్ కారు కొనుగోలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి

Written By:

బాహుబలి చిత్రాలతో భారీ విజయం అందుకున్న రాజమౌళి చుట్టూ సినీ మీడియా చక్కర్లుకొడుతోంది. ఆయన నుండి రానున్న తరువాత ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో, ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసాడనే వార్తను మోసుకొచ్చింది. బాహుబలి సక్సెస్‌తో ఖచ్చితంగా ఎన్ని కోట్లు సంపాదించాడో స్పష్టంగా తెలియదుగానీ తాజాగా కొనుగోలు చేసిన కారును ధర మాత్రం కోటిన్నర రుపాయల పైమాటే.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

బాక్సాఫీసు వద్ద బీభత్సం సృష్టించిన చిత్రాలలో మొదటి స్థానం బహుబాలిదే నొక్కి చెప్పవచ్చు. రెండు బాహుబలి చిత్రాలతో సుమారుగా రెండు వేల కోట్ల రుపాయల వరకు వసూళ్ల వర్షం కురిసింది.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

ఒకప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమలో హాలీవుడ్ మరియు బాలీవుడ్ వంటి వాటికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు ఇప్పుడు బాహుబలి విజయంతో టాలీవుడ్ ఖ్యాతి ప్రపంచ నలమూలలకూ విస్తరింపజేశాడు దర్శకుడు రాజమౌళి.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

ప్రస్తుతం బాహుబలి చిత్రాన్ని చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది బాహుబలి చిత్ర బృందం. అయితే తన నెక్ట్స్ మూవీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు, అయితే రాజమౌళి తండ్రి చెప్పే తదుపరి స్టోరీ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం బాహుబలి, దీనికి గురించి అటుంచితే రాజమౌళి బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును కొనుగోలు చేసాడు. కొనుగోలు చేసిన కారుతో రాజమౌళి మరియు ఆయన సతీమణి రమా రాజమౌళి కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, రాజమౌళి తన కుటుంబ మరియు వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లగ్జరీ సెడాన్ కారు ధర కోటిన్నర రుపాయల పైమాటే అని తెలసింది.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి సెలబ్రిటీ కార్ గ్యారేజీలో ఉంటుంది. యువ సామ్రాట్ నాగార్జున వద్దే రెండు 7-సిరీస్ కార్లు ఉన్నాయి. దీని డిజైన్, అద్బుతమైన ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లే సెలబ్రిటీలు ఎక్కువగా ఎంచుకోవడానికి దోహదపడుతున్నాయి.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఫ్యూయల్ వేరియంట్లు మరియు మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన ఎక్ట్సీరియర్ పెయింట్ జాబ్‌లో ఎంచుకునే అవకాశం ఉంది. ఇతరుల కారుతో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేందుకు కాబోలు సెలబ్రిటీలు ఎక్కువగా దీనినే ఎంచుకుంటున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లోని సేఫ్టీ ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లోని సేఫ్టీ ఫీచర్లు

ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెసర్ మానిటరింగ్ కంట్రోల్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

యుఎస్‍‌బి, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి గల 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. 6-స్పీకర్స్ ఆడియో సిస్టమ్‌కు అనుసంధానం ఉన్న ఈ డిస్ల్పేలో జిపిఎస్ న్యావిగేషన్ వ్యవస్థ కూడా కలదు. రియర్ ప్యాసింజర్స్ కోసం రెండు వ్యక్తిగత డిస్ల్పేలు ఉన్నాయి.

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్స్‌కు సంభందించిన అన్ని అప్‌డేట్స్‌తో పాటు సెలబ్రిటీల కార్లు మరియు ఆసక్తికరమైన కథనాలను అందిస్తోంది. తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్(Telugu DriveSpark).

దర్శకధీరుడి ఖాతాలో ఖరీదైన కారు
English summary
Read In Telugu Bahubali Director Rajamouli Gifted himself A BMW 7-Series

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark