బెంగుళూరు: నో పార్కింగ్ ఏరియాలో పోలీస్ కార్
బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. చట్టానికి ఎవ్వరు అతీతుల కారని చెప్పేందుకు సజీవ నిదర్శనమే ఈ చిత్రం. నో పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న ప్రభుత్వ వాహనాన్ని బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు ఇనుప లాక్‌తో లాక్ చేశారు. చట్టం ముందు ప్రజలు, ప్రభుత్వం ఇద్దరు సమానమే అంటూ రద్దీగా ఉండా ప్రాంతంలో రోడ్డుపై వదిలి వెళ్లిపోయిన పోలీసు అధికారిక వాహనాన్ని ముందుకు కదలకుండా ఉండేలా లాక్ చేశారు ట్రాఫిక్ పోలీసులు.
ప్రస్తుతం ఈ ఫొటో అన్ని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలోను హల్ చల్ చేస్తుంది. అసలు ఈ సంఘటన నిజంగానే జరిగిందా లేక అక్కడి ట్రాఫిక్ పోలీసులు తమ పబ్లిసిటీ కోసం ఇలాంటి జిమ్మిక్ ఏదైనా చేశారా అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ఈ ఫొటోను ఇటు సాధారణ ప్రజలు, అటు ప్రభుత్వాధికారులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
అధికారులు తమ చేతిలో పదవి ఉందని అధికారాన్ని వృధా చేయకూడదు. అలాగే ఎవరైనా సరే రద్దీగా ఉండే ప్రాంతాలు, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను అడ్డంగా నిలిపివేసి వచ్చే పోయే వాహనాలను అంతరాయం కలిగించకూడదు. మేలుకుందాం.. ఇకనైనా తెలుసుకుందాం..!



Click it and Unblock the Notifications








