ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

బాలీవుడ్ చిత్ర సీమలో మాత్రమే కాకుండా సినీ రంగంలోనే 'సల్మాన్ ఖాన్' అనే పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ పరిశ్రమలో అత్యధిక అభిమానులున్న హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిమానులు మరియు మీడియా సిబ్బందితో తన సాధారణ సంభాషణలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సమాచారం ప్రకారం, నటుడు సల్మాన్ ఖాన్ పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్ చుట్టూ ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు. ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, అందులో సల్మాన్ ఖాన్ బ్లూ టీ-షర్టు మరియు క్యాప్ ధరించి బహిరంగ రోడ్లపై ఆటో-రిక్షా నడుపుతున్నట్లు కనిపిస్తాడు.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

సల్మాన్ ఖాన్ ఇటీవల తన 56 వ పుట్టినరోజు జరుపుకున్నారు. అతను తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో తన సన్నిహిత కుటుంబ సభ్యులు మరియు బాలీవుడ్ సోదర వర్గాల స్నేహితులతో కలిసి తన పుట్టినరోజును ఎంతో వైభవంగా జరుపుకున్నాడు.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

సల్మాన్ ఖాన్ స్వయంగా ఆటో రిక్షా నడపడం చూసిన జనం చాలా ఆశ్చర్యపోయారు, ఆ సమయంలో చాలామంది ఫోటోలు మరియు వీడియోలు తీయడం ప్రారంభించారు. ఈ వీడియోలో నటుడు సల్మాన్ ఖాన్ నెటిజన్లు మరియు అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించాడు.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

సల్మాన్ ఖాన్ బహిరంగ రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా, సల్మాన్ ఖాన్ బాంద్రాలోని తన ఇంటి గెలాక్సీ అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న వీధుల్లో చాలాసార్లు ఇలా చేయడం కనిపించింది. ఒక ఇంటర్వ్యూలో, అతను ముంబైలోని షూటింగ్ స్టూడియోకి అప్పుడప్పుడు ఆటో-రిక్షాను నడుపుతున్నట్లు పేర్కొన్నాడు. అంతే కాకుండా.. సల్మాన్ ఖాన్ ముంబై వీధుల్లో సైకిల్ తొక్కుతూ కూడా చాలా సార్లు కనిపించాడు.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ తన అభిమానులకు సూపర్‌స్టార్ అయినప్పటికీ, ఎప్పుడు చాలా సాధారణంగా ఉంటారు. కాలం ప్రయాణానికి సంబంధించి చాలా వరకు విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగానే అతడు తన రోజువారీ ప్రయాణంలో ప్రీమియం లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

సల్మాన్ ఖాన్ యొక్క గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. దీనితో పాటు, అతని వద్ద ఆడి ఆర్ఎస్7, మెర్సిడెస్ ఏఎంజి జిఎల్ఈ 63 ఎస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, లెక్సస్ ఎల్ఎక్స్ 470, ఆడి ఏ8 మరియు పోర్స్చే కయెన్ వంటి కార్లు ఉన్నాయి.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

కొన్ని సంవత్సరాల క్రితం, సల్మాన్ ఖాన్ మారుతి సుజుకి జిప్సీలో కూడా తిరుగుతూ కనిపించాడు. ఈ మారుతి జిప్సీ భారీగా కస్టమైజ్ చేయబడి ఉంది. ఆఫ్-రోడ్ స్పెక్ బంపర్, ఆఫ్-రోడ్ స్పెక్ బుల్‌బార్, ముందు భాగంలో టో హుక్, ఎలక్ట్రిక్ వించ్, LED ఆక్సిలరీ ల్యాంప్స్, ఆఫ్టర్‌మార్కెట్ హెడ్‌ల్యాంప్‌లు మరియు అనేక ఇతర మార్పులతో సహా తెలుపు రంగు జిప్సీ ఆఫ్-రోడ్ మార్పులతో కనిపించింది. చేసింది

సల్మాన్ ఖాన్ వినియోగించిన ఈ మారుతి సుజుకి జిప్సీ ఎత్తును మునుపటికంటే ఎక్కువ పెంచినట్లుగా కనిపిస్తుంది. అంతే కాకూండా ఇందులో ఆఫ్టర్‌మార్కెట్ మడ్-టెర్రైన్ టైర్‌లు అమర్చబడి ఉన్నాయి. ఇది ఆఫ్-రోడ్ టెర్రైన్‌లో మరింత సామర్థ్యాన్ని కలిగిస్తుంది. సాధారణ చక్రాల కంటే చాలా దృఢంగా ఉండే డీప్ డిష్ ఆఫ్-రోడ్ స్పెక్ రిమ్‌లతో టైర్లు అమర్చబడి ఉంటాయి.

ఆటో రిక్షా డ్రైవ్ చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. వీడియో

సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో చాలామంది ఆధునిక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. సాధారణంగా క్రికెటర్లు, రాజకీయ వేత్తలు మరియు పారిశ్రామిక రంగంలోని వారు కూడా విలాసవంతమై కార్లను కలిగి ఉంటారు. దీన్ని బట్టి చూస్తే సెలబ్రెటీలకు వాహనాలపైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే, ఇతడు ఒక భారతీయ నటుడు, నిర్మాత, టీవీ నటుడు. ఆసియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆయన చాలా ప్రసిద్ధులు. ఆయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. ఆయన నటించిన బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, కిక్, బజరంగీ భాయీజాన్ మరియు సుల్తాన్ వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు.

Most Read Articles

English summary
Bollywood actor salman khan drives auto rickshaw in mumbai details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X