Just In
- 1 hr ago
బుకింగ్ ప్రైస్ పెరిగిన జోరు తగ్గని బుకింగ్స్: అట్లుంటది Maruti Jimny అంటే..
- 16 hrs ago
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- 20 hrs ago
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- 23 hrs ago
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Don't Miss
- News
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం: తుపాకీతో బెదరించి రూ. 2 లక్షలు దోపిడీ
- Finance
Bank Locker: బ్యాంకులో లాకర్ ఉందా..? ఈ వార్త తెలుసుకోండి.. లేకుంటే లాకర్ ఫ్రీజ్ అవుద్ది..!
- Sports
Team India : హిస్టరీ రిపీట్ అవుతుంది.. టీమిండియా మళ్లీ ఆ ఫీట్ సాధిస్తుందా?
- Movies
Sreemukhi: దిల్ రాజును ఇమిటేట్ చేసిన యాంకర్ శ్రీముఖి.. వేనుమా, ఇరుక్కు అంటూ ఘోరంగా!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు, గతంలో కూడా ఇలాంటి కథనాలను కోకొల్లలుగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మాజీ విశ్వసుందరి మరియు బాలీవుడ్ బ్యూటీ 'సుస్మితా సేన్' ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

'సుస్మితా సేన్' బాలీవుడ్ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్‌గా పేరు పొందినప్పటికీ, తెలుగులో అక్కినేని నాగార్జున సరసన రక్షకుడు, మరియు యాక్షన్ కింగ్ అర్జున్ ఒకే ఒక్కడు సినిమాలో కూడా నటించింది. కావున సుస్మితా సేన్ తెలుగు ప్రజలకు కూడా కొంత సుపరిచయమనే చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

ఇక సుస్మితా సేన్ కొనుగోలు చేసిన లగ్జరీ కారు విషయానికి వస్తే, ఇది మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్‌ఈ 53 ఏఎంజీ కూపే. ఇది బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. నిజానికి సుస్మితా సేన్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు తానుగానే ఈ లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుస్మితా సేన్ కొన్న ఈ లగ్జరు కారు ధర రూ .1.63 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఆన్ రోడ్ ధర సుమారు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ లగ్జరీ కారు 3.0-లీటర్ ఇన్ లైన్-సిక్స్ సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 429 బిహెచ్‌పి పవర్ మరియు 1,800 ఆర్‌పిఎమ్ వద్ద 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ AMG GLE 53 4మ్యాటిక్ ప్లస్ కూపే స్పీడ్‌షిఫ్ట్ TCT 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. ఈ మెర్సిడెస్ AMG GLE 53 Coupe కేవలం 5.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ AMG GLE 53 4మ్యాటిక్ ప్లస్ కూపే డిజైన్ విషయానికి వస్తే, ఇందులో వర్టికల్ క్రోమ్ స్లాట్స్ తో కూడిన పనామెరికానా గ్రిల్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను చూడవచ్చు. ఫ్రంట్ ఆప్రాన్ స్పోర్టీ ఇన్‌లెట్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు.
రియర్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. వెనుక భాగంలో సిల్వర్ క్రోమ్‌లో అద్భుతమైన డిఫ్యూజర్ మరియు ట్రిమ్ స్ట్రిప్‌ని పొందుతారు. ఇవి ఈ లగ్జరీ కారుకి మరింత ఆకర్షణను తీసుకువస్తాయి. అంతే కాకుండా వెనుక వైపు టెయిల్ లైట్స్ మరియు బ్రాండ్ లోగో మరియు బ్యాడ్జెస్ వంటివి చూడవచ్చు. మొత్తానికి ఈ లగ్జరీ కారు లగ్జరీ డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ AMG GLE 53 4మ్యాటిక్ ప్లస్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్‌లో రెడ్ కాంట్రాస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లు కార్బన్ ఫైబర్‌ను కలిగి ఉంటాయి. కొత్త తరం అల్యూమినియం షిఫ్ట్ ప్యాడిల్స్‌తో 3 స్పోక్ AMG స్టీరింగ్ వీల్‌ని కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో పెద్ద సింగిల్ యూనిట్ డిస్ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్‌గా పనిచేస్తుంది.

GLE 53 కూపే AMG రైడ్ కంట్రోల్ ప్లస్ ఎయిర్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇందులో కంఫర్ట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ AMG GLE 53 కూపే భారతీయ మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్6 M మరియు పోర్స్చే కయెన్ కూపే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.