అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడనుకుంటున్నారా?

భారతదేశంలో గత కొంతకాలంలో ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంధన ధరలు దాదాపు 100 దాటేశాయి. భారీగా పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపాయి. సామాన్య ప్రజలు ద్వా చక్ర వాహనాలను కలిగి ఉన్నప్పటికీ వాటిని వినియోగించడానికి వెనుకాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు.

ఇంధన ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్తను తీసుకు వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

జార్ఖండ్ ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ.. లీటరు పెట్రోల్ పైన ఏకంగా రూ. 25 తగ్గుతుందని తెలియజేసింది. ఇది నిజంగా దెస చరిత్రలోనే ఈ ప్రభుత్వం కూడా ప్రకటించని వార్త అనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రకటనపైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

జార్ఖండ్ రాష్ట్రలో తమ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ సంచలన ప్రకటన చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన ప్రకారం పెట్రోల్ పై 25 రూపాయల తగ్గింపు 2022 జనవరి 26 న అంటే భారత గణతంత్య్ర దినోత్సవం నుంచి అమలులో ఉంటుంది.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

జార్ఖండ్ రాష్ట్రలో రేషన్ కార్డు కలిగి ఉన్న సామాన్య మరియు మధ్య తరగతి ప్రజలకు ఒక లీటరుపై రూ. 25 తమ బ్యాంక్ అకౌంట్ కి బదిలీ చేయబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి పేద కుటుంభం నెలకు 10 లీటర్ల పెట్రోల్ పైన ఈ 25 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం జార్ఖండ్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 98.52 గా ఉంది.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

అంతే కాకూండా రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్ రేట్లను తగ్గించాలని జార్ఖండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిరంతరం డిమాండ్ చేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని, దీని కారణంగా జార్ఖండ్ ప్రజలు ఈ రాష్ట్రాల నుండి డీజిల్ పొందుతున్నారని అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు భారీగా నష్టపోతున్నారని అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

హేమంత్ సోరెన్ డీజిల్‌పై వ్యాట్ రేట్లను తగ్గించలేదు, కానీ పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించడం ద్వారా బీపీఎల్ రేషన్ కార్డ్ హోల్డర్‌లకు పెద్ద ఉపశమనం కలిగించారు. ఎక్సైజ్ టాక్స్ మరియు వ్యాట్‌లను నిరంతరం పెంచడం వల్ల, ఈ సంవత్సరం పెట్రోల్ ధర లీటరుకు రూ.100కి చేరుకుంది. మరోవైపు పలు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.80 నుంచి రూ. 90కి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ టాక్స్ రూ. 5, రూ. 10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన తర్వాత దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గిస్తూ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ఆసక్తి చూపడం లేదు.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వంతో పాటు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ మరియు డీజిల్ యొక్క ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నాయని. ఇందులో భాగంగానే ఇథనాల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా ఇప్పటికే తెలుసుకున్నాం. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక విధానాన్ని ప్రకటించబోతోంది. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

పెట్రోల్‌లో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల క్రితం, 2025 మరియు 2026 నాటికి భారతదేశం అంతటా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించింది.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

2025 నుండి భారతదేశంలో విక్రయించబడే అన్ని కొత్త వాహనాలు E20 ఇంధనానికి అనుగుణంగా ఉండాలి. E20 పెట్రోల్ 2023 నుండి భారతదేశం అంతటా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతదేశంలో E10 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే రానున్న కాలంలో ఇథనాల్ శాతం పెరిగి ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.

అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్.. లీటరు పెట్రోల్‌పై రూ. 25 తగ్గింపు.. ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగుతున్న కారణంగా చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకూండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ఎక్కువ మొత్తంలో సబ్సిడీలను కూడా అందిస్తున్నాయి.

Most Read Articles

English summary
Bpl ration card holders to get subsidy on petrol said jharkhand cm details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X