బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

రాత్రివేళల్లో రిమ్స్‌లో ఎల్ఈడి లైట్స్ వెలుగుతుంటే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ సినిమాల్లో కనిపించే ఫ్యూచరిస్టిక్ కార్స్ అండ్ బైక్స్ మాదిరిగా ఉంటుంది కదూ! అలాంటి ఓ కాన్సెప్ట్‌నే మనకు పరిచయం చేసింది ప్రముఖ బ్రేక్ కాలిపర్ల తయారీ సంస్థ బ్రెంబో. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

బ్రేక్ సిస్టమ్‌ల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బ్రెంబో, ఎల్ఈడి లైట్లతో కూడిన కొత్త రకం బ్రేక్ కాలిపర్లను ఆవిష్కరించింది. ఈ కొత్త బ్రెంబో కాలిపర్ కాన్సెప్ట్‌ను 'న్యూ జి సెస్సాంటా' అని పిలుస్తారు. ఈ ఎల్ఈడి బ్రేక్ కాలిపర్ సెంటర్‌లో ఓ గుండ్రటి ఎల్ఈడి లైట్ మరియు దాని పైభాగంలో ఆరు ఫ్లోటింగ్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి.

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

రాత్రివేళ్లలో ఈ బ్రేక్ కాలిపర్స్ ప్రకాశిస్తూ, వాహనాలకు ప్రత్యేకమైన రూపాన్నిస్తాయి. బ్రెంబో తమ సంస్థ యొక్క 60వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త రకం బ్రేక్ కాలిపర్లను ఆవిష్కరించింది.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

ఇటీవలి కాలంలో, ఆటోమోటివ్ లైటింగ్ విధానంలో అనేక కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇది కేవలం హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లాంప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, కార్లు మరియు మోటార్‌సైకిళ్లలో బ్యాక్‌లిట్ స్విచ్‌లు మరియు యాంబియెంట్ ఎల్‌ఈడి లైటింగ్ వంటి టెక్నాలజీలు కూడా ఉన్నాయి.

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడి) టెక్నాలజీతో ఇది సాధ్యమైంది. ఒకప్పుడు వాహనాల్లో సాధ్యం కాదు అనుకున్న ప్రదేశాల్లో కూడా లైటింగ్‌ను ఉపయోగించుకునేలా ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులెన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

సాధారణంగా, వెహికల్ మోడిఫైయింగ్ కల్చర్‌లో ఇలాంటి ఎల్ఈడి లైట్లను మనం ఎక్కువగా చూస్తుంటాం. చాలా మంది తమ మోటార్‌సైకిళ్లు మరియు కార్లకు దిగువ భాగంలో (ఫ్రేమ్ క్రింద) ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్‌ను ఉపయోగించడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాయి. ఇవి రాత్రి సమయాల్లో సదరు వాహనం చాలా విభిన్నంగా కనిపించేలా చేస్తాయి.

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

అయితే, ఇలాంటి ఎల్ఈడి లైట్ ఫీచర్లను ఇప్పటి వరకూ ఏ వాహన తయారీదారుడు కూడా తమ అధికారిక పరికంగా ఎలాంటి వాహనాల్లోనూ అందించలేదు. అయితే, ఇప్పుడు బ్రెంబో అటువంటి లైటింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన మొదటి ఓఈఎమ్‌గా చరిత్ర సృష్టించనుంది.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

బ్రెంబో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రేక్‌ల తయారీ సంస్థ. ఇది బ్రేక్ రోటర్లు, బ్రేక్ కాలిపర్స్, బ్రేక్ లైన్లు మరియు ఇతర అనుబంధ విడిభాగాలను తయారు చేస్తుంది. బ్రెంబో బ్రేక్‌లను మెయిన్ స్ట్రీమ్ కార్లు మరియు మోటార్‌సైకిళ్లతో పాటు రేసింగ్ కార్లు మరియు రేసింగ్ మోటార్‌సైకిళ్లతో సహా పలు రకాల వాహనాలపై ఉపయోగిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కొన్ని రకాల కార్లలో కూడా ఈ బ్రెంబో బ్రాండ్ బ్రేక్స్ కనిపిస్తాయి.

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

బ్రెంబో న్యూ జి సెస్సాంటా కాన్సెప్ట్

బ్రెంబో ఆవిష్కరించిన ఈ కొత్త ఎల్ఈడి బ్రేక్ కాలిపర్‌లో ఉపయోగించిన ఎల్ఈడి లైట్లు ఆర్‌జిబి (రెడ్, గ్రీన్, బ్లూ) కాంబినేషన్‌ను కలిగి ఉంటాయి. అంటే, ఇవి కేవలం ఒకే రంగులో కాకుండా అనేక రంగులలో ప్రకాశిస్తుంటాయి. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా ఓ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డిజైన్ చేసింది. ఈ యాప్ సాయంతో యూజర్లు తమ వాహనం యొక్క బ్రేక్ కాలిపర్ లైట్లను తమకు నచ్చిన రంగులో ప్రకాశించేలా చేసుకోవచ్చు.

MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ

బ్రేక్ వేస్తే, రిమ్‌లో లైట్లు వెలుగుతాయ్.. అదెలా అనుకుంటున్నారా..? అయితే చూడండి!

అయితే, ఈ బ్రేక్ కాలిపర్లకు పవర్ సప్లయ్ ఎలా అందుతుందనే విషయాన్ని ప్రస్తుతానికి కంపెనీ వెల్లడించలేదు. కానీ, బ్రేక్ కాలిపర్‌కు వైర్‌ను నడపడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ కాన్సెప్ట్ చాలా కూల్‌గా అనిపిస్తుంది. ఇది కాన్సెప్ట్ దశ నుంచి రియల్ టైమ్ ఉపయోగంలోకి వచ్చినట్లయితే, మీ కారు లేదా మోటార్‌బైక్‌ను ఇది ఖచ్చితంగా చాలా ఫంకీగా మార్చుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Most Read Articles

English summary
Brake Calipers That Glow In The Dark: Brembo's New G Sessanta LED Brake Caliper Concept, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X