బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

పిన్న వయస్సులోనే కాలం చేసిన బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ను వివాహం చేసుకొని, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గా బ్రిటన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహారాణి డయానా. ఈ ఆగస్ట్ 31తో ప్రిన్సెస్ డయానా మరణించి 25 ఏళ్లు పూర్తి కానున్నాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఈ నేపథ్యంలో, ఆమె ఉపయోగించిన ఓ అరుదైన ఫోర్డ్ కారు ఇప్పుడు వేలానికి వచ్చింది. వేలంలో ఈ కారు పలికిన వెల తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ప్రిన్సెస్ డయానా 1980 కాలంలో నడిపిన ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో (Ford Escort RS Turbo) కారుకి లండన్ లో ఆక్షన్ (వేలం) నిర్వహించారు. ఈ వేలంలో డయానా ఉపయోగించిన ఫోర్డ్ కారు 6,50,000 వేల పౌండ్ల వెల పలికినట్లు సమాచారం. మనదేశ కరెన్సీలో దీని విలువ రూ. 5.20 కోట్లకు పైమాటే. యువరాణి డయానా ఉపయోగించిన ఈ అరుదైన ఫోర్డ్ కారును ఓ ఇంగ్లిష్ వ్యాపారవేత్త ఇంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా సదరు కొనుగోలుదారు పేరు మరియు ఇతర వివరాలు వేలం సంస్థ బయటకు వెల్లడించలేదు.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో కారును సిల్వర్‌స్టోన్ ఆక్షన్ హౌస్ అమ్మకానికి తీసుకొచ్చింది. ఇది క్లాసిక్ కార్లను వేలం వేయడానికి ఉద్దేశించబడిన ఓ ప్రత్యేక వేలం సంస్థ. ప్రిన్సెస్ డయానా 1985 నుండి 1988 వరకు ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. ఆమె చెల్సియాలోని బోటిక్ దుకాణాలు మరియు కెన్సింగ్టన్‌లోని రెస్టారెంట్‌ల వెలుపల ఈ కారుతో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రయాణీకుల సీటులో తన భద్రతా బృందంలోని సభ్యునితో ఆమె తన స్వంత కారును నడపడానికి ఇష్టపడినట్లు చెబుతుంటారు.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

సాధారణంగా, ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో సిరీస్ 1 కారును తెలుపు రంగులో తయారు చేయబడింది. కానీ, పోర్డ్ కంపెనీ ఈ కారును బ్రిటన్ యువరాణి కోసం ప్రత్యేకంగా ఆల్ బ్లాక్ కలర్ లో డిజైన్ చేసి ఇచ్చింది. యువరాణి భద్రత కోసం మరియు రక్షణ అధికారి కోసం ఫోర్డ్ ఈ కారులో రెండవ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లను కూడా జోడించింది. యువరాణి ఈ కారును చాలా అరుదుగా ఉపయోగించింది. ఈ కారు ఇప్పటికీ కేవలం 25,000 మైళ్ల కంటే తక్కువ దూరం మాత్రమే ప్రయాణించి ఉంది.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ఈ ప్రత్యేకమైన కారుకి వేలం నిర్వహించే సమయంలో ఈ కారును కొనుగోలు చేసేందుకు చాలా "తీవ్రమైన పోటీ" నెలకొందని సిల్వర్‌స్టోన్ ఆక్షన్ హౌస్ పేర్కొంది. ఈ క్లాసిక్ కార్ వేలం హౌస్ ప్రకారం, దీనిని సొంతం చేసుకున్న వ్యాపారవేత్త కారు విక్రయ ధరపై 12.5 సాతం ​​కొనుగోలుదారు ప్రీమియం చెల్లించినట్లు ఆక్షన్ హౌస్ తెలిపింది. ప్రిన్సెస్ డయానాకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్లలో ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో ఒకటి అని చెబుతుంటారు. కంపెనీ ఈ కారును అదనపు భద్రతా ఫీచర్లతో ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసింది.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ప్రిన్సెస్ డయానా ఉపయోగించిన ఈ ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో ఇప్పటికీ సరికొత్తగా కనిపిస్తుంది. యువరాణి డయానాకు కార్లన్నా మరియు వాటిని స్వయంగా డ్రైవ్ చేయడం అన్నా చాలా ఇష్టం అని చెబుతుంటారు. డయానా కూడా కారు ప్రమాదంలోనే మరణించారు. ఆగస్ట్ 31, 1997న ఆమె పారిస్‌లో ఘోరమైన కారు ప్రమాదంలో మరణించారు. అయితే, ఆ సమయంలో కారుని డయానా కాకుండా ఆమె భద్రతా సిబ్బందిలో ఒకరు నడుపుతున్నట్లు సమాచారం.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

యువరాణి ఉపయోగించిన ఈ క్లాసిక్ ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో కారుతో ఆమె దిగిన ఫోటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని చాలా ఫోటోలలో ఆమె డ్రైవర్ సీటులో ఉండగా, భద్రతా సిబ్బంది వెనుక సీట్లలో కూర్చున్నట్లు చూపబడింది. ఈ కారు ఓడోమీటర్ పై 25,000 మైళ్ల రీడింగ్ మాత్రమే నమోదైంది. అంటే, ఆమె మరణించ తర్వాత ఈ కారును మరెవ్వరూ ఉపయోగించలేదని, అప్పటి నుండి ఇది వివిధ రకాల మ్యూజియం లలో లేదా కార్ కలెక్టర్ల వద్ద మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ఫోర్డ్ ఎస్కార్ట్ ఆర్ఎస్ టర్బో అత్యంత విలాసవంతైన సూపర్ లగ్జరీ కారు మాత్రం కాదని గమనించాలి. అయినప్పటికీ, దీని శక్తివంతమైన ఇంజన్ మరియు విశిష్టమైన డిజైన్ కారణంగా ఆ రోజుల్లో ఇంగ్లండ్‌లో ఈ కారు బాగానే అమ్ముడయ్యేది. గత సంవత్సరం కూడా ప్రిన్సెస్ ఉపయోగించిన ఇలాంటి ఓ అరుదైన కారును వేలం వేశారు. ఆ సమయంలో నిర్వహించిన ఓ వేలం పాటలో ప్రిన్సెస్ డయానా ఉపయోగించిన మరొక ఫోర్డ్ ఎస్కార్ట్ కారు 52,000 పౌండ్లకు ($61,100) ధరకు అమ్ముడైంది.

బ్రిటన్ యువరాణి డయానా (Princess Diana) ఉపయోగించిన కారు వేలం.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

యువరాణి డయానా మరణంపై ఇప్పటికీ ఓ వీడని మిస్టరీనే. ఆమె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ కాదని, ఆమెది హత్యేనని చాలా మంది వాదిస్తారు. ఆగస్ట్ 31, 1997న మరణించినప్పుడు యువరాణితో పాటుగా కారులో మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆమె మరణించే నాటికి యువరాణి డయానా వయస్సు 36 సంవత్సరాలు. ఆమె మరణించినప్పుడు ప్రిన్స్ చార్లెస్ వయస్సు 48. ఆ సమయంలో, డయానాకు ఇద్దరు కుమారులు (ప్రిన్స్ విలియం - 15 ఏళ్లు మరియు ప్రిన్స్ హ్యారీ - 12 ఏళ్లు) ఉన్నారు.

Image Courtesy: Silverstone Auctions

Most Read Articles

English summary
Britain princess diana s ford car auctioned for record breaking price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X