కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

Posted By: Staff

కారు స్టార్ట్ అవటానికి బ్యాటరీ ఎంతో ముఖ్యమైన విడిభాగం. సాధారణ ఎలక్ట్రిక్ వైర్ల మాదిరిగానే బ్యాటరీ వైర్లు కూడా షాక్ కొడతాయి. అయితే, కారు బ్యాటరీల నుంచి వచ్చే విద్యుచ్ఛక్తి చాలా గృహోపకరాణాలకు వినియోగించే విద్యుచ్ఛక్తి కన్నా చాలా తక్కువ.

మీరు బ్యాటరీ ఎప్పుడైనా షాక్ కొట్టిందా..? ఒకవేళ కారు బ్యాటరీ షాక్ కొడితే చచ్చిపోతామా..? ఇలాంటి సందేహాలకు ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం రండి..!

ఇది కూడా చదవండి: కార్ పార్ట్స్ విషయంలో మీరు ఎక్స్‌పైరీ డేట్ చూస్తున్నారా?

కారును జంప్ స్టార్ట్ చేసేటప్పుడు రెండ్ అండ్ బ్లాక్ జంపర్ కేబుల్స్‌కు చివర్లను రెండు చేతుల్తో (ఒక చేతిలో నలుపు వైరు, మరో చేతిలో ఎరుపు వైరు) పట్టుకుంటే, కొద్దిపాటి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు అనిపిస్తుంది.

మరి ఈ 12 వోల్టుల కార్ బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..!

అపోహ

అపోహ

కారు బ్యాటరీ షాక్ కొడితే చచ్చిపోతారు, అందుకే కార్ బ్యాటరీ ప్లస్, మైనస్ (పాజిటివ్, నెగిటివ్) వైర్లను (టెర్మినళ్లను) తాకకూడదు.

వాస్తవం

వాస్తవం

కారు బ్యాటరీ 12 వోల్టుల విద్యుచ్ఛక్తిని మాత్రమే కలిగి ఉంటాయి. మన శరీరం ఈ 12 వోల్టుల శక్తిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంత తక్కువ వోల్టేజ్ మన శరీరానికి ప్రసరించదు, ఒకవేళ ప్రసరించినా మనకేమీ అనిపించదు.

ఉదాహరణకు మీరు AA బ్యాటరీని (గోడ గడియారాల్లో ఉపయోగించే సెల్) రెండు చివర్ల (+ -)ను తాకితే మీకేమీ అనిపించదు. ఈ బ్యాటరీ 1.5 వోల్టుల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే సాధారణ 9-వోల్ట్ బ్యాటరీని తాకినా ఏ ఫీల్ కలగదు (కానీ నాలుకతో తాకితే జిల్‌మని షాక్ లైట్‌గా కొట్టినట్లు అనిపిస్తుంది. ఈ 12 వోల్ట్ కార్ బ్యాటరీ కూడా ఇదే కోవలోకి వస్తుంది కాబట్టి, దీని నుంచి విడుదలయ్యే విద్యుచ్ఛక్తి మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించదు.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

కానీ, కారు బ్యాటరీలో అంత కరెంట్ ఉండదని దానితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఉదాహరణకు, మీరు మెటల్ బ్రాస్లెట్, నెక్లెస్ లేదా రింగ్ ధరించి ఉన్నప్పుడు, బ్యాటరీ యొక్క పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ రెండూ ఆ వస్తువులకు తగిలితే తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

బ్యాటరీ కారులో ఉన్నప్పుడు పాజిటివ్ టెర్మినల్‌ను మాత్రమే టచ్ చేసి కారు బాడీకి దూరంగా ఉంటే ఏమీ అనిపించదు. కానీ అదే పాజిటివ్ టెర్మినల్‌ను తాకి కారులోని ఏ ఇనుప బాడీ పార్ట్‌నైనా తాకితే చిన్న పాటి ఎలక్ట్రిక్ షాక్ ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ (నలుపు వైరు)ను కారు బాడీ మొత్తానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి.

కారు బ్యాటరీ షాక్ గురించి మీకున్న సందేహం స్పష్టమైంది కాబట్టి, ఇప్పుడు కారు బ్యాటరీల వలన మీకు ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చునో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకుందాం రండి.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

కారు బ్యాటరీలు యాసిడ్‌తో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి, ఇందులోని యాసిడ్ చర్మంపై పడితే కాలిన గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

కారు బ్యాటరీకి సమీపంలో మంటలు లేదా స్పార్క్ వస్తే, బ్యాటరీలోని హైడ్రోజన్ వాయువు వలన అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

కారు బ్యాటరీ పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్‌ను స్పార్క్ చేస్తూ, దానిని ఏదైనా మెటల్ బాడీ పార్ట్‌కు తగిలిస్తే సదరు పార్ట్ వేడెక్కి మీ శరీరానికి కాలిన గాయం చేయవచ్చు.

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

ఒకవేళ కారు బ్యాటరీ కేబుల్ వలన షార్ట్ సర్క్యూట్ అయితే, ఆ కేబుల్ వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

కారు బ్యాటరీ

ఆటోమోటివ్ బ్యాటరీని ఎస్ఎల్ఐ (SLI battery - స్టార్టింగ్, లైటింగ్, ఇగ్నిషన్) అని పిలుస్తారు. స్టార్టర్ మోటార్‌కు పవర్ అందించేందుకు, లైట్లను వెలిగించేందుకు మరియు ఇంజన్‌ను ఆన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎస్ఎల్ఐ బ్యాటరీలు లీడ్-యాసిడ్ టైప్ బ్యాటరీలు. 12 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇందులో 6 గాల్వానిక్ సెల్స్‌ను ఉపయోగిస్తారు. ప్రతి సెల్ కూడా 2.1 వోల్టుల శక్తిని (పూర్తి చార్జ్‌పై మొత్తం 12.6 వోల్టుల శక్తి) ఉత్పత్తి చేస్తుంది.

English summary
Have you ever received a shock from a car battery? Will your 12 volt car battery give you a shock, and if it does will you die? Click through the slides to learn about various ways you can be injured from a car battery.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark