వీడియో: లాంబోర్గినీ హారికేన్ డ్రిఫ్ట్ చేయగలదా?

By Ravi

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ లేటెస్ట్ ప్రోడక్ట్ హారికేన్. పాపులర్ గల్లార్డో మోడల్‌కి సక్సెసర్‌గా వచ్చిన ఈ మోడల్ ఇప్పటి గ్లోబల్ మార్కెట్లలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ మోడల్ ఇంకా ఇండియా మార్కెట్లో విడుదల కాలేదు. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిని భారత్‌లో విడుదల చేయాలని లాంబోర్గినీ సన్నాహాలు చేస్తోంది.

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. ఇది 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

లాంబోర్గినీ హారికేన్ పవర్‌ఫుల్ కారు కావటంతో డ్రైవర్లను ఎడ్యుకేట్ చేసేందుకు గాను కంపెనీ ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. చాలా మంది డ్రైవర్లలో ఈ సూపర్‌కార్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ కావటంతో ఇది ట్రాక్‌పై డ్రిఫ్ట్ చేయగలదా అన్న సందేహం తలెత్తుతోంది. అలాంటి వారి కోసం లాంబోర్గినీ ఓ స్పెషల్ ట్రాక్‌పై వాటర్‌ను స్ప్రింక్లర్ల ద్వారా చల్లుతూ, ఈ కారుతో డ్రిఫ్టింగ్ చేసి చూపడంతో సదరు డ్రైవర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మరి ఆ హారికేన్ డ్రిఫ్టింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/O8B86TMP83c?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Most of the buyers of Lamborghini's Huracan are not great drivers and need training. Lamborghini has began a program that provides tuitions for its customers. However, the supercar is an wheel drive machine and the question we have is will the Huracan Drift, we found a video of a guy trying his luck.&#13;
Story first published: Friday, July 11, 2014, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X