మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

Written By:

స్పీడ్ త్రిల్స్, బట్ కిల్స్.. అనే స్లోగన్‌ను రోడ్డు ప్రక్కల హెచ్చరికల బోర్డు మీద తరుచు చూస్తుంటాం. నిజమే, ఎంత స్పీడుగా డ్రైవ్ చేస్తే అంత మజాగా ఉంటుంది. కానీ, అంతే ప్రమాదకరం కూడా. పబ్లిక్ రోడ్ల మీద అతి వేగం అత్యంత ప్రమాదకరం మరియు తీవ్ర పరిణామాలకు కారణమవుతుంది.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

ఓవర్ స్పీడ్ అనేది ఎంత ప్రమాదకరమో... తాజాగా కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం కళ్లకు కట్టినట్లు చెబుతోంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

ప్రమాదం దృశ్యాలను ధైర్యంగా చూడగలిగే వారు మాత్రమే క్రిందకు వెళ్లండి...

Recommended Video - Watch Now!
Why Doesn't A Plane's Tyre Burst While Landing - DriveSpark
మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

అత్యంత వేగంతో ప్రయాణించిన కారు అదుపు తప్పడంతో ఘోర ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవి కెమెరాలో రికార్డయ్యాయి.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

కేరళలోని కరునగప్పల్లి ప్రాంతంలో ఉన్న పుల్లిమన్ జంక్షన్‌లోని టైర్ షాపు ముందర అమర్చిన సీసీ టీవీ ప్రమాద దృశ్యాన్ని బంధించింది. ఈ ప్రమాదానికి చెందిన వీడియోను శరత్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

వీడియో ప్రకారం, మారుతి ఆల్టో కారు ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. డివైడర్ లేని రహదారి మీద కారు మరియు మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకు మీద ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బైకు మీద ఉన్న ఇద్దరు ప్రాణాలతో బటపడ్డారు. అయితే, ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

అత్యధిక వేగంతో దూసుకొచ్చిన కారు బైకుతో ఢీకొన్న తరువాత అదే రహదారి మీద పల్టీలు కొట్టుకుంటూ కొద్ది దూరంలో నిలిచిపోయింది. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే కారు వేగాన్ని అదుపుచేయలేక ఈ ఘోరం సంభవించింది.

Trending On DriveSpark Telugu:

8 నెలల గర్భవతిని కారుతో తొక్కించాడు

అందరూ స్పాట్‌లోనే ఛిద్రమయ్యారు

రోడ్డు క్రాస్ చేసేటపుడు ఇలాంటి పొరపాటు చేయకండి

వీడియోను పరిశీలిస్తే, కారు డ్రైవర్ అధిక వేగంలో డివైడర్ లేని డబుల్ రోడ్డు మీద ప్రక్కనున్న లైన్‌లోకి వెళ్లాడు, మళ్లీ తన లైన్‌లోకి వచ్చేందుకు స్టీరింగ్ తిప్పడంతో ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి బైకును ఢీకొని, అతే వేగంలో అదుపుతప్పి తలక్రిందులుగా దూసుకెళ్లింది.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

డివైడర్ లేకుండా ఉన్న డబుల్ రోడ్లు చాలా ప్రమాదకరమైనవి, అంతే కాకుండా ఇలాంటి రోడ్లలో హై స్పీడులో ముందువైపున్న వాహనాలను అధిగమించడానికి ప్రయత్నించడంతో మరింత రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా ఏవైనా వాహనాలొస్తే అదుపులేకపోయినపుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.

ఇలాంటి ప్రమాదాలను అధిగమించాలంటే మితిమీరిన వేగంతో ప్రయాణించడాన్ని మానుకోవాలి. మరొకటి, అత్యంత రద్దీతో కూడిన రోడ్డు మీద వేగాన్ని అదుపు చేయడంలో ఏమాత్రం అలస్యమైనా భారీ మూల్యం తప్పదు. అందుకు నిదర్శన ఈ కథనం. కారు డ్రైవర్ ఎదురుగా వచ్చిన వాహనాలను తప్పించబోయి కారు వేగాన్ని కంట్రోల్‌ చేయలేక యాక్సిడెంట్ చేశాడు.

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేరళలో జరిగిన ఈ ప్రమాదం మితిమీరిన వేగంతో ప్రయాణించే జరిగే ఘోరానికి సజీవ సాక్ష్యం అని చెప్పవచ్చు. ఈ కారు డ్రైవర్‌ ఒక నిర్ధిష్టమైన వేగాన్ని పాటించి ఉంటే, ఈ ప్రమాదాన్ని సులభంగా అధిగమించేవాడు. కాబట్టి కారు లేదా బైకు ఏది డ్రైవ్ చేసినా... ఓ పరిమిత వేగం వరకు మాత్రమే డ్రైవ్ చేయండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Car Collides Head-On With Bike In A Horrific Crash In Kerala
Story first published: Saturday, December 30, 2017, 17:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark