చైనాలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

చైనాలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలు "ఫుక్సింగ్"ను ఆ దేశ రైల్వే విభాగం అధికారికంగా ప్రారంభించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే బీజింగ్-షాంఘై రైల్వే లైనులో దీనిని నడిపారు.

By Anil

బుల్లెట్ రైళ్లు అంటే ఇప్పుడు చైనానే గుర్తొస్తుంది. బుల్లెట్ రైళ్ల కోసం విపరీతమైన ప్రయోగాలు చేస్తూ, అత్యంత వేగవంతమైన రైళ్లను ఆవిష్కరించడంలో చైనా అపార అనుభవాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలు కూడా చైనాలోనే ఉంది. అయితే సాధారణ ట్రాక్ మీద అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు....

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

తాజాగా "ఫుక్సింగ్" అనే బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. విమానంలోని లగ్జరీ వసతులను తలదన్నే రీతిలో ఉన్న ఈ రైలు గరిష్టంగా గంటకు 400కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం చైనాలోని బుల్లెట్ రైళ్లలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు ఇదే.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నెక్ట్స్ జనరేషన్ బుల్లెట్ రైలును రూపొందించింది. చెైనాలో సాధారణ ట్రాక్ మీద అత్యధిక వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలును, చెనాలో అత్యంత బిజీగా ఉండే బీజింగ్ - షాంఘై మార్గంలో ప్రారంభించింది.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

CR400AF మోడల్ బుల్లెట్ రైలును ఫుక్సింగ్ పేరుతో చైనా రైల్వే పిలుస్తోంది. గంటకు 400కిలోమీటర్ల గరిష్ట వేగం ఉన్న ఈ రైలు నిర్ధిష్టంగా గంటకు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

ఫుక్సింగ్ లేదా రెజువెనేషన్ గా పిలువబడే ఈ రైలును ఉదయం 11:05 గంటలకు బీజింగ్ దక్షిణ రైల్వే స్టేషన్ నుండి షాంఘైకు బయలుదేరగా, అదే సమయానికి మరో ఫుక్సింగ్ రైలు షాంఘై హాంగ్వియావో స్టేషన్ నుండి బీజింగ్‌కు బయలుదేరింది.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

బీజింగ్ నుండి షాంఘై మధ్య ఉన్న పది రైల్వే స్టేషన్‌లలో ఆగుతూ, 5 గంటల 45 నిమిషాల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంది. ఫుక్సింగ్ లేదా రెజువెనేషన్ గా పిలువబడే ఈ రైలును సాంకేతికంగా ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(EMU) పేరుతో కూడా పిలుస్తారు.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

షాంఘై నుండి బీజింగ్ మధ్య రోజూ ఐదు లక్షల ఐదు మంది ప్రయాణిస్తుంటారు. చైనాలోనే అత్యంత రద్దీతో కూడుకున్న రైల్వే మార్గం ఇది. ఈ రెండింటి మధ్య చైనాలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును నడపడానికి ఫుక్సింగ్‌ రైలును చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి తయారు చేసింది.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

ఫుక్సింగ్ రైలులో అధునాతన మానిటరింగ్ సిస్టమ్(పర్యవేక్షణా వ్యవస్థ)ను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ రైలు మొత్తం పనితీరును క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంటుంది. ఏవైనా అత్యవసర మరియు అవాంతర పరిస్థితులు ఎదురైనపుడు రైలు వేగాన్ని ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

రైలులోని రిమోట్ డాటా ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ మరియు కంట్రోల్ సిస్టమ్ రైలు యొక్క పనితీరును రియల్ టైమ్‌లో మానిటర్ చేస్తుందని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

చైనా రైల్వే కార్పోరేషన్ జనరల్ మేనేజర్ లూ డాంగ్‌ఫూ మీడియాతో మాట్లాడుతూ, "చైనా యొక్క హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌లో ఫుక్సింగ్ రైలు విభిన్న పాత్ర పోషించనుంది. చైనా యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఇది కీలకంగా వ్యవహరించనుంది తెలిపాడు."

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

ఈ రైలు ఇంటీరియర్ విషయానికి వస్తే, విమాన క్యాబిన్ తరహాలో ఇంటీరియర్ కలదు. సౌకర్యవంతమైన సీటింగ్, సమాచారం కోసం పెద్ద డిస్ల్పేలు మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి.

2016 లెక్కల ప్రకారం, 22,000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా చైనా తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచ మొత్తం మీద ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లో 60శాతం చైనాలోనే ఉంది. వీడియో ద్వారా ఫుక్సింగ్ బుల్లెట్ రైలును వీక్షించగలరు....

అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును ప్రారంభించిన చైనా రైల్వే

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు మాగ్లేవ్ చైనాలో ఉంది. బుల్లెట్ రైళ్ల కన్నా మాగ్లేవ్ రైళ్లు అధునాతనమైనవి. బుల్లెట్ రైళ్లు వినియోగించే సాధారణ పట్టాలు కాకుండా, ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్ మీద మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఫోర్స్ ద్వారా మాగ్లేవ్ రైళ్లు పరుగులు పెడతాయి.

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu: China Debuts Its Fastest Bullet Train ‘Fuxing’
Story first published: Tuesday, June 27, 2017, 14:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X