దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు: మరి ఇండియన్ పోలీసుల పరిస్థితేంటి?

దుబాయ్ తమ పోలీసులకు సరళతరమైన గస్తీ నిర్వహణ కోసం ఎగిరే బైకులను అందిస్తోంది. స్కార్పియో అని పిలువబడే ఈ ఎగిరే బైకులను రష్యా టెక్ దిగ్గజం హోవర్‌సర్ఫ్ వీటిని నిర్మించిన దుబాయ్‌కు అందివ్వనుంది.

By Anil

ప్రజల వద్ద మరియు పర్యవేక్షకుల వద్ద గల సాంకేతక పరిజ్ఞానం మరియు టెక్నాలజీ సరిమానంగా ఉంటే భద్రత మరియు పర్యవేక్షణలో వ్యవస్థ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఇండియాను చెప్పుకోవచ్చు. తప్పు చేసే వాడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గల వాహనాలను వాడుతుంటే... పట్టుకునే పోలీసుల వద్ద మాత్రం అంతంత పరిజ్ఞానం ఉన్న వాహనాలు ఉన్నాయి.

దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

అయితే, ఇలాంటి వ్యవస్థకు పూర్తి భిన్నంగా చెప్పుకునే దుబాయ్ తమ పోలీసుల కోసం ఎగిరే బైకును విజయవంతంగా అభివృద్ది చేసి పరీక్షించింది. విధి నిర్వహణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దుబాయ్ దూసుకుపోతోంది. దుబాయ్ మాత్రమే కాదు చాలా దేశాలు ఇదే మార్గంలో ఉన్నాయి. పెట్రోలింగ్ కోసం విదేశీ పోలీసులు వాడే టెక్నాలజీలో కేవలం పది శాతం ఇండియా వినియోగిస్తే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు.

దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

దుబాయ్ పోలీసు వ్యవస్థలో ఏగిరే బైకులే కాదు, వీరి వాహన శ్రేణిలో ల్యాంబోర్గిని గస్తీ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ రోబోలు, ఆండ్రాయిడ్ ఆఫీసర్లు వీటితో పాటు పర్యవేక్షణ మరియు గస్తీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. గగనతలం నుండి గస్తీ కాయడానికి ఎగిరే మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

దుబాయ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగిరే బైకుకు స్కార్పియో అనే పేరు పెట్టారు. రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్ అనే సంస్థ ఈ స్కార్పియో ఎగిరే బైకును నిర్మించింది. బైకు నలుదిక్కులా నాలుగు ప్రొపెల్లర్స్ మరియు నాలుగు బ్లేడ్లు ఉన్నాయి. మధ్యలో రైడర్ సీట్ ఉంటుంది.

  • కార్ వాష్ చేసి, సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్
  • Recommended Video

    Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
    దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

    హోవర్‌సర్ఫ్ ఎగిరే బైకు 25 నిమిషాల్లో 64కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సింగల్ సీటు మాత్రమే ఉన్న ఈ బైకు గరిష్టంగా 272కిలోలు మోస్తుంది మరియు స్వయం చాలకంగా కూడా పనిచేస్తుంది.

    డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ఎక్కువ మంది చదివినవి:

    • 37కిమీల మైలేజ్‌తో బాలెనో, ఐ20 లకు పోటీగా నిస్సాన్ నోట్
    • కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తోంది
    • బాలెనో మరియు ఐ20 లకు పోటీగా టాటా నుండి వస్తున్న కొత్త మోడల్ ఇదే
    • దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

      ఎగిరే బైకు పనితీరు చాలా చక్కగా ఉంది కదూ... అందుకే కాబోలు దుబాయ్ పోలీసులు ఈ బైకును తమ పెట్రోలింగ్ వెహికల్స్ శ్రేణిలో చేర్చుకోవడానికి తహతహలాడుతోంది. స్మార్ట్ సిటి ప్రణాళికల్లో భాగంగా ఇలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వెహికల్స్ వినియోగిస్తోంది.

      దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

      హోవర్‌సర్ఫ్ సిఇఒ అలెగ్జాండర్ అటమనోవ్ ఫేస్‌బుక్ పేజీ మేరకు, కంపెనీ దుబాయ్ పోలీసులకు భారీ సంఖ్యలో ఎగిరే బైకులను దుబాయ్‌లో తయారుచేసి సరఫరా చేయడానికి దుబాయ్ పోలీసులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

      దుబాయ్ పోలీసులకు ఎగిరే బైకులు

      దుబాయ్‌లో జరుగుతున్న గిటెక్స్ టెక్నాలజీ ప్రదర్శన వేదిక మీద దుబాయ్ పోలీసులు ఈ ఎగిరే మోటార్ సైకిల్‌ను ప్రదర్శించారు. ఇదే వేదిక మీద జపాన్ దిగ్గజం మికాసా నిర్మించిన గంటకు 200కిమీలు ప్రయాణించే కాన్సెప్ట్ బైకు కూడా కొలువుదీరింది.

      హోవర్‌సర్ఫ్ సంస్థకు చెందిన స్కార్పియో ఎగిరే బైకు ఎలా ప్రయాణిస్తుందో ఇక్కడున్న వీడియోలో వీక్షించగలరు....

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      పోలీసుల గస్తీ కోసం అత్యాధునిక పరిజ్ఞానం ఉన్న వాహనాలను వినియోగిస్తున్న దేశాలలో దుబాయ్ ఎంతో ముందుంది. సరళతరమైన మరియు వేగవంతమైన సర్వీసు కోసం పోలీసులకు కొత్త టెక్నాలజీలను దుబాయ్ పోలీసు విభాగం సమకూరుస్తోంది. చాలా దేశాలు తమ దేశ ప్రజల భద్రత విషయంలో దుబాయ్‌ను ప్రేరణగా తీసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు.

Most Read Articles

English summary
Read In Telugu: Dubai police test flying bike scorpian by hoversurf
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X